జీవితం చెప్పిన పాఠాలు

Life @pexels.com
Reading Time: < 1 minute

జీవితం చెప్పిన పాఠాలు

జీవితం మనకు చాలా నేర్పిస్తుంది . జీవితం ఒక గమ్యం. మనము వెళ్లే గమ్యంలో మంచి మనుషులు ఉంటారు. అలాగే మనం గమ్యాన్ని మధ్యలో ఆపే మనుషులు ఉంటారు. ఇక్కడ మనము ఒక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే మంచి మనిషిగా పేరు తెచ్చుకోవాలి అంటే దాని వెనుక ఎన్నో ఏళ్ళ” శ్రమ ” ఉంటుంది .


అలాగే ” మంచి మనిషి “ఎప్పుడూ కూడా ఒంటరిగానే నడుస్తాడు. మంచి మనిషి వెళ్ళే గమ్యం మధ్య లోకి రాగలరేమో కానీ మంచి మనిషి వెళ్లే గమ్యాన్ని ఆపడం ఎవరికి ” సాధ్యం ” కాదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఎప్పుడూ మంచి చేయడానికె ఉంటుంది. ఉదాహరణకు ఒకటి చెప్పుకుందాం. పాఠశాల్లో చెప్పే పాఠాలు మనము గుర్తు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చెయ్యము. కానీ జీవితం చెప్పే పాఠాలు మనము ఎంతగా మర్చిపోదామనుకున్నా మనకి ఇంకా ఇంకా గుర్తు చేస్తూనే ఉంటాయి.


జీవితంలో కష్టాలు , సుఖాలు , దుఃఖాలు అన్ని ఉంటాయి . పైన చెప్పినవన్ని ఉంటేనే అది జీవితం అవుతుంది. కష్టం వచ్చినప్పుడు బోరున ఏడుస్తాము లేదా వేరే వాళ్ళ సాయం కోసం ఎదురుచూస్తా ఉంటాము. ఆ ఆలోచన మనిషి మానుకోవాలి. ఎందుకంటే మనిషికి కష్టం వచ్చినప్పుడే మాత్రమే ఎదుటి వాళ్ళు గుర్తు వస్తారు. అప్పుడు మనిషి ఏమి చెయ్యాలంటే మానసికంగా శక్తిమంతులై ఎంతటి కష్టం వచ్చినా ఒంటరిగా ఎదుర్కోవాలని అనుకోవాలి.

అలా అనుకున్నప్పుడు మనిషికి ఎంతటి కష్టం వచ్చినా కష్టంగా అనిపించదు. మనలో కొంత మంది ఏదయినా పని చేసేటప్పుడు కోపంగా ఉంటారు . కోపంతో మనము ఏమి సాధించలేము ??కోపంతో మన అన్న వాళ్ళను కూడా దూరం చేసుకోవడం తప్ప మనకి ఏమి రాదు !! కోపం వచ్చినప్పుడు మనము కోపాన్ని ఎప్పుడు ఐతే జయించగలమో అప్పుడే మన ” జీవితానికి ” ఒక అర్థం ఉంటుంది .

దూసుకెళ్లే బాణానికే తెలుసు అది ఎంత వేగంగా వెళ్ళ గలదని, అలాగే మంచి మనిషికి మాత్రమే తెలుసు మన దగ్గర ఉన్నది నలుగురికి పంచాలని.


ప్రాణం లేని బాణమే గురి తప్పకుండా తన పని తాను చేసుకుంటాది. మరి ప్రాణం ఉన్న మనిషి మాత్రం అడ్డ దారులు వెతుక్కుంటు నడుస్తావుంటాడు. అడ్డ దారుల్లో వెళ్లడం మనము మానుకోవాలి .

ఒక ఆలోచన మనిషిని మారుస్తుంది అంటారు కదా మరి మనిషి ఎందుకు ఆలోచన దగ్గరే ఆగిపోతున్నాడు ??ఎదుటివాళ్ళ గురించి ఎప్పుడైతే ఆలోచించడం మానేస్తారో ?? అప్పుడు మీ ” ఆలోచన ” ఏంటో బయటికి వస్తుంది !!! ఎదుటి వాళ్ల గురించి ఆలోచించడం మానేయండి.

Leave a Reply