లాభసాటి బేరం

Indian Street Vendor Photo by Anton Polyakov from Pexels: https://www.pexels.com/photo/ethnic-vendor-on-market-with-fruit-5758168/
Reading Time: 2 minutes

లాభసాటి బేరం

“ఈ రోజు ఆఫీస్ నుండిఇంటికి వచ్చ్చేటప్పుడు కూరగాయలు తీసుకు రండి ”  అంటూ ఆర్డర్ వేసింది రజని. “సరేలే ” అంటూ నిర్లక్ష్యంగానే  అన్నాడు నవీన్. నవీన్ కి షాపింగ్ చేయాలంటే ఇష్టం ఉండదు. ముఖ్యంగా కూరల మార్కెట్ కెళ్లాలంటే మహా చిరాకు. అక్కడ రద్దీగా ఉండడమే కాకుండా తనకు కూరలను ఏరి తీసుకురావాలంటే మహా విసుగు.

ఒక రోజు “రేపు తెస్తాలే ఈ రోజు మర్చిపోయాను డియర్ ” అనీ, మరొక  రోజు ” రేపు తెస్తాలే చాలా అలసిపోయా” నని సాకులు చెపుతూ వచ్చ్చాడు.  ఇక ఈ రోజు తప్పదు. లేదంటే రజని తనకు క్లాస్ పీకుతుందని,  ఇష్టం లేకుండానే వెళ్ళాడు నవీన్ కూరల మార్కెట్ కు. అక్కడ తనకు నచ్చీ  నచ్చ్చనివన్నీ కూరల బండ్ల దగ్గర వేయించుకున్నాడు. అక్కడ తను చేసింది ఏమి లేదు కేవలం డబ్బు ఇవ్వడం “అబ్బాయ్ ఒక కిల్ టమాటాలు రెండు కిలోలు బెండకాయలు ఓ మూడు కిలోలు ఆలుగడ్డలు ” అంటూ తనకు తోచినవన్నీ కొని ఇంటికి పట్టుకొచ్చ్చాడు.

బండివాడు ఇచ్చ్చే కూరగాయలు సరిగ్గా ఉన్నాయా కూడా చూడలేదు. ఏరడం చేయలేదు. ఇంటికొచ్చ్చాక రజని నవీన్ తెచ్చ్చిన కూరలన్నిటినీ చూసి “అసలు మీరు ఏరారా లేదా.. అన్నీ ముదురు కూరలు, ఎండిపోయినవీ ఇంకా పుచ్చ్చినవీ తెచ్చ్చారు. పెట్టిన డబ్బులు కూడా ఎక్కువే. మీకు కూరలు ఎలా సెలెక్ట్ చేసుకుని తేవాలో చెప్పాల్సిందే. ఈ ఆదివారం కూరల మార్కెట్ కు ఇద్దరం కలసి వెళదాం.” అంది

ఆ రోజు ఆదివారం. ఇద్దరూ కలసి కూరల మార్కెట్కు వెళ్లారు. అక్కడ రజని టొమాటోలైతే చక్కగా ఎర్రగా ఉండాలనీ, పాలకూరైతే ఆకుపచ్చగా నిగనిగలాడుతూ ఉండాలనీ, బెండకాయలు ముదురు పోయాయా లేతగా ఉన్నాయా చూడాలనీ,వంకాయలైతే పుచ్చ్చులు ఉంటాయని, కొన్ని మార్కెట్లలో ఆకుకూరల మీద బాగా నీళ్లు చల్లుతూ ఉంటారు.

Photo by Los Muertos Crew from Pexels: https://www.pexels.com/photo/woman-holding-a-yellow-fruit-on-market-8446837/

తీసుకునేటప్పుడు త్వరగా పాడవకుండా ఉండేవి తీసుకోవాలి అని కొన్ని చిట్కాలు చెప్పింది. అదీ కాకుండా కొంత మంది బండ్లవాళ్ళు కూరగాయల ధరలు పెంచుతారని కాబట్టి వేరే బండ్ల వాళ్ళు ఎలా ఇస్తున్నారని గమనిస్తూ అవసరమైతే బేరం చెయ్యాలని చెప్పింది. ఎందుకంటే డబ్బులు కష్టపడి సంపాదిస్తున్నప్పుడు ఆచీ తూచీ బేరమాడి వస్తువులను కొనాలని చెప్పింది. కొనుక్కునే వస్తువులకు తగిన ధరను ఇవ్వాలని చెప్పింది. అన్నీ విని తలాడించాడు  నవీన్.

వచ్ఛే ఆదివారం రజని వాళ్ళ స్నేహితులని సాయింత్రము డిన్నర్ కి  పిలిచారు. రజని అజెండా ప్రకారం అలూగడ్డ బీన్స్ మొదలైనా కాయగూరలను వేసి మసాలా అన్నం , వంకాయ మసాలా కూర, టమాటో పచ్చ్చడి, పప్పుచారు మొదలైనవి వండాలని నిర్ణయించుకొని నవీనును వెళ్లి కూరలు తీసుకు రమ్మంది. నవీన్ కూరల మార్కెట్కు వేళ్ళాడే గాని రజని చెప్పిన చిట్కాలు పాటించలేదు.

వంట మొదలెట్టిన రజని కి అన్నీ పుచ్చ్చు వంకాయలు, ఎండిపోయిన ఆకుకూరలను చూసేసరికి చాలా కోపం వచ్చింది. చిర్రు బుర్రులాడుతూ “నే చెప్పినవన్నీ మర్చిపోయారా. పుచ్చ్చులు లేకుండా తీసుకురమ్మన్నాను. అన్నీ పుచ్చూలే. ఇప్పుడెలా చేసేది వంట..” అంది. అన్ని రకాల వంటలను తినడానికి సంసిధ్ధుడౌతున్నా నవీన్ కు ఒక్కసారిగా ఆశా భంగం కలిగింది.

అప్పుడు తెలుసుకున్నాడు, తను ఇన్ని రోజులు రజని వంట చేస్తుంటే తింటూ సంతృప్తి చెందుతున్నాడే కానీ దానికి కావలసిన కూరలు సామానులు సరంజామా ఎంత అవసరమో, కొనడానికి ఓపికగా సమయం వెచ్చించాల్సి ఉంటుందనీ . అదీకాక పుచ్చ్చు  కూరలకు పెట్టే డబ్బులు కూడా దండగ ఆవుతాయికదా ఆని తెలుసుకున్నాడు. “సారీ డియర్ నిజంగానే నేను సరిగ్గా కూరగాయలు తీసుకునేటప్పుడు సరిగ్గా ఉన్నాయా లేవా అనేవి గమనించలేదు. సాయింత్రం లోపు మళ్ళీ మార్కెట్కు వెళ్లి కూరగాయలు సరిగ్గా చూసి తెస్తాను” అంటూ ఆఘమేఘాల మీద మార్కెట్ కు బయలుదేరాడు నవీన్.

Shop with Chandamama for quality products : Link

Leave a Reply