ధ్యానం చేస్తే

Yoga @pexels
Reading Time: < 1 minutes

మన సెల్ ఫోన్ ని  15 ని” నుంచి 30  ని” చార్జింగ్ చేస్తే 
రోజంతా వాడగలుగుతాము.

అదేవిధంగా 
మనం 15 ని” నుంచి 30 ని” ధ్యానం చేస్తే 
మనకి రోజంతా సరిపోయే శక్తి 
ఆ పరమాత్మ నుంచి అందుతుంది.

మన సెల్ ఫోన్లో 
పనికి రాని వాట్సాప్ వీడియోలు చూస్తే 
ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది.

అదే విధంగా 
మనం కూడా 
మన అవసరాలకు మించి
విలాసాల కోసం ప్రయత్నించినప్పుడు 
మనకు ఉన్న శక్తి తొందరగా ఖర్చయిపోతుంది.

చాలా మంది పనులన్నీ ముగిసిన తరువాత  ధ్యానం చేద్దామనుకుంటారు.

అప్పుడు

1.  రోజంతా శ్రమపడి , అలసిపోయి ఉన్న మనకు
చివర్లో ధ్యానం చేసే ఓపిక ఉండదు.  
కాబట్టి బద్ధకంతో నిర్లక్ష్యం చేస్తాం.

2.  పొద్దున్నే మొట్టమొదటి పనిగా ధ్యానం చేసినప్పుడు 
రోజుకు సరిపోయే శక్తి రావడంతో 
ఉత్సాహంగా రోజంతా పని చేసుకో గలుగుతాము

3.  ధ్యానంలో మనం పరమాత్ముని ఆహ్వానిస్తున్నాము. 
కాబట్టి రోజంతా ఆయన
మనతోనే ఉన్న స్పృహ
ఉంటుంది.
అది మన పనితీరును  
మనసిక సమతుల్యతను
మెరుగ్గా ఉంచుతుంది.

అప్పుడు మన విధి నిర్వాహణలో ఫలితాలు చాలా బాగుంటాయి.

4.  ప్రశాంతమైన సమతుల్యమైన 
మనసుతో మనం ఉన్నప్పుడు  –
మన చుట్టూ ఉన్నవారి మీద కూడా ప్రభావం చూపించి  –
వారికి కూడా ప్రశాంతతను చేకూరుస్తుంది.

కాబట్టి పొద్దున్నే మొట్టమొదట పనిగా ధ్యానం చేసి 
తరువాతే 
మన నిత్య కృత్యాల జోలికి వెళ్ళడం అలవాటు చేసుకుందాం.

Leave a Reply