మనం ఎదుగుతున్నాం

Growth @pexels.com
Reading Time: < 1 minute

మనం ఎదుగుతున్నాం


నిజంగానే మనం ఎదుగుతున్నాం !

చిన్నప్పుడు పెన్సిల్ విరగ్గొట్టిందని “కట్టి” అన్న మనం… ఇప్పుడు మనస్సు విరగ్గొట్టినా పోనిలే అనుకుంటున్నాం…! మనం ఎదుగుతున్నాం !!!

అమ్మ పాలు తాగి పెరిగిన మనం… ఇప్పుడు ఏది పడితే అది తాగి తిరుగుతున్నాం…! 
మనం ఎదుగుతున్నాం !!! 


నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం… ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం…! 
మనం ఎదుగుతున్నాం !!! 

అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం… అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం…!
మనం ఎదుగుతున్నాం !!! 

చిన్నప్పుడు “అమ్మ”లో ప్రేమను వెతుక్కున్న మనం… ఇప్పుడు ప్రేమించడానికి “అమ్మాయిని” వెతుక్కుంటున్నాం…! మనం ఎదుగుతున్నాం !!! 

నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం…  నేనే హీరో… నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం…! మనం ఎదుగుతున్నాం !!! 

గళ్ళపెట్టెల్లో చిల్లర దాచుకున్న మనం… అవే చిల్లరబుద్ధులతో బ్యాంకుల్లో కోట్లు దాచుకుంటున్నాం…! మనం ఎదుగుతున్నాం !!! 

క్యారంబోర్డు లో రెడ్ కాయినే లక్ష్యంగా పెట్టుకున్న మనం… ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ లైట్ ని నీచంగా తిట్టుకుంటున్నాం…! మనం ఎదుగుతున్నాం !!! 

మాథ్స్ లో ఫెయిల్ అయినందుకే చచ్చిపోదాం అనుకున్న మనం… లైఫ్ లో ఫెయిల్ అవుతున్నా బ్రతికే ఉన్నాం…! మనం ఎదుగుతున్నాం !!! 

స్నేహితులతో జీవితాంతం కలిసే ఉందాం అనుకున్న మనం… జీవితంలో ఒక్కసారి వాళ్ళని కలిస్తే చాలనుకుంటున్నాం…! మనం ఎదుగుతున్నాం !!! 

చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం… ఇప్పుడు వస్తుంటే భాధపడుతున్నాం…! 
మనం ఎదుగుతున్నాం !!! 

సంతోషాల కోసం పోటిపడుతూ పెరిగిన మనం… ఇప్పుడు సంపాధనల్లో పోటీ పడుతున్నాం…! 
మనం ఎదుగుతున్నాం !!! 

చెడులో కూడా మంచిని చూస్తూ పెరిగిన మనం…  మంచి గురించి కూడా చెడుగానే ఆలోచిస్తున్నాం..! మనం ఎదుగుతున్నాం !!! 

చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం… ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం…! 
మనం ఎదుగుతున్నాం !!!

చిన్నప్పుడంతా ఎదగడానికి తొందరపడ్డ మనం… ఇప్పుడు ఎదిగిన్నందుకు సిగ్గుపడుతున్నాం…! 
మనం ఎదుగుతున్నాం !!! 

మనిషికే పుట్టి… మనిషిలా పుట్టి… కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం…! కానీ… మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని… మరమనిషిలా మారిపోతున్నాం…! మనలో మనిషికి దూరంగా పారిపోతున్నాం..! మంచి నుంచి వేగంగా జారిపోతున్నాం…! నలుగురికి వెలుగునివ్వకుండానే ఆరిపోతున్నాం…! 
ఎందుకంటే మనం ఎదుగుతున్నాం !!! 
నిజంగానే మనం ఎదుగుతున్నాం 

Leave a Reply