కంప్యూటర్ మెయింటెనెన్స్

Desktop @pexels
Reading Time: < 1 minute

కంప్యూటర్ మెయింటెనెన్స్

కంప్యూటర్లను సరి ఐన కండీషన్ పెట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలను పాటించాలిసి ఉంటుంది. కరెంట్స రఫరా ఆధారంగా కంప్యూటర్లను వాడటం వల్ల కంప్యూటర్ చేడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటివే కొన్ని చేయకూడని పనులు, చేయాలిసిన పనులు కింద్ర వివరంగా చెబుతాను. వాటిని చదివి మీరు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకొని మీ కంప్యూటర్ని వాడుకోండి.

చేయాలిసిన పనులు

1. చల్లని ప్రదేశంలో , తేమ తగలకుండా పొడి వాతావరణంలో , దుమ్ము , ధూళి పడని ప్రదేశంలో కంప్యూటర్ని ఉంచాలి.

2. మెయిన్ స్విచ్ ఆపే ముందు సిస్టమ్ యూనిట్ మానిటర్ , ప్రింటర్ల స్విచ్ లన్ని ఆఫ్ అయ్యాయో లేదో చూసుకోవాలి.

3. కంప్యూటర్ చుట్టుపక్కల, పైన శుభ్రంగా ఉంచుకున్న తర్వాత పని ప్రారంభించండి . అలాగే కంప్యూటర్ తో పని ఐపోయిన తర్వాత దుమ్ము పడకుండా సిస్టమ్ కు కవర్ తొడగండి.

4. సిస్టం కు , గోడలకు మధ్య కొంత దూరం ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కంప్యూటర్ చుట్టూ కొంత గాలి కంప్యూటర్కు అందేలా చూడటం చాలా ముఖ్యం.

5. మెయిన్ స్విచ్ ఆపేసే ముందు మానిటర్ , సిస్టమ్ యూనిట్ , ప్రింటర్ల స్విచ్ ఆఫ్ చేసి తరువాత మెయిన్ స్విచ్ ఆపండి.

చేయకూడని పనులు

1. కంప్యూటర్ ముందు కానీ , దగ్గర కానీ తినడం , తాగడం లాంటివి చేయకండి.

2. కంప్యూటర్ పైకి నేరుగా సూర్య రశ్మి తగలకుండా జాగ్రత్త పడండి.

3. కంప్యూటర్ సిస్టమ్ పని చేస్తున్నప్పుడు దానికి దగ్గరగా ఎలక్ట్రిక్ పరికరాలు అంటే వాక్యూమ్ క్లీనర్ లాంటివి తీసుకురాకండి.

కంప్యూటర్ వాడటంలో భాగంగా మరో ముఖ్యమైన అంశం ఏంటి అంటే కంప్యూటర్ను వైరస్ బారిన పడకుండా కాపాడటం . వైరస్ ఒకసారి కంప్యూటర్ను అంటుకుంటే ఇది అంటు వ్యాధి మాదిరిగా ఒక కంప్యూటర్ నుంచి మరో దానికి తేలికగా అంటుకుంటుంది. దాని నుంచి వేరే దానికి ఇలా విస్తరించి విలువైన డేటా , ప్రోగ్రాంలను నాశనం చేస్తుంది. కాబట్టి మనము కంప్యూటర్ను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వైరస్లు అప్లికేషన్లు , ప్రోగ్రాం లోకి కూడా వెళ్ళిపోయి అన్ని కాపీ చేసేసుకొని అపరిమితంగా విస్తరించపోగల శక్తిని కలిగి ఉంటాయి.

Leave a Reply