జీవితాశయం

Indian beautiful Woman Photo by Manjeet Singh  Yadav from Pexels: https://www.pexels.com/photo/woman-in-white-and-yellow-dress-with-scarf-1162983/
Reading Time: 2 minutes

జీవితాశయం

“ఇదెక్కడి చోద్యం, ఎక్కడైనా ఆడవాళ్లు ఇలాంటి ఉద్యోగం చేస్తారటే. ఇలాంటివి మా ఇంతా వంటా లేవు. ” అంటూ శాపనార్ధాలు పెట్టసాగింది భరిణమ్మ.

వీణకు పెళ్ళై మూడేళ్లు గడిచాయి. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చింది వీణ. తండ్రి కలెక్టరేట్ లో చిన్న ఉద్యోగి. తల్లి గృహిణి. వీణకు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు. వీణ తెలివైనది, బాగా కష్టపడి చదివేది. జీవితంలో ఒక స్థాయికి ఎదగాలనేది వీణ జీవిత ఆశయం. డిగ్రీ చదువుకుంది. చిన్నప్పటి నుండీ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేయాలనుకునేది. ఫిసికల్ ఎక్సమ్ పాసయి ఎయిర్ హోస్టస్గా ట్రైనింగ్న్ తీసుకుంది. ఉద్యోగం కన్ఫర్మేషన్ పేపర్ రాకముందు తల్లిదండ్రులు పెళ్లి  సంబంధం  తెచ్చ్చారు. వాళ్ళ సంతృప్తి గురించి మోహన్ ను పెళ్లి చేసుకుంది. మోహన్ చాలా సామాన్యుడు.

అతనికి జీవితంలో ఏదైనా సాధించాలని కానీ,  ఉన్నత పదవిని పొందాలని గాని ఆకాంక్షలు కానీ , కోరికా గాని లేనివాడు. వాళ్ళింట్లో మోహన్ ఒక్కడే కొడుకు, అతనికి ఇద్దరు చెల్లెళ్ళు. వాళ్ళు కేవలం వీణ ఇంటికి వఛ్చి చక్కగా వండి వార్చి  పెడుతుందని ఆశ మీద చేసుకున్నారు.  మోహన్ వాళ్ళ నాన్న, మోహన్ చిన్నప్పుడే చనిపోయాడు. ఇద్దరు చెల్లెళ్ళు పెంకి  ఘటాలు. ఇద్దరూ అంతంత మాత్రం చదువుకున్నారు. వాళ్ళు కేవలం ఇంటి మటుకే ఉండేవాళ్ళు. వారి ఇంట్లో కానీ వాళ్ళ చుట్టాలలో కానీ ఏ ఆడపిల్ల ఉద్యోగం చేయలేదు. వాళ్ళ ఉద్ద్యేశం ప్రకారం ఆడపిల్లలు ఇంట్లో నే ఉండాలి, ఇంటి పనులే చేయగలగాలి. కూపస్థ మండూకాళ్ళ ఉండేవాళ్ళు.

వీణ కు ఈ విషయాలేవీ తెలియదు. కేవలం మోహన్ తనకు జీవితంలో తప్పక అండగా ఉంటాడు తన నిర్ణయాలతో ఏకీభవిస్తాడు అనుకుని తల్లిదండ్రుల మనః శాంతి గురించి పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక వీణకు ఎయిర్పోర్ట్ ఎయిర్లైన్స్ లో పోస్టింగ్ ఇచ్చ్చారు. ఇక మొదలైంది ఇంట్లో రభస. మోహన్ తల్లి చాలా కుంచిత స్వభావం గలది. మోహన్ పెళ్లి చేయడానికి కారణం తన అమ్మాయిల పెళ్లిళ్లు అవడంలో సులభమౌతుందని. ఇంట్లో ముగ్గురు వంట  చేయడానికి ఉన్నా వీణను వంట చేయమనే వారు. వీణ పోస్టింగ్ ఆర్డర్స్ వఛ్చిన తరువాత ఒక వారం రోజులు స్పెషలిటీ ట్రైనింగ్ గురించి ఆఫీస్ కు రమ్మన్నారు. వీను పొద్దున్నే లేచి వంట ముగించి ట్రైనింగ్ కు వెళ్ళేది. అది ఏ మాత్రం ఇష్టం లేదు మోహన్ ఇంట్లో వాళ్ళకి. సూటి పోటీ మాటలు అనడం ప్రారంభించారు వీణను.


Women’s 3/4th Sleeve Viscose Tunic Short Top for Rs 1125
https://www.chandamama.com/index.php?route=product/product&path=3_31_199&product_id=41848

ఇలా కొన్ని రోజులు గడిచాక, భరిణమ్మ మోహన్ తల్లి అత్తగారు ఊరి నుండి వచ్చింది. ఆవిడ శుద్ద్దఊరి మనిషి. ఆవిడకైతే ఆడవాళ్లు పని చేయడం అనేది ఆమె డిక్షనరీ లో లేని పదం. అదీ కాకుండా కొన్ని రోజులు ఫ్లైట్ లో వెళ్లి ఆ ఫ్లైట్ తిరిగి వచ్ఛే వరకు వేరే  దేశాలలో  ఉండాల్సి వస్తుంది అని తెలియగానే “ మొగుడిని వదిలేసి వేరే దేశాలలో ఉండండం ఏమిటి.. అది చేస్తానంటే నువ్వెలా ఊరుకుంటున్నావ్ “అంటూ వీణ అత్తగారిని కూడా మాటలనేసేది భరిణమ్మ. మోహన్ వాళ్ళను ఏమీ అనలేక పోయేవాడు.

వీణ కు ముందు నుండీ తను చదివిన చదువు సార్థకం చేసుకోవాలి. తను ఉద్యోగం చేయాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలని అన్న ఆశయంతో ట్రైనింగ్ కు వెళ్ళింది, జాబ్  కంఫర్మ్ చేసింది. ఇక భరిణమ్మ వీణ అత్తగారు ఇద్దరూ కలిసి వీణను తిట్టడం ప్రారంభించారు. వీణ వాటిని లక్ష్య పెట్టలేదు. చూస్తుండగా మోహన్ ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లు జరిగి వాళ్ళ అత్తగారింటికి వెళ్లి పోయారు. కొన్ని రోజులకు భరిణమ్మ కు ఒంట్లో బాగా లేక హాస్పిటల్ లో జాయిన్ చెయ్యాల్సి వచ్చింది. మందులకు హాస్పిటల్ ఖర్చులకు చాలా డబ్బు కట్టాల్సి వచ్చింది. మోహన్ జీతం ఎక్కువగా లేనందున, హాస్పిటల్ కు డబ్బు కట్టలేక పోయాడు మోహన్. వీణ తాను జమ చేసిన డబ్బులతో భరిణమ్మ కు వైద్యం చేయించింది.

హాస్పిటల్ నుండి  తిరిగి ఇంటికి వచ్చ్చిన భరిణమ్మ ఉద్యోగం వీణను విషయంలో తిరిగి దెప్పి పొడవ నారంభించగా వీణ అత్తగారు అడ్డు తగులుకుని జరిగిన దంతా చెప్పింది. భరిణమ్మ వీణను క్షమాపణ కోరగా  వీణ ఉద్వేగంతో  “మీరు కేలవం మీకు  వైద్యం చేయించినందుకు క్షమాపణ కోరడం కాదు. స్త్రీ లు పురుషులతో సమానంగా జీవం సాగిస్తున్న రోజులివి. మీరు స్త్రీలను వంటింటి కుందేలుగా మారుస్తున్నారు. అలా చెయ్యకండి. దేశం  ప్రగతి సాధించాలంటే మహిళలు యువతులు ప్రతీ రంగంలోనూ పురుషులతో బాటూ సమాన స్థాయిలో ఉండాలి. భావి జీవితాలను కుటుంబాలను తీర్చి దిద్దేవాళ్లే వనితలు. అటువంటి వారికి స్వేచ్చ్చా స్వాతంత్ర్యాలనివ్వండి.  గౌరవంతో చూడండి, వారికి సముచిత స్థానం ఇవ్వండి. ముఖ్యంగా  పెళ్లయిన తరువాత కూడా. అప్పుడే సమాజం, సంఘం,  కుటుంబం బాగుపడుతుంది” అని ఎయిర్పోర్ట్ కు బయలుదేరింది వీణ. 

Shop with Chandamama: https://www.chandamama.com

Leave a Reply