దురాశ దుఃఖానికి చేటు

Indian Girls Photo by Yan Krukov from Pexels: https://www.pexels.com/photo/women-in-traditional-dresses-8819420/
Reading Time: 2 minutes

దురాశ దుఃఖానికి చేటు

 అనగనగా ఒక ఊళ్లో విశాలుడు కుశలుడు అనే ఇద్దరు ఆ సామేలు ఉండేవాడు వాళ్ళిద్దరికీ ఏ విధంగానైనా డబ్బు ఎక్కువగా సంపాదించాలని ఉండేది. వీరిద్దరూ ఎక్కువగా ఆస్తిపరులు కారు. ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వాళ్ళిద్దర్నీ చూసి ఊళ్ళోవాళ్ళు ముచ్చటపడి ఇద్దరు యువతీ మణులను ఇచ్చి వివాహం చేశారు.

తర్వాత వారిద్దరూ ఏ విధంగానైనా డబ్బు సంపాదించి దాన్ని బయల్దేరారు వెళ్తూ ఉండగా ఒక అరణ్యం వచ్చింది. ఆ అరణ్యంలో ఒక పెద్ద చెట్టు కింద ఒక స్వామి తపస్సు చేసుకుంటున్నారు. ఆ స్వామి చాలా రోజుల నుండి తపస్సు చేసుకుంటున్నట్టు గా ఉన్నది ఆ స్వామి కూర్చుని చూస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఆ స్వామి కళ్ళు తెరిచి తన చూస్తారని ఆశతో కూర్చుని చూస్తూ ఉన్నారు. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత స్వామి కళ్ళు తెరిచారు. వీరిరువురినీ చూశారు. వీరిద్దరూ చేతులు జోడించి స్వామిని ఈ విధంగా అడిగారు “స్వామీ మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ప్రభావశాలి లాగా ఉన్నారు. మాకు ఏదైనా వరం ప్రసాదించి మమ్మలిద్దర్నీ ధన్యులను చేయండి” అన్నారు.

 ఆ స్వామి తన దివ్యచక్షువు లతో వీరిద్దరి ఆకాంక్షను గ్రహించారు. వీరిద్దరికీ డబ్బు ఎక్కువగా సంపాదించాలని ఉన్నది అని గ్రహించారు. అయినా పైకి ఏమీ అనకుండా “నాయనలారా వీరిద్దరికీ నేను దివ్యోపదేశం  చేస్తాను.

దీనిని మీరు పది రోజుల వరకూ బ్రహ్మచర్యం చేస్తూ ఈ మంత్రాన్ని మననం చేస్తూ పదకొండవ రోజున దేవుని ఎదుట మూడు కొబ్బరికాయలను కొట్టినచో మీరు విధంగా లభిస్తాయి భగవంతుడు మీరు ఏమి కోరుకుంటే మీరు కోరిన విధంగా భగవంతుడు మీ కోరికలను నెరవేర్చుతాడు.  ” అని స్వామీజీ తెలిపారు. సరేనంటూ “మీ దర్శన భాగ్యం వల్ల మీ దివ్య అనుగ్రహం వల్ల మాకు ఈ మంత్రోపదేశం జరిగింది దానికి మేము ధన్యులం ” అంటూ అతనికి నమస్కరించి ఆ దివ్య మంత్రోపదేశం తెలుసుకున్నారు. తర్వాత నమస్కరించి తమ ఊరి వైపుకు ప్రయాణించారు. ఇంటికి వచ్చి ఇద్దరూ తమ తమ భార్యలకు చెప్పారు. 

విశాలుని భార్య ఉత్తమురాలు. ఆవిడ భర్తతో పాటు పది రోజులు బ్రహ్మచర్యం కొనసాగిస్తూ పూజలో నిమగ్నురాలై భర్తకు శాయశక్తులా తోడ్పడింది. విశాలుడు 11వ రోజు యధాప్రకారం పూజలో నిమగ్నమై మూడు కొబ్బరికాయలను కొట్టాడు. భగవంతుడు ప్రత్యక్షమై “నాయనా నీకు ఏమి కావాలి..” అని అడిగాడు. విశాలుడు భగవంతునికి నమస్కరించి ” దేవుడా నాకు నా దేశం బాగుండాలి, నా సమాజం బాగుండాలి మరియు నా భవిష్యత్తును కూడా బాగుపరుచు అని 3 కోరికలను కోరుకున్నాడు.  అదేవిధంగా భగవంతుడు దేశాన్ని సస్యశ్యామలం చేశాడు. సమాజాన్ని ఉద్ధరించాడు. ఇంకా విశేషాలు ఉద్యోగం వచ్చే విధంగా తద్వారా అతనికి ఆదాయం ఎక్కువగా వచ్చే విధంగా సహాయపడ్డాడు.

 కుశలుని భార్య చాలా కు ఆడంబరం ఎక్కువ.ఆమె తన భర్త కు వచ్చిన  మంత్రోపదేశం గురించి ఊరి వారందరికీ ఈ పది రోజులలో గొప్పలు చెప్పసాగింది. పది రోజులు అలా గడిచిపోయాయి. పదకొండవ రోజు రాత్రి ప్రతి రెండు గంటలకు  లేపుతూ “ఏమండీ మీరు భగవంతుని ” రేపు ఏమి అడుగుతారండి. నాకు నగలు , వజ్ర వైఢూర్యాలను  ప్రసాదించమని అడగండి..ధనాన్ని అడగండి..”అంటూ వేధించసాగింది.. దాంతో కుశలునికి చాలా తలనొప్పి కలిగింది..ఎదో అడుగుతానులేవే ..అంటూ నిద్రలోకి జారుకున్నాడు.

ప్రొద్దున 4 గంటలకు  పూజ ప్రారంభిద్దామని లేచాడు.. మళ్ళీ కుశలుని భార్య సతాయించసాగింది.  అదే కోపంలో ఆ మూడు కొబ్బరికాయలను కొట్టాడు. భగవంతుడు ప్రత్యక్షమై “ఏమి కావాలి నాయనా ..”అని అడిగాడు. అతను భార్య  వైపు చూస్తూ “ నీ  తలకాయ” అన్నాడు. వెంటనే భార్య తలకాయ తెగి కింద పడిపోయింది. రెండవ కొబ్బరికాయ కొడుతూ “నా తలకాయ..” అన్నాడు. దానితో కుశలుని తలకాయ తెగి కింద పడిపోయింది. ఇక మూడవ కొబ్బరికాయ కొడుతూ మా తలకాయలు మాకు రావాలి ..దీవించండి..” అంటూ భగవంతుని కోరుకున్నాడు. వారి తలకాయలు వారికి వచ్చేసాయి.

కుశలుని పరిస్థితి ఏ మాత్రం బాగుపడలేదు. కేవలం వారి తలకాయలు వారి యథాస్థానానికి వచ్చేశాయి.

చూశారా.. దురాశ, అసహనం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో..వారిరువురూ తలలు బాదుకున్నారు. కుశలుని భార్యకు బుద్ధి వచ్చింది.

Leave a Reply