ఇస్మార్ట్ కొడుకు

Reading Time: 2 minutes

ఇదిగో బాసు ఈ కంటెంట్ రూటే సపరేటు…ఏంటి ఇట్ల చెప్పిన …అనుకుంటున్నారా ? అది ఏందో మీరు కూడా తెలుసుకోండి !!! మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకోవాలంటే ఈ కంటెంట్ పై లుక్ వేయండి మరి !!!


చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ ఎప్పుడు బంక్ కొడదమా …అని చూస్తూనే ఉంటారు.మరి కాలేజ్ బంక్ కొట్టాలంటే ముందు ఇంట్లో పర్మిషన్ కావాలిగా !!! డబ్బులు ఊరికే రావు గా…!! ముందుగా అబ్బాయిలు ఐతే అసలు చెప్పే పనే లేదు..!! అబ్బాయిలు కాలేజ్ బంక్ కొట్టాలంటే వాళ్ళ అమ్మ దగ్గర పడే తిప్పలు చూడండి.అమ్మ శుభ్రంగా తన పని తాను చేసుకుంటుంటే మధ్య లో వెళ్లి …లొల్లి ఇక చూడండి… కొడుకు అమ్మ మధ్య జరిగే సంభాషణలు

కొడుకు : అమ్మా ఏమైనా సహాయం కావాలా… చెప్పు అమ్మా నువ్ ఎం అడిగిన చేస్తా అమ్మా ..!!

అమ్మ : అవునా ఐతే నువ్ రోజు కాలేజ్ కు వెళ్ళు…అదే నువ్ నాకు చేసే పెద్ద సహాయం.

కొడుకు :- సరే అమ్మ ..! రోజు వెళ్తాను… కానీ ఈ రోజు మాత్రం వెళ్ళను అమ్మ ..?

అమ్మ : ఎందుకు రా…. ఏమైంది !! ఎందుకని వెళ్లవు ఈ రోజు…తిండి ఏమైనా తక్కువ చేసానా.. రోజు బాగానే మెక్కుతున్నావు గా…

కొడుకు : అమ్మా..!! కాదు ఈ రోజు కొత్త సినిమా ” ఇస్మార్ట్ శంకర్ “రిలీజ్ అమ్మ..అది చూడాలి..

అమ్మ : నువ్ ఈ రోజు కాలేజీ కి వెళ్ళలేదు అనుకో… మీ నాన్న మనకు కూర్చోబెట్టి ” డబుల్ ఇస్మార్ట్ ” చుపిస్తారు.అప్పుడు నువు ఎంచక్కా ఇంట్లో నే ” ఇస్మార్ట్ శంకర్ ” సీక్వెల్ కూడా చూడవచ్చు.

కొడుకు :- ఏంటి అమ్మ …నేను సినిమా అంటే నువ్ సీక్వెల్ అంటావు. నాన్న కి నువు చెప్పు అమ్మ

అమ్మ : నేను చెప్పలేను రా… ఇప్పటికే నువ్ చదవటం లేదు అని నాకు మంత్రాలు చదవుతున్నారు.ఇప్పుడు నువ్ కాలేజ్ బంక్ కొట్టి ఉరేగడానికి వెళ్తే ఇద్దరికి కూర్చో బెట్టి అక్షింతలు వేస్తారు.

కొడుకు : ఏంటి అమ్మా …నువ్ నాకు ఎప్పుడు సహాయం చేయవు…



అమ్మ : నువు నాకు ఎప్పుడైనా సహాయం చేసావా రా.. కనీసం తిన్న ప్లేట్ తీసి పక్కన పెట్టామన్నా పెట్టడానికి చేతులు రావు… సినిమా అనగానే అడగడానికి ఊపుకుంటా వస్తావు.

కొడుకు : అమ్మ ఈ సారి నడుచుకుంటా వస్తా…ఉపుకుంటా వస్తే పంపించటం లేదు గా…

అమ్మ : ఏంటి జోకా… లేక సెటైర్ వేస్తున్నవా …!! నువు నాకు సెటైర్ వేస్తే రిటైర్ ఐపోతావు… అప్పుడు నాతో పాటు ఎంచక్కా అంట్లు తోముకుంటా ఉండచ్చు.

(కొడుకు ఈ విధంగా మనసులో అనుకుంటాడు..)

కొడుకు : ఒక్క రోజు కాలేజి కి బంక్ కొట్టాలంటే అది మాములు విషయం కాదు… చాలా కష్టం బాబోయ్…

చూశారా… మీరు ఒక్క రోజు కాలేజ్ మానేస్తే మీ వల్ల ఇంట్లో మీ అమ్మ తిట్లు తినాలి ..!! మీరు ఎదో చదవి ఉద్దరిస్తారు అనుకుంటారు… మీ అమ్మానాన్న . కానీ మీకు వచ్చే ఆలోచనలు కాలేజ్ కి బంక్ కొట్టి సినిమాలకి పోదామా.. లేక రోడ్ల మీద బైకులు వేసి గంగిరెద్దుల్లాగా తిరుగుదామా ? అనే ఆలోచనలు తప్ప….!!!బాగుపడే ఆలోచనలు ఒక్కటి రావు. ఏది సీరియస్ గా తీసుకోరు… కానీ మీ అమ్మానాన్న లు నిన్ను సీరియస్ గా తీసుకొని చదవిస్తున్నారు. అది మాత్రం మర్చిపోకండి. నీకు చదవు విలువ తెలుసు కాబట్టి వాళ్ళు నిన్ను చదివిస్తున్నా నువ్ చదవుకోలేక పోతున్నావు. వాళ్ళకి తెలియదు కాబట్టి నిన్ను చదవించి వాళ్ల చదవును నీలో చూసుకుంటున్నారు. కాబట్టి అమ్మానాన్న లు బాధపెట్టకండి…మీరు బాగా చదవుకొని సుఖపెట్టండి…అదే వాళ్ళకి మీరు ఇచ్చే పెద్ద ఆస్తి.

Leave a Reply