తెలుగు సూక్తులు

Sayings @pexels
Reading Time: < 1 minute


1. మన కోసం మనము చేసే పనిలో ఆనందం ఉంటుంది. అలాగే ఆ పని మనతోనే అంతరించి పోతుంది. పరులు కోసం పని ఆ ఒక్క రోజు మాత్రమే మనకి పనికి వస్తుంది. ఆ తరువాత మీరు చేసిన లెక్కలోకి కూడా రాదు ?? గుర్తుపెట్టుకోండి మిత్రమా !!

2. ఒక మనిషి నాశనం అవుతున్నాడు అంటే దానికి కారణం ఇంకోటి , ఇతర కారణాలు అంటూ ఏమి ఉండవు .అతని బుద్ధి మాత్రమే అతన్ని నాశనం చేస్తుంది. అతని పక్కన ఉండే శత్రువులు ఐతే కాదు. అంతే కదా ఎంత శత్రువులు పక్కన ఉన్నా మన బుద్ధి మాత్రమే మనల్ని చెడగొడుతుంది.

3. బలం అందరికి ఉంటుంది. సంకల్పబలం కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్న వారు విజయాన్ని సాధించగలరు. ఏ పనికి ఐన కష్ట పడితేనే ఫలితం లభిస్తుంది. కష్ట పడకుండా ఏ రకంగా కూడా ఫలితం మనల్ని చేరదు.

4. ఆలోచన అనేది ఒక మొక్క లాంటిది. ఎందుకంటే మనకి ఆలోచన రావడం అనేది ఒక మొగ్గ . ఆ తరువాత ఆ మొగ్గ విచ్చుకుంటుంది. అలాగే మన ఆలోచన కూడా మనలని ఒక పని చేయడానికి మన చేత ఒక అడుగు ముందుకు వేయనిస్తుంది. మొక్కకి ఉన్న మొగ్గ విచ్చుకున్న తరువాత ఫలమో , పువ్వో ఏదొ ఒకటి పక్కా వస్తుంది. అలాగే మనము వేసిన అడుగుకు దాని వెనుక మనము పడిన కష్టానికి ఫలితం పక్కా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది.

5. మనలో చాలా మంది ఇతరులు నుంచి ఆశిస్తారు. దాని వల్ల మనకి బాధలు తప్ప ఏమీ రావు. మనకి ఉన్న దానిలోనే సర్దుకొని ఉండాలి. అలాగే ఇతరులతో కూడా పోల్చుకోకూడదు. మనల్ని మనతో పోల్చుకుంటే ఈ రోజు కాకపోయినా ఎదో ఒక రోజు మనము మారతాము.ఇతరులతో పోల్చుకోవడం , వాళ్ళ నుంచి ఆశించడం ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి.

6. సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి వెంటనే పగిలి ముక్కలు అవ్వదు. దెబ్బ తరువాత తరువాత కొడుతుంటే అప్పుడు ముక్కలు ముక్కలుగా పడుతుంది. అలాగే మన చేసే పనిలో కూడా ఒక్కసారే విజయాన్ని చేరుకోలేము. ప్రయత్నాలు చేయాలి. ఎడతెగ కుండా ప్రయత్నాలు చేస్తే విజయాన్ని చేరతాము.

7. మన కోపం వల్ల మనం చాలా నష్టపోవాలిసి వస్తుంది. అదే మన తెలివితో ఎదుటివాళ్ళను నష్టపడేలా చేయవచ్చు. కాబట్టి ఏ పని చేసినా ఆలోచించి అడుగు వేయండి మిత్రమా !!

Leave a Reply