నిద్రించే సమయంలో ఫోన్ బాగా చూస్తున్నారా ?

Phone Viewer @pexels
Reading Time: < 1 minute

మీరు సెల్ ఫోన్ బాగా వాడుతున్నారా ? దీని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. సెల్ ఫోన్ అతిగా రాత్రి వాడినపుడు మన ఆరోగ్యానికి ప్రమాదం కూడా. దీని వల్ల కాళ్ళు మంటలు ,ఒళ్ళు నొప్పులు, రాత్రుళ్ళు నిద్ర రాకపోవడం మరియు ఉదయం నిద్ర లెవలేకపోవడం మరియు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఎన్నో జబ్బులకు దూరంగా ఉండాలి అంటే ఒకటే మెడిసిన్ ఉంది. అది ఏంటి అంటే మీరు తొందరగా పడుకోవాలి.నిద్ర సరిగా లేకుంటే, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ సరిలేక, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిస్తుందని అది అధిక రక్తపోటుకు దారితీస్తుందని తెలిపారు.ఈ విషయం చాలా మందికి తెలియదు.



* పగటి పూట అస్సలు పడుకోకండి. ఎక్కువసేపు కూడా నిద్రపోకూడదు.దీని వల్ల తలపోటు వస్తుంది.

* ప్రతీ రోజు ఒకే సమయానికి నిద్ర పోవాలి. మీరు సమయం మారిస్తే అది మీకే ప్రమాదం.

* నిద్ర పోయే ముందర టీవీలో సినిమాలూ, సీరియళ్ళు చూడకూడదు. ఎందుకంటే ఇవి చూడటం వల్ల మీ నిద్ర తొందరగా రాదు.

* రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కొంచం సేపు ఐన వెలుగులో ఉండాలి. చీకటిలో ఉండే వాళ్ళకి రాత్రి వేళల్లో సరిగా నిద్రపట్టదు.

* నిద్రకు ముందు మంచి పాటలను వినాలి.

* గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్రపడుతుంది. పాలు తాగండం మర్చిపోకండి.

* నిద్రకు ముందు పుస్తకాలు చదవడం వంటివి చేయకూడదు. పుస్తకం చదువుతూ వుంటే అలా మనకు తెలియకుండానే నిద్రపడుతుందని చాలా మంది అంటారు. నిజానికి అది కొంత వరకు మంచి పద్ధతే కానీ ఎక్కువ సేపు చదవకండి.

Leave a Reply