Monkey Photo by Neal Smith from Pexels: https://www.pexels.com/photo/de-brazza-s-monkey-12471586/
Reading Time: 2 minutes

అత్యాశ

ఒక ఊరిలో ఒక కోతి ఒక కుందేలు ఉండేవి. అవి చాలా స్నేహితంగా ఉండేవి. కోతి తన చాకచక్యంతో ఎదుటివారిని తన జిత్తులతో పడేసేరకం. కుందేలు పాపం అమాయకురాలు. కోతి విషయం తెలియక స్నేహం చేసింది. ఊరి చెరువు దగ్గర శనగల తోట ఉన్నట్టు ఇద్దరికీ తెలిసింది.

ఇద్దరూ కలసి కట్టుగా ఆలోచనతో కుందేలు శనగలను కొరికి తే కోతి  ఆ శనగలను తోటనుండి తెచ్చ్చేటట్టుగా పథకం వేసాయి. సాయంత్ర మవుతుండగా తోటమాలి ఇంటికి బయలు దేరిన తరువాత కోతి కుందేలు రెండూ కలసి తోటపై బడి తమ పథకం ప్రకారం కుందేలు శనగలను కొరకడం కోతి వాటిని ఏరి కుప్పగా పోయడం ప్రారంభించింది. చూస్తుండగా వాటికి బాగానే శనగలు లభ్యం అయ్యాయి. దానితో కోతి కి దురాశ మొదలయ్యింది .

తనకే ఎక్కువ శనగలు ఎక్కువ రావాలన్న దురాశతో ” కుందేలు బావా మనం బాగానే శనగలను సంపాదించాము కదా ఇక భాగాలను తీసుకుందాము ” అని అంది.. దానికి కుందేలు ” మనం ఇద్దరమూ కష్టపడ్డందుకు చెరి సగము పంచుకుందాము ” అంది.

కోతి దానికి ” సరే ” అని ” నువ్వు ని చేతి దోసిళ్ళతో ఐదు కుప్పలు తీసుకో. నేను నా చేతి దోసిళ్ళతో ఐదు కుప్పలు తీసుకుంటాను ” అంది. కోతి ఉద్దేశ్యం లో తన చేతులు పెద్దగా ఉంటాయి కుందేలు చేతులు ఎలాగూ చిన్నగా ఉంటాయి కదా కాబట్టి తనకే ఎక్కువ శనగలు లభిస్తాయని ”  సంతోషపడింది.

 కొన్ని రోజులు అలా కుందేలుకు తెలియకుండానే కోతి ఎక్కువగా శనగలను దొబ్బేయ్యడం ప్రారంభించింది. ఒకరోజు కుందేలు కు ఒంట్లో నలతగా అనిపించి తన మిత్రుడైన ఇంకొక కుందేలును కోతిబావ సాయానికి వెళ్ళమంది. ఆ మిత్రుడైన కుందేలు చాలా తెలివైనది, మంచిది కూడా. 

కోతి దొంగ పనులను ఇట్టే పట్టేసింది. కోతికి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని కొన్ని రోజులు తనకు ఏమి తెలియనట్లే కోతి చెప్పినవిధంగా సాయపడుతూ ఇలా అంది ” కోతిబావా మన కుందేలు ఒక్కతే ఇంట్లో అవస్థ పడుతోంది కదా అందువల్ల నేను భాగం తీసుకునే బదులు ఈ అన్ని శనగలను కుందేలు ఇంటికి తీసుకువెళ్లి అక్కడ పంచుకుందాం ” అంది.

ఒప్పుకోక పొతే అసలు తనకు సాయపడేమో అనుకోని కోతి ఒప్పుకొంది. ఇంటికి వెళ్ళగానే ” మొదటగా మేము తీసుకుంటాము ” అని ” ఇదిగో నా దోసిళ్ళతో నేను ఐదు సార్లు శనగలు తీసుకుంటున్నాను. మన మిత్రుడైన మరో కుందేలుకు కూడా ఐదు దోసిళ్ళ శనగలు.

అలాగే కోతిబావా ఇంకా నువ్వు ఎందుకు కష్టపడతావు. అన్ని శనగలను సమకూర్చి నీ చేతులు నొప్పి పెడుతూ ఉంటాయి. నీ బదులు నేనే నీకు కూడా ఐదు దోసిళ్ళ శనగలు ఇస్తాను. ” అంటూ చాలా తక్కువ శనగలను దోసిళ్ళతో పోసింది. కోతిబావకు ఏమనాలో తెలియక తను చేసిన అత్యాశ పనులను తెలుసుకున్నారనుకొని ఏమీ అనలేక నోరు మెదలకుండా కూర్చుంది.

అప్పటికే కుందేలు తన మిత్రుడికి ఈ విషయం చెప్పినందుకు కుందేలు కూడా కోతికి తగిన శాస్తి జరిగిందని సంతోషించింది.

Leave a Reply