నాన్న పెట్టిన బియ్యమూ?

Reading Time: < 1 minute

కొత్తగా పెళ్లైన అమ్మాయి వాళ్ల నాన్నకు కాల్ చేసింది.

నాన్నా.. ఒక బస్తాడు బియ్యం, బస్తాడు మినప్పప్పు పంపిస్తావా..?

  • ఎందుకు తల్లీ.. మీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. నెలకు లక్షకు పైగానే వస్తాయి. బియ్యం, పప్పులు ఎందుకు? జీతం రాట్లేదా.. అక్కడ బియ్యం, పప్పులు దొరకట్లేదా ?
  • అదేం లేదు నాన్నా.. మాకు ఈ మధ్య దోశలు, ఇడ్లీలు ఇంట్లోనే చేసుకుని తినాలనిపిస్తోంది.
  • ఓహో.. కంట్రోల్ బియ్యం పంపమంటావా..?
  • అది కాదు నాన్నా.. ఇద్దరం ఇందాక యూట్యూబ్‌లో దోశలు, ఇడ్లీలు ఎలా చెయ్యాలో చూశాం. దాంట్లో నాన్న బెట్టిన బియ్యం, నాన్న బెట్టిన మినప్పప్పు మిక్సీలో వేసి రుబ్బాలని ఉంది నాన్నా.
  • నువ్వూ, అల్లుడు గారు ఇద్దరూ ఇంగ్లీష్ మీడియమే కదమ్మా చదివింది
  • అవును నాన్నా.. దానికీ దీనికీ ఏం సంబంధం నాన్నా
  • నువ్వు అర్జెంటుగా ఫోన్ పెట్టకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నాన్న పెట్టిన బియ్యమూ నాన్న పెట్టిన మినప్పప్పూ నా థూ నీమొహం మండా.. పెట్టెయ్. ఇంతకు ఎవరి నాన్న పెట్టాలో యూట్యూబ్‌లో లేదా తల్లీ..!

Leave a Reply