కథ:- రచన ప్రార్థన

Indian Family Photo by Anna Tarazevich from Pexels: https://www.pexels.com/photo/family-having-a-picnic-5119595/
Reading Time: 4 minutes

కథ:- రచన ప్రార్థన

ప్రేమించి పెళ్లి చేసుకున్న అనితకు పెళ్లయిన మూడేళ్లకు ఇద్దరు అమ్మాయిలు కలిగారు. అనిత వినోద్ ఎంతో సంతోషించారు.

అనిత పెద్దమ్మాయి ధైర్యం కలది. చిన్నది కొంత భయస్తురాలు. వారికి రచన, ప్రార్థన అని పేర్లు పెట్టారు. వాళ్ళను చక్కగా క్రమమైన పద్ధతిలో పెంచుతామని అనుకుంది అనిత.వారిద్దరూ చూడ్డానికి ఒకేలా ఉన్నా కూడా వారి వారి ఆలోచనల్లో ఇష్టాలలో రుచులలో బేధాలుండడం అందరూ గమనించారు. కానీ ఇద్దరు పెద్దవాళ్ళంటే గౌరవం ఇచ్ఛేవారు. ఇద్దరూ ఒకే స్టైల్ పట్టు లంగాలు వేసుకొని వస్తుంటే చిన్నప్పుడు రచన అందరూ చూపు తిప్పుకొనేవారు కాదు.

రచన చాలా బాగా చదివేది, ప్రార్థన మంచి సంగీత కళలను అభ్యసించింది. ఆలా చూస్తే ఇద్దరూ మంచి గా చదివే వాళ్లే. ఆటలలో రచన ముందడుగు వేసింది. రచన అంటే చాలా మందికి ఇష్టం ఉండేది. ప్రార్థన అంటే అందరికీ ముద్దు ఉండేదిరచనకు తన చెల్లెలు అంటే చాలా ఇష్టం ఉండేది, అలాగే ప్రార్ధనకు కూడా అక్క అంటే చాలా ఇష్టం.ఇద్దరు ఒకనాడు సైకిల్ తొక్కుకుంటూ స్కూల్ నుండి వస్తున్నారు.

వాళ్ళిద్దరూ సైకిల్ తొక్కుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు .

రచన అప్పుడు అడిగింది  “ఏం చేస్తావ్ పెద్దయిన తర్వాత..” అని అడిగింది. “నేను ఏదైనా టెక్నికల్ కోర్స్ చేస్తాను. నువ్వు ఏమి చేస్తావు అక్కా..” అని అడిగింది ప్రార్థన. “నేను ఏమి చేస్తానో నాకు ఇప్పుడు తెలియదు..” అని తెలివిగా సమాధానం ఇచ్చింది రచన.

రచన ఇంటర్మీడియట్ లోకి వచ్చింది. చిన్నది ఇంకా తొమ్మిదవ తరగతి చదువుతోంది. పెద్దమ్మాయి చాలా దుడుకు స్వభావం కలది. చిన్నది తెలివైనది. చిన్న దాన్ని అందరూ ముద్దు చేస్తారు కానీ అలా అని పెంకిగా ప్రవర్తించదు ప్రార్ధన. వారి స్వభావాలు రుచులు అభిప్రాయాలు మారసాగాయి పెరిగేకొద్దీ. వారిద్దరినీ చూసినప్పుడల్లా అనిత అనుకునేది నా స్వభావాలు అభిప్రాయాలు కూడా ఇలాగే మారాయి కదా పెరిగేకొద్దీ అని.

అవి కాలేజి రోజులు.. ఇద్దరూ ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు. కానీ వారి వారి ఫ్రెండ్స్ గ్రూప్ వేరయ్యాయి. రచన అందరితోనూ ధైర్యం గా మాట్లాడుతూ ఉండేది ప్రార్థన మాత్రం కొంచెం బెరుగ్గా ఉండేది. రచన అందరు మగపిల్లలతో కూడా మాట్లాడటం మొదలు పెట్టింది. అది చూసి ప్రార్థన ఇంటికి వచ్చి అనిత చెప్పేది “అమ్మా అక్క ఎవరన్నా భయపడదు. అందరితోనూ అందరితోనూ మగపిల్లలతో కూడా మాట్లాడేస్తూ ఉంటుంది ..”అని చెప్పింది.

అనిత రచనను మందలించాడని ప్రయత్నించింది.. కానీ రచన “అదేంటమ్మా ..మాట్లాడితే తప్పా..” అంటూ వాదనకు దిగేది. పిల్లలంటే ఇద్దరూ అంటే ఇష్టం తో అనిత వాళ్ళిద్దర్నీ ఏమీ అనలేక పోయేది. చూస్తుండగానే రచనకు వాళ్ళ క్లాసులో విక్రమ్ అనే ఒక అబ్బాయి నచ్చ్చాడు. అతనితో చాలా స్నేహంగా ఉండ సాగింది. అతనంటే, అతని అభిప్రాయాలంటే ఇష్టపడ సాగింది రచన.

Photo by RODNAE Productions from Pexels: https://www.pexels.com/photo/a-group-of-people-wearing-traditional-clothing-standing-side-by-side-7685732/

పరీక్షలు దగ్గర పడ్డాయి. రచన చదువు బాగా తగ్గిపోయింది ఈ స్నేహం వల్ల. ప్రార్థన చదువు కొనసాగింది. రచన చదువు విషయంలో అనిత కి ఆలోచనలు మొదలయ్యాయి. చదువు తగ్గిపోతోంది ఇది స్నేహం ప్రభావమే అని ఆలోచించింది. తనకు ఎప్పుడు చెబుతుందా తన స్నేహం గురించి అని వేచి చూడ సాగింది అనిత.రచన కొన్ని రోజుల తర్వాత చెప్పింది అనిత తో. “ నేను కాలేజీలో ఒక అబ్బాయి నేను చాలా ఇష్టపడుతున్నాను. అమ్మా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. అతని పేరు విక్రమ్. కాని వాళ్ళ అమ్మ నాన్న గురించి నాకు ఎక్కువగా తెలీదు..” అని చెప్పింది అనిత కి.

అనిత కి ఆలోచనలు మొదలైంది.. “రచన పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉంటాడో. వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉంటారో. వాళ్లు మనకు సరైన సంబంధీకులో కాదో..” అంటూ వినోద్ తో తన ఆలోచనల సంగతి చెప్పింది..

“నీ పిచ్చి కానీ.. అదేమీ చిన్న పిల్ల కాదు.. తనకు సరైన జోడీనే ఎన్నుకుంటుంది లే. ఊరికే ఈ ఆలోచనలు మానేయ్..” అన్నాడు వినోద్.

పరీక్షలు అయిపోయాయి. ఇద్దరూ చక్కగా పాసయ్యారు..ప్రార్థన తను అనుకున్న విధంగా టెక్నికల్ కాలేజీ లో జాయిన్ అయిపోయింది. రచన మాత్రం “ఎక్కువ చదువుకోవడం ఇష్టం లేదమ్మా ..”అని చెప్పింది.

అనిత రచనతో చెప్పింది “పెళ్లి అనేది జీవితాంతం ఉండేది ..కాబట్టి తన భాగస్వామిని చక్కగా అర్థం చేసుకునే వారై ఉండాలి.కాబట్టి విక్రమ్ ను బాగా అర్థం చేసుకో ..ఒకసారి అతనిని మన ఇంటికి తీసుకు వస్తావా..నేను మాట్లాడిన తరువాత అతని మీద నా అభిప్రాయం చెప్తాను అంది..” అనిత రచనతో.

రచన “సరేనమ్మా రేపు తనను ఇంటికి తీసుకొస్తాను. మాట్లాడుదువు గాని..” అంది.

విక్రమ్ ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత అనిత విక్రమ్ తో మాట్లాడింది కొన్ని విషయాల గురించి అడిగింది. “రచన గురించి నీ అభిప్రాయం ఏమిటి.తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఈ వయసులో మీకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది . కేవలం ఆకర్షణ మాత్రమే కాకూడదు…”

దానికి విక్రమ్ “ఆంటీ.. నేను రచన మేము ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు చాలా ఇష్టపడుతున్నాము. మా ఇద్దరి అభిప్రాయాలు, మా ఇద్దరి ఆలోచనలూ కూడా చాలా కలుస్తాయి. మా ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుకున్నాము. తనంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా నేను చెప్తామనుకుంటున్నాను. రేపు మా వాళ్ళ తో చెప్పి  వాళ్ళను ఒప్పించి మా అమ్మ నాన్నలను మీతో కల్పించడానికి తీసుకు వస్తాను అన్నాడు. మా అమ్మ హౌస్ వైఫ్. మా నాన్నగారు ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు” అన్నాడు.

అనితకు తన చిన్నప్పటి కాలేజీ రోజుల్లో తను వినోద్ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడడం గుర్తుకొచ్చాయి. విక్రమ్ మర్నాడు వాళ్ళ తల్లిదండ్రులని వెంటబెట్టుకుని వచ్చాడు.  వాళ్ళ అమ్మానాన్న ని చూసేసరికి అనిత ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది వాళ్ళు ఎవరో కాదు స్మిత సుందర్ లే..

“విక్రమ్ మీ అబ్బాయా ..”అని అడిగింది అనిత.

“అవును నాకు కూడా వీళ్లిద్దరి విషయం ఇప్పుడే తెలిసింది..” అంటూ ఆశ్చర్యపడింది స్మిత. 

స్మిత అనిత ఇద్దరు ఎంతో సంతోషపడ్డారు ఈ వివాహం జరుగుతున్నందుకు..

స్మిత సుందర్ అనిత వినోద్ తో పెళ్లి విషయాలు మాట్లాడారు. “మాకు పెళ్ళి లాంఛనాల దగ్గర్నుంచి పెళ్లి పనులు దగ్గర్నుంచి పెద్దగా అడంబరాలు అవసరం లేదు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు వాళ్ళు ఒకళ్ళ కొకళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి మాకు ఎటువంటి వైభవాలు అక్కర్లేదు”. అని చెప్పి చక్కగా మాట్లాడి వెళ్లిపోయారు.

“చూశారా అమ్మాయి ముఖ్యమే కాని వేరే విషయాలు వద్దంటున్నారు ఎంత మంచి వాళ్ళు..అందునా నా చిన్ననాటి స్నేహితురాలు తో  వియ్యమందడం నాకు ఎంతో సంతోషంగా ఉందండి ..” అంటూ గలగలా నవ్వేసింది అనిత . దానికి అనిత హస్బెండ్ వినోద్ కూడా చాలా ఆనందపడ్డాడు.

పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజు అనిత వాళ్ళ చుట్టాలంతా ఎంతో ఆనందంగా పెళ్లి చేశారు. ఆ పెళ్లి హడావిడిలో వాళ్ళ ఫ్రెండ్స్ ని తను మళ్ళీ ఒకసారి తన చిన్నప్పుడు చూసిన విధంగా అందరినీ చక్కగా రిసీవ్ చేసుకుని చక్కగా అందరికీ పెళ్లి లో అన్ని సౌకర్యాలు చక్కగా అమర్చింది అనిత. పెళ్లి సరిగ్గా జరిగినందుకు అందరూ చాలా సంతోషపడ్డారు.

” మన పిల్లల పెళ్లిళ్లు ఎలా అవుతాయో అని విచారం ఉండేది. కానీ చూశారా ..భగవంతుని దయ ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే విడిపోతుంది. పెళ్లి కూడా ఎంత చక్కగా జరిగిందో  చూశారా. ఎంత చక్కటి సంబంధం దొరికిందో ..”.అంటూ సంబర పడింది అనిత.

రచన పెళ్లయ్యాక తన ఆత్తారింటికి వెళ్లి పోయింది. ప్రార్థనకు రచన వెళ్లిపోవడంతో  ఇల్లంతా బోసి పోయినట్టై ఒంటరిగా ఫీల్ అయింది. అది గమనించిన అనిత “పోనీ ఒకసారి రచన వాళ్ళింటికి వెళ్లి రా”  అంది ప్రార్థనతో. ఎగిరి గంతేసింది ప్రార్థన. వెంటనే రచన వాళ్ళింటి వెళ్ళింది. రచన వాళ్ళ అత్తగారింట్లో రచనలిప్ కలిగిన మార్పును గమనించింది ప్రార్థన.

రచన తల్లిగారింట్లో ప్రతీదానికీ గారాలు పోయేది, బెట్టు చేసిది ఇంకా ఏదైనా కావాలంటే మారాం చేసేది. అలాంటిది తాను పూర్తిగా ఆణుకువగా నెమ్మదిగా మారినట్టు తెలుసుకుంది. ఓ నాల్గు రోజులు వాళ్ళింట్లో ఉండి వచ్చ్చేసింది ప్రార్థన. అనితతో రచనలో కల్గిన మార్పులను చెప్పగా అనిత ” అదేనమ్మా స్త్రీ  అంటే.  భర్తకు తన అత్తావాళ్లకు ఎలా నచ్చుతుంది అల్లా సంతోషంగా మారగల్గుకుంది. అది వాళ్ళ మీద ఉన్న ప్రేమ గౌరవాలే కారణం. అలా ఉన్నప్పుడే తాను సంతోషంగా ఉంటుంది ఇంకా తన చుటూ ఉన్నవారిని కూడా సంతోషపరచగలుగుతుంది. నువ్వు ఈ విషయం పెళ్లికి ముందే తెలుసుకున్నందుకు నాకు ఆనందంగా వుంది. మహిళలకు  అందుకే  సమాజంలో గౌరవం. రాజీ పడినా రాజీవం కలిగి తానున్న ఇంటికీ సంఘానికీ దేశానికీ ప్రాణం పోసే దేవత స్త్రీ. ఇల్లాలుగా వచ్ఛే బాధ్యతలను స్వీకరిస్తూ అందరికీ ఆనందాన్ని వెదజల్లే పుణ్యమూర్తి”

అంటూ చెప్తున్న అనితను చూసి తను తన తల్లి నుండి ఎన్నో విషయాలను తెలుసుకున్నట్లుగా కృతజ్ఞతగా చూసింది ప్రార్థన. 

శుభమ్

 

Leave a Reply