ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే !!

Reading Time: < 1 minute

ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం… కానీ ఒకరినొకరు దూరం పెట్టేంతగా ఉండకూడదు. ఈ రోజుల్లో చాలామంది తిట్టుకుంటారు, కొట్టుకుంటారు ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇవి వాళ్ళు నవ్వుతా అనుకుంటారు.కానీ సీరియస్ గా తీసుకొని చాలామంది విడిపోతున్నారు .మరి అలాంటిటప్పుడు..ఎందుకు మాట్లాడుతున్నారు… ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు. బంధం అన్నాక గొడవలు ఉంటాయి…అన్ని ఉంటేనే కదా ఆ బంధానికి అర్థం తెలిసేది. ఏ బంధము ఐన సరే గొడవలు ఉంటాయి.

మీరు ఏ బంధం లో నైనా సరే నిజాయితీ గా ఉంటే మీకు ఏమి కాదు.మీకు మీరుగా ఉండండి.. నటించకండి… ఈ రోజు నటిస్తారు.. మళ్ళీ తరువాత ఒక్కరే కూర్చొని బాధపడలిసి వస్తుంది. కాబట్టి మీరు ప్రేమ ను పంచండి. మీ ప్రేమ ను వాళ్ళు తీసుకోకపోతే తప్పు వాళ్లదే… మీది కాదు… అన్నింటి కన్నా జీవితం చాలా గొప్పది . ప్రేమ లో గెలిచే వాళ్ళు ఉంటారు… ప్రేమ ను పోగొట్టుకొని జీవితంలో గెలిచే వాళ్ళు ఉంటారు.. ప్రేమ పోయినంత మాత్రాన జీవితం ఎక్కడికి పోదు.మీరు ప్రేమించే వాళ్ళ కన్నా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళను వదులుకోకండి.


మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరే మార్చుకోవాలి. ఒకటి పోయంది ..అన్ని మనతోనే పోవు… వెతకనది దొరికే వరకు వెతకాలి.. అప్పుడే దొరుకుతుంది. కనిపించటలేదు నువ్ వెతకడం మానేస్తే ని జీవితంలో నువు తప్ప ఎవరూ ఉండరు.కాబట్టి స్నేహితులను కూడా మనమే వెతుక్కోవాలి. కొన్ని ఇంట్లో చెప్పుకోలేనివి కూడా స్నేహితులు దగ్గర చెప్పుకుంటాము. మన ఇంట్లో వల్లే ముఖ్యం అని మనము ఎప్పుడు ఐతే అనుకుంటామో అప్పుడే బాగుపడతము.ఈ రోజుల్లో ఈ రకంగా జరుగుతూనే ఉంటున్నాయి. కాబట్టి మారాలి. ప్రేమ ప్రపంచం ఐతే కాదు. మన జీవితంలో ఒక భాగము మాత్రమే.

ప్రేమే జీవితం కాదు .దీని కోసం ప్రాణాలను పోగొట్టుకోవాలిసిన అవసరం ఐతే లేదు.మీ వల్ల మీ అమ్మానాన్నలను మాత్రం బాధ పెట్టకండి.

Leave a Reply