సరదాగా కాసేపు నవ్వుకుందాం!

Happy @pexels.com
Reading Time: < 1 minute

సరదాగా కాసేపు నవ్వుకుందాము!* నరేష్ , రాణి మధ్య ఫన్నీ ఇంటర్వ్యూ

నరేష్ :- పేరు ఏంటి అమ్మ
రాణి :- నరేష్
నరేష్ :- ఏంటి జోకా నేను అడిగింది నా పేరు కాదు. నీ పేరు .
రాణి :- మీరు పేరు ఏంటి అన్నారు. మీ పేరు ఏంటి అని అడగలేదుగా.
నరేష్ :- ఆహా సరేలే దేనికోసం వచ్చావు ఇక్కడికి
రాణి :- బయట ఎండగా ఉంది .కొంచం సేపు ఏసి లో ఉంటే చల్లబడ్తా అని వచ్చా.
నరేష్ :- నీ దగ్గర చాలా వేషాలు ఉన్నాయి. సరే రెస్యూమ్ తెచ్చావా…!
రాణి :- అది తీసుకు రాలేదు లే కానీ. ఆవకాయ పెరుగు అన్నం కలిపి బాక్స్ తీసుకొచ్చా. ఆకలి వేసినప్పుడు తిందాము అని.
నరేష్ :- మీరు జాబ్ కోసము వచ్చారా ? ఆవకాయ పెరుగు అన్నము తినడం కోసం వచ్చారా ?
రాణి :- ఇప్పుడు ఏంటి మీకు రెస్యూమ్ కావాలి అంతే గా.

నరేష్ :- ఉంటే నా మోహనా కొట్టండి.
రాణి :- వైట్ పేపర్ ,పెన్ ఇవ్వండి. (పేపర్ మీద రెస్యూమ్ అని రాసి ఇస్తాది.)
నరేష్ :- అవునా ఐతే అగు ( అదే వైట్ పేపర్ మీద జాబ్ అని రాసి ఇస్తారు.) ఇదిగో జాబ్ తీసుకో అని ఇస్తారు.

* ఒక ఇంట్లో ఒక చిన్న పాప స్కూలుకి వేళ్ళను అని రోజు మారం చేస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మ
ఇలా చెప్తాది.

అమ్మ :- స్కూలుకి వెళ్లకపోతే నీకు సినిమా చూపించను అని చెప్తుంది.నువ్వు స్కూలుకు వెళ్తేనే సినిమా చూపిస్తాను.
కూతురు :- సరే సరే అమ్మ .నేను స్కూలుకి వెళ్తా. నాకు సినిమా చూపించాలి.
అమ్మ :- మా కూతురు బంగారం చెప్పిన మాట వింటుంది.
కూతురు :- అమ్మా …!! నా స్కూలు ఐపోయిన్ది. పదా సినిమాకి వెల్దాము అంటాది.
అమ్మ :- కూతురా …నేను ఏమి అన్నానో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.
కూతురు :- స్కూలుకు వెళితే సినిమా చూపిస్తా అన్నావు.
అమ్మ :- కదా . నిన్ను సినిమాకి తీసుకెళ్తా అని చెప్పలేదు. సినిమా చూపిస్తా అన్నా. మన టీవీ లో ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని సినిమాలు వస్తాయి. ఇదిగో రిమోట్ నీకు కావలిసిన సినిమా చూడు అని చెప్తాది.
కూతురు :- అమ్మా ..ఇది అంత మోసం ఈ రోజు ఆదివారం . సీరియల్స్ రావు అని రిమోట్ నాకు ఇచ్చేసి సినిమాలు చూసుకో అంటున్నావ్.

* టీచర్ , స్టూడెంట్ మధ్య సంభాషణ

టీచర్ :- క్లాస్ లో ఎప్పుడు ఐన ఫస్ట్ వచ్చావా నువ్వు.

స్టూడెంట్ :- అది ఏంటి టీచర్ అలా అన్నారు. బెల్ కొట్టగానే క్లాస్ నుంచి వెళ్లిపోవడంలో నేనే కదా ఫస్ట్.

టీచర్ :- హ.. హ నువ్వు దానిలో తప్ప దేనిలో ఫస్ట్ రాలేవు లే.


Leave a Reply