ఒక నమ్మకం, ఒక బంధం

Trust
Reading Time: < 1 minute

బంధాలు అనేవి దేవుడు రాస్తాడు. ఒక బంధం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నమ్మకం అనేది ఒక పెద్ద కొండ లాంటిది . అది అంత తేలికగా ఎక్కడికి జరగదు . అలాగే మనము కొంత మంది మనుషుల మీద నమ్మకాన్ని అలాగే పెట్టుకుంటాము.అది కూడా అంత తొందరగా పోదు. చాలా గట్టిగా నమ్ముతాము. నమ్మిన మనుషులను మోసం చేయకండి. ఎందుకుంటే మీరు అబద్ధము చెప్పిన వాళ్ళు చాలా తేలికగా నమ్ముతారు .ఆస్తులు , అంతస్తలు కాదు మనిషికి కావాలిసింది. అనుబంధాలు, ఆత్మీయతలు !
ఆస్తులు కరిగిపోయిన బ్రతకగలము !! కానీ అనుబంధాలు దూరమైతే జీవించలేము ? కాబట్టి బంధాలను దూరం చేసుకోకండి.

ఒక చక్కటి అనుబంధానికి కావలిసిన మూడు విషయాలు కన్నీరు రాని కళ్ళు , అబద్దాలు చెప్పని పెదాలు , మనసుకు నచ్చే నిజమైన ప్రేమ. అన్ని వస్తవులు అందముగానే కనిపిస్తాయి. అలా అని అన్ని వస్తువులు ఒకేలా ఉండవు కదా . మనుషుల కూడా అంతే మనిషి కన్నా మనస్సు మంచిదవ్వాలి. కొన్ని బంధాలు ఎలా ఉంటాయి అంటే వాటిని బంధాలు అనడం కంటే సంబంధాలు అనడమే కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో తెలియని వాళ్ళతో కూడా సంబంధాలు పెట్టుకొని చివరికి అవి ఒకరినొకరిని చంపుకునే వరకు వెళుతున్నాయి. తెలియని వాళ్ళతో మాట్లాడకండి.మన జాగ్రత్తలో మనము ఉండాలి.

మంచి వాళ్ళు ముంచే వాళ్ళు అనడం కరెక్ట్ ? లేక
ముంచే వాళ్ళు మంచి వాళ్ళని నమ్మిచడం కరెక్ట్ ? పైన చెప్పిన దానిలో ఏది మంచిదో మీరే తెలుసుకోండి.” బంధం ” అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. బాధల్లో తోడు ఉండాలి. మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి అబద్ధం చెప్పకండి.మనస్పర్థలు ఎన్ని వచ్చిన , ఎన్ని ఆటంకాలు ఎదురైన , ఎన్ని అడ్డంకులు వచ్చిన నీకు నేను ఉన్నా అని ఒక బంధం మనతో చెప్పిస్తుంది. బంధాన్ని నమ్మండి. బంధం విలువ తెలిసిన వాళ్ళకి ఎక్కడ తగ్గాలో , ఎక్కడ నెగ్గాలో బాగా తెలుస్తుంది.

Leave a Reply