గురువు అంటే ఎవరు

Indian Teacher Photo by Anil Sharma from Pexels: https://www.pexels.com/photo/teacher-with-her-students-11367436/
Reading Time: 2 minutes

గురువు అంటే ఎవరు

గురువు మన లోని అజ్ఞానాన్ని తొలగించేవాడు. అది ఏ విధమైన అజ్ఞానమైనా సరే. కాబట్టి గురువు దైవం తో సమానం. నిస్వార్థమైన గురువు తన జ్ఞానాన్ని తన శిష్యులకు అందిస్తాడు. గురువుకు జాతి మతం కులం స్త్రీ పురుష బేధం లేదు. గురువు తన శిష్యుడు తనకంటే మించిపోవాలనుకుంటాడు.

గు అనగా అజ్ఞానమ్. రువు   అంటే తొలగించేవాడు.

గురువునే ఆచార్యుడు అనీ అధ్యాపకుడనీ నిపుణుడనీ మాన్స్టర్ అనీ అంటారు. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశాన్ని పెంచేవాడు. గురువుకి సమాజంలో ప్రత్యేక మరియు ఉత్తమ స్థానం ఉంది. పూర్వం పెద్దలు చెప్పినట్లుగా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం  బ్రహ్మ తత్ స్మై శ్రీ గురవే నమః అని చెప్పి యున్నారు.

గురువు ను బ్రహ్మ అంటే సృష్టి కర్తగా అతనినే విష్ణువుగా అంటే లోకాలనన్నిటినీ పాలించే వాడుగా, అతనినే మహేశ్వరుడుగా అంటే అన్నిటికీ అంతటికీ శుభాన్ని కూర్చేవాడుగా చేసేవాడుగా అభివర్ణించారు. అటువంటి గురువుకి నా శ్రద్ధ మరియు నమస్కారములు అని పై శ్లోకానికి అర్ధం. గురులేక ఎటువంటి ఉనికి తెలియదు అనే త్యాగరాజు కీర్తన లా గురువు ప్రతీ మనిషికి చిన్నప్పటినుండి సమాజం లో కనిపిస్తాడు.

Photo by Anil Sharma from Pexels: https://www.pexels.com/photo/woman-in-salwar-kameez-teaching-pre-schooler-kids-sitting-inside-a-classroom-11366734/

గురువు ఒక పుస్తకమే కావొచ్చు లేదా పాఠశాలలో కనిపించే ఉపాధ్యాయుడే కావొచ్చు. గురువు లేకపోతే జీవితం అంతా అజ్ఞాన బంధురం అవుతుంది. స్వాధ్యాయం అంటే ఎవరికి వారు చదువుకోవడం లేదా జ్ఞానాన్ని ఆర్జించడం. ఎవరికీ వారు చదువుకున్నా పుస్తకం లేదా నిత్యా జీవనంలో చూసే ఆధునిక కంప్యూటర్లో దొరికే జ్ఞానమే కావొచ్చు.  ఆ పుస్తకమే లేదా ఆ కంప్యూటర్ లో దొరికినా జ్ఞానమే  గురువౌతుంది.

ఎటువంటి జ్ఞానమైనా ఇతరులకు పనికివచ్చే విధంగా ఉంటే అటువంటి చదువుకు కానీ జ్ఞానానికి గాని సదుపయోగం  కలుగుతుంది. విద్య లేని వాడు వింత పశువు అని కూడా పూర్వీకులు చెప్పిన సామెత. చదువు లేనివాని తన జీవితమంతా మూర్ఖుడిగానే ఉంటాడు. జ్ఞాన ప్రకాశం లేనందున జీవితంలో ఏమి సాధించలేడు.

నీటి బుడగ వలె ఉద్భవించి నశిస్తుంది. అదేవిధంగా ఈ మానవుడైనా సమాజానికి గాని సంఘానికి గాని ఏవిధమైన ఉపయోగం చేయకుండా కేవలం స్వార్థంగా బ్రతికి మరణిస్తే దానివల్ల తనకుగాని సమాజానికి కానీ ఏవిధమైన ఉపయోగం లేదు. కావున ప్రతీ మనిషి జ్ఞానం యొక్క మహత్వాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని సదుపయోగపరచి తమ తమ జీవితాలను ధన్యం చేసుకుంటారని ఆశిద్దాం. 

Leave a Reply