నీతి వాక్యాలు

Vivekananda
Reading Time: 2 minutes

నీతి వాక్యాలు

1. అహంకారంతో వచ్చే చీకటిని ఛేదించడం ఎవరికి సాధ్యం కాదు. అంతే కదా అండి. చీకటిని రాకుండా ఆపడం ఎవరికి సాధ్యం కాదు కదా.


2. మాటలు చాలా మంచివి. అలాగే చెడ్డవి కూడా.
కాబట్టి నీ అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడకండి.


3. ఏ పని రాకపోయినా ఇది అసంభవం అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే నీకు ఆ పని అసంభవం కావచ్చు. నీ పక్కన ఉండే వాళ్ళు నీ కంటే ముందే ఆ పనిని చేసి చూపిస్తారు.


4. మనకి అవకాశాలు గ్రుడ్లు లాంటివి. ఎందుకంటే గ్రుడ్డు ఒకసారి ఒకటే బయటికి వస్తుంది. అలాగే పట్టుకున్నప్పుడు కూడా ఏమి తెలియదు.కానీ ఒక్కసారి చేజారితే పగిలిపోతుంది. అలాగే అవకాశం కూడా అంతే. చేతుల్లో ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి.


5. అన్ని కళల్లో గొప్ప కళ ఏమిటి అనుకున్నారు. ఇంకేమిటి అండి .మనిషి నడక. ఎందుకంటే ఒక మనిషి తీరును నడకను బట్టి చెప్పవచ్చు.


6. మన కోసం కాలం ఆగదని మనము తెలుసుకుంటే చాలా మంచిది. కోట్లు సంపాదించిన మనిషి కూడా కాలాన్ని కొనలేరు. అందరికి ఉంటుంది కాలం . కొందరు కాలాన్ని తీసుకుంటారు. కొందరు కాలాన్ని నెట్టేస్తారు. అందరూ కాలంతో స్నేహం చేస్తే అన్ని కాకపోయినా కొన్ని ఐన గెలవగలుగుతాము.


7. ఒక సముద్రంలో బంగారు బిళ్ళను విసిరేయడానికి ఒక సాధారణ మనిషి చాలు. అదే బంగారు బిళ్ళను వెనక్కి తీసుకురావడానికి వందలాది మంది శాస్త్రవేత్తలు కలిసిన వెనక్కి తీసుకురాలేరు.

Vivekananda
Vivekananda


8. సహనం లేని మనిషి , నూనె లేని దీపం లాంటి వాళ్ళు. అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నవాళ్లు అందాన్ని పొందుతారు . అందమైన వస్తువు ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఆనందాన్ని ఇస్తుంది.


9 .మనస్సు ముక్కలు అయ్యే మాటలు మనిషిని విన్నప్పుడు బాధ పడుతుంటాడు.
నిజానికి అక్కడ ముక్కలు అయ్యేది మనిషి కాదు, మనస్సు కాదు ?? మనిషి మీద పెట్టుకున్న ” నమ్మకం “మాత్రమే ముక్కలు అవుతుంది .


10. చెప్పడం ఒక వంతు ఐతే చెప్పిన దాన్ని చేసి చూపించడం ఒక వంతు !!మాట్లాడటం వచ్చు కదా అని ఎక్కడిబడితే అక్కడ మాటలు జారకూడదు ?? అందుకే నోరు అదుపు , మాట పొదుపు.


11. ముందు కష్ట పడు !! ఆ తరువాత ఫలితాన్ని కోరుకో.. అస్సలు కష్ట పడకుండా ఫలితం కావాలంటే ఆ ” దేవుడు ” కూడా ఒప్పుకోడు !!! సహాయం అనేది ఒకరి చెప్తే చేసేది కాదు?
ఒక సంఘటన బలంగా మనిషిని తాకినప్పుడు వాళ్ళకి అనిపించి చేసేది !!!

Leave a Reply