దూరదృష్టి – ఒక కథ

Filament Bulb Photo by Skitterphoto from Pexels: https://www.pexels.com/photo/close-up-photography-of-teddy-bear-near-light-bulb-1005325/
Reading Time: < 1 minute

దూరదృష్టి – ఒక కథ

ఒక నగరంలో ఒక పెద్ద వ్యాపారి ఉండే వాడు. అతనికి ఒక మనుమడు ఉన్నాడు. వ్యాపారి తన ముదుసలితనంలో ఉన్నాడు. తన వ్యాపారం అంతా తన మనుమనికి ఇద్దామని ఉద్దేశించు కున్నాడు. తాతయ్య మరొక వ్యాపారం కొనాలని ఆశించాడు. ఈసారి వ్యాపారం కొనుగోళ్లప్పుడు మనుమడైన రాజసింహుడని తనతో తీసుకువెళ్లాడు. వ్యాపారం విషయంలో రాజసింహునకు వాణిజ్యపు లొసుగులు మెళుకువలు తెలుస్తాయని.

తాతయ్య పెద్దలతో మాట్లాడుతుండగా వారి మాటల ప్రకారం ఈ వ్యాపారంలో లాభాలు సంపాదించాలంటే కనీసపాక్షం ఇంకా ముప్పై నలభై ఏళ్ళు వ్యాపారం లో ఉండాల్సిందే. అయినా సరే తాతయ్య ఆ వ్యాపారానికి ఒప్పుకున్నాడు. తిరిగి తాతయ్య రాజసింహుడు ఇంటికి తిరిగి వస్తుండగా రాజసింహుడు అన్నాడు ” మీరు ఈ వ్యాపారం నియమాలను, ప్రణాళికలను సరిగ్గా చూసినట్టు లేరు. ఈ వ్యాపారం సరిగ్గా నడుస్తుందో లేదో ” అన్నాడు.

తాతయ్య అందుకు ” ఎందుకని అలా అంటున్నావు అని అడిగాడు. దానికి   రాజసింహుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఇంకా ముప్పై నలభై ఏళ్ళు ఉండాలంటే..అస్సలు మీరు అప్పటి వరకు ఇంకా ముసలివాళ్లైపోరూ..అంత కాలం వేచి చూచిన తరువాత లాభం వస్తుందో రాదో..అలాంటి వాటిని గురించి ఎందుకు మనం ప్రాకులాడాలి ” అన్నాడు. దానికి ” దీనికి సమాధానం సమయం వచ్చినప్పుడు చెబుతాను ” అన్నాడు.

ఇద్దరూ కారులో వస్తుండగా ఒక మామిడి పండ్ల తోటగా వెళ్ళవలసి వచ్చింది. కారును ఆపి అక్కడ అమ్ముతున్న పండ్లను కొనసాగారు. అక్కడ ముసలి తోటమాలి ఒకడు తోటలో చిన్న చిన్న మొక్కలను  భూమిలో పెడుతున్నాడు. అప్పుడు తాతయ్య అతనిని రాజసింహునకు చూపించి ” ఇదే నా సమాధానం ” అన్నాడు.

రాజా సింహునకు అర్ధం కాలేదు. ” చూసావా ఆ ముసలి తోటమాలిని. అతను ఇంకెంత కాలం ఉంటాడో తనకు తెలియదు. అతను పెడుతున్న మొక్కలు పెరగడానికి ఎన్ని రోజులు పడతాయో కదా.పండ్లు సరిగ్గా వస్తాయో రావో తెలియఫు..అలాగని అతను నాటడం మానుకున్నాడా. అలాగే మనం ఇప్పుడు తినే పండ్లు కూడా ఒకప్పుడు ఎవరు ఎప్పుడో పెట్టిన చెట్లు నుండి వచ్చినవే కదా… ఈరోజు మనం వీటిని ఆరగిస్తున్నాం.

వాళ్ళు కూడా నేను వీటిని తినడానికి ఉంటానో లేదో అన్న కారణం చేత చెట్లు పెంచక పొతే..ఇవి మనకు అందేవా.. అందుకే నేను ఆ వ్యాపారానికి ఒప్పుకున్నాను. కొన్ని విషయాలలో ముందుచూపు, దూరదృష్టి మరియు నిస్వార్ధత అవసరం” అని చెప్పాడు. రాజసింహునకు తాతయ్య వ్యాపారానికి ఎందుకు ఒప్పుకున్నారో అర్ధం అయింది.

Leave a Reply