పోలీస్ చేసిన సాయం

పోలీస్ చేసిన సాయం
Reading Time: 3 minutes

పోలీస్ చేసిన సాయం

ఒక గ్రామంలో , సత్యం , లక్ష్మి వారి కూతురు రోజా ఒక చిన్న ఇంటిలో నివసిస్తూ ఉండేవాళ్ళు . వాళ్ళ కూతురిని బాగా కష్టపడి చదివించే వాళ్ళు. కానీ వారి కూతురు మాత్రం అస్సలు చదివేది కాదు . కానీ లక్ష్మి మాత్రం ఆ గ్రామంలో కూరగాయలను
అమ్ముకుంటు ఉండేది . సత్యం , వ్యవసాయం చేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు . ఒక రోజు రోజా , సత్యం దగ్గరికి వచ్చి ఇలాగా అడుగుతుంది.

రోజా :- నాన్న , నేను సరిగా చదవటల్లేదని నా మీద కోపం వస్తుందా ??

సత్యం :- ఎందుకు రోజా అలా అడుగుతున్నావు ?ఇప్పుడు నీకు ఏమైంది ? డబ్బులు ఏమైనా అవసరం ఉన్నాయా ??

రోజా:- నాకు ఏమి కాలేదు నాన్న , చదువుకోవడం నా వల్ల కావడం లేదు నాన్న .

సత్యం :- ఐతే నాతో పాటు పొలం పని చేస్తావా ???

రోజా :- హ చేస్తాను నాన్న …నాకు చాలా ఇష్టం పొలాలు అంటే …అని చెప్తుంది.

మరుసటి రోజు రాత్రి సత్యం , లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటారు.

సత్యం :- ఏంటి లక్ష్మి , రోజాని మనము కష్ట పడి చదివిస్తుంటే తను ఏమో పొలం పనులు చేస్తాను . పొలాలు అంటే నాకు చాలా ఇష్టం అంటోంది.

లక్ష్మి :- రోజాకి చదువుకోవడం ఇష్టం లేదు . అది మనము తెలుసుకోకుండా తనని బాధ పెడుతున్నాము అని సత్యంతో అంటుంది.

సత్యం :- మరి మనము ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం వృధా ఐనట్లేనా…??

లక్ష్మి :- ఆ ప్రశ్న రోజాని అడగండి . నన్ను కాదు. తనకి పొలం పనులు అంటే చాలా ఇష్టం . ఒక్కసారి పొలానికి తీసుకెళ్లి పొలం పనులు చేపించండి. అప్పుడు మనము పడుతున్న బాధలు రోజాకి కూడా తెలుస్తాయి అని చెప్తుంది.

రోజా గురించి లక్ష్మి , సత్యం బాగా ఆలోచించి పొలానికి తీసుకెళ్లాలని అనుకుంటారు . కానీ రోజా మాత్రం వారికంటే ముందుగా పొలానికి
వెళ్లాలనుకుంటాది. పొలంలో బాగా పని చేసి మా అమ్మా నాన్నలకు సాయంగా ఉండాలి. వారు ఇంకెప్పుడు నా వల్ల బాధ పడకుండా ఉండాలని రోజా మనసులో అనుకుంటాది.

మరుసటి రోజు సత్యం లేచి ఎప్పటి లాగానే పొలంలోకి వెళ్తాడు. సత్యం కంటే ముందుగా రోజా లేచి పొలానికి వెళ్తుంది.

సత్యం :- అమ్మా… రోజా నువ్వు ఇక్కడేమి చేస్తున్నావ్…

రోజా :- నేను పొలం పనులు చేస్తానని చెప్పానుగా నాన్న అని సత్యంతో అంటుంది.

అప్పుడే ఒక పోలీస్ కూరగాయలు కొనడానికి సత్యం పొలానికి వెళ్తాడు. అక్కడ రోజాని చూస్తాడు.

పోలీస్ :- కూరగాయలు కొనడానికి వచ్చాను అండి . ఈ అమ్మాయిని పొలానికి ఎందుకు తీసుకొచ్చారు అండి. అప్పుడు సత్యం :- చదువుకోవడం ఇష్టం లేదు, పొలం పనులు అంటే ఇష్టం అంటోంది సార్. మేము కూడా తీసుకురాలేదు. తనకి తానుగా ఇక్కడికి వచ్చింది సార్ అని సత్యం చెప్తాడు .

పోలీస్ రోజాని పిలిచి ఒక పరీక్ష పెడతాడు .

పోలీస్ :- రోజా నీకు చదువుకోవడం ఇష్టమా ? లేక ఈ పొలం పనులు ఇష్టమా ??

రోజా :- నాకు చిన్నప్పటి నుంచి చదువు ఇష్టం లేదు , పొలాలు అంటేనే ఇష్టం అని పోలీస్ సార్ తో చెప్తుంది . పోలీస్ :- మనసులో ఇంకా ఇలా కాదులే కానీ , వాళ్ళ అమ్మా నాన్న లు పడిన కష్టం తనకి కూడా తెలిసి రావాలి. అలా చేస్తే రోజా మారె అవకాశం ఉంది అని మనసులో అనుకుంటాడు.

పోలీస్ :- సరే రోజా …నీ మాటే గెలవాలంటే మీ అమ్మా , నాన్నలు చేసే ప్రతి యొక్క నువ్వు కూడా చెయ్యాలి . చేస్తావా ? మరి ??

రోజా :- ఏ పని ఐన చేస్తాను సార్.

పోలీస్ :- సత్యం …కూరగాయలు ఉన్న తట్టను తీసుకొచ్చి మీ అమ్మాయి నెత్తిన పెట్టండి .

పోలీస్ సార్ చెప్పినట్టు సత్యం , కూరగాయలు తట్టను రోజా నెత్తిన పెడతారు. రోజా వాటిని మోయలేక చాలా ఇబ్బందులు పడుతుంది. కొంచం దూరం మోయగానే తట్టను కింద పడవేస్తుంది. పోలీస్ సార్ , సత్యం వెళ్లి కూరగాయలను తట్టలోకి వేస్తారు. అప్పుడు
రోజా :- ఎంత బరువుగా ఉందో … నేను మోయలేక పోయాను . నా వల్ల అస్సలు కాలేదు.ఈ బరువులు మోయడం కన్నా పుస్తకాలు ముందు కూర్చోవడమే తేలికైన పని నాన్న . రోజు ఇంత బరువును ఎలా మోస్తున్నారు నాన్న .

అప్పుడు సత్యం :- మీ అమ్మా , నేను రోజు ఇన్ని బరువులు మోసి నిన్ను చదివిస్తున్నాము అమ్మా.

రోజా :- నన్ను క్షమించండి నాన్న . మీ కష్టం నాకు తెలిసింది. పోలీస్ సార్ మీ వల్లే నాకు మా అమ్మా నాన్న తెలిసేలా చేశారు . మీకు చాలా థాంక్స్ సార్ అని చెప్తుంది.. అప్పుడు
పోలీస్ :- ఒక్క చిన్న పనే నువ్వు సరిగా చెయ్యలేకపోయావు. మీ అమ్మ , నాన్నలు పడిన కష్టం నీకు తెలియకుండా నిన్ను చదివిస్తున్నారు. మరి అలాంటప్పుడు నువ్వు బాగా చదువుకోవాలి కదా .

రోజా :- తప్పు చేసాను సార్. మా అమ్మ నాన్నలను చాలా బాధ పెట్టాను. ఆ బాధను ఎలా ఐన పోగొడతాను . ఇప్పటి నుంచి బాగా చదువుకుంటాను సార్.

రోజాలో వచ్చిన మార్పుకు సత్యం చాలా సంతోష పడతాడు. పోలీస్ సార్ కు కృతజ్ఞతలు చెబుతాడు . అప్పుడు సత్యం :- మీరు చేసిన సాయం ఎప్పటికి మర్చిపోలేము సార్ . మా అమ్మాయి చెప్పిన మాట వినటల్లేదని మేము చాలా బాధ పడ్డాము. ఇప్పుడు ఆ బాధ పోయిన్ది .
పోలీస్ :- అమ్మాయిని బాగా చదివించండి. ఏమైనా సాయం కావాలంటే నన్ను అడగండి. నేను చేయగలిగిన సాయం చేస్తానని సత్యంతో చెప్పి వెళ్ళిపోతాడు.

సత్యం , రోజాని తీసుకొని ఇంటికి వెళ్తాడు. రోజా ఇంటికి వెళ్ళగానే పుస్తకాలు తీసుకొని చదవడం మొదలు పెడుతుంది. రోజాని చూసి లక్ష్మి షాక్ అవుతుంది. సత్యం , లక్ష్మికి పొలంలో జరిగిందంతా చెబుతాడు. ఆ మాటలు విని లక్ష్మి కూడా సంతోషిస్తుంది. కొన్ని రోజులు తర్వాత రోజాకి పరీక్షలు మొదలు అవుతాయి. రోజా రాసిన పరీక్షలు అన్నింటిలో పాస్ అవుతుంది. సత్యం , లక్ష్మి చాలా సంతోష పడతారు.

Leave a Reply