చికెన్ పకోడి

Reading Time: < 1 minute

కరోనా మహమ్మారి కోళ్లు వల్ల వచ్చింది అని ప్రపంచములో ఉన్న జనాభా అంత అనుకున్నారు.ఆ దెబ్బతో ఉన్న కోళ్ళను మొత్తాన్ని మట్టిలో పాతిపెట్టారు. దానితో కోళ్ళ వ్యాపారులు బాగా నష్ట పోయారు. తరువాత ఒక్కో దేశంలో ఉన్న డాక్టర్స్ వెల్లడించారు .కోళ్ళ వల్ల ఏమి ప్రమాదం లేదు, దీనిని అందరూ తినవచ్చు అని చెప్పారు.అలా మళ్ళీ ఎట్టకేలకు కోళ్ళకి, చికెన్ మంచి డిమాండ్ వచ్చింది.మీ అందరికి ఇష్టమైన చికెన్ పకోడి ఎలా తయారు చేయాలో చెప్తాను. చికెన్ పకోడి ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు. ఇక్కడ చదివి ఖాళీ సమయంలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి.కావలిసిన పదార్థాలు :-

చికెన్ – పావు కేజీ , అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్ , సెనగపిండి – రెండు కప్పులు,
జీలకర్ర – ఒక టీ స్పూన్ , ధనియాల పొడి – అర టీ స్పూన్ , సోడా ఉప్పు – చిటికెడు , కొత్తిమీర – అర కట్ట, పుదీనా – అరకట్ట, ఉప్పు – సరిపడినంత .తయారు చేసే విధానం :-

ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి . ఆ తరువాత వాటిని ఒక పాత్ర లోకి తీసుకోవాలి. అలా తీసుకున్న చికెన్ ముక్కలకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టును బాగా పట్టించి ముప్పై నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి . ఒక పాత్రలో సెనగపిండి తీసుకొని , జీలకర్ర , ధనియాల పొడి, సోడా ఉప్పు , కొత్తిమీర, పుదీనా వేసి , పెట్టినంత నీళ్ళు పోసుకుంటూ కలియబెట్టాలి. ఇప్పుడు చికెన్ ముక్కలను ఈ మిశ్రమంలోకి తీసుకొని అద్దుకుంటూ నూనెలో వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే గుమ గుమ లాడే వేడి వేడి చికెన్ పకోడి రెడి.

Leave a Reply