చింత చిగురు మటన్

Reading Time: 2 minutes

చింత చిగురుతో పప్పు చేసుకోవడం మనందరికి తెలిసిన విషయమే. చింత చిగురుతో మటన్ కూడా చేసుకోవచ్చు. ఐతే ఇలా చేయవచ్చుని మనలో చాలామందికి చేయడం తెలియదు . చింత చిగురుతో మటన్ చేయడం ఎలాన అని ఆలోచిస్తున్నారా !! ఏమి లేదు అండి మరి అంతలా ఆలోచించకండి. చింత చిగురు ఉంటే తేలికగా చేసుకోవచ్చు. మటన్ అంటే మనకి బయట దొరుకుతుంది. చింత చిగురు అనేది వర్షాలు పడిన తరువాత మనకి దొరుకుతుంది. ఇది అన్ని కాలాల్లో దొరకదు. ఐతే ఇంకా ఇది ఎలా చేయాలో తెలుసుకుందాము. చింత చిగురు మటన్ కి కావలిసిన పదార్థాలు , తయారీ విధానం గురించి తెలుసుకుందాము.

కావాల్సిన పదార్థాలు :-

చింత చిగురు – అర కిలో తీసుకుంటే చాలు,
మటన్ – అర కిలో సరిపోతుంది,
ధనియాల పొడి – 1 టీ స్పూన్,
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్ ,
ఉల్లిపాయ – 1 ( చిన్నది సరిపోతుంది ),
కొబ్బరి తురుము – 1 టీ స్పూన్
గసగసాలు – 1 టీ స్పూన్ ,
జీలకర్ర – 1 టీ స్పూన్,
పసుపు – 1 టీ స్పూన్,
కారం – 2 టీ స్పూన్లు ,
నూనె – 1 టేబుల్ స్పూన్,
ఉప్పు – సరిపడినంత ,
కొత్తిమీర – కట్ట.

తయారీ విధానం :-

ముందుగా నాన్ స్టిక్ పాన్ తీసుకొని, దానిలో కొంచం నూనెని వేసి, తరువాత జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఏగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా కలిపి మూత పెట్టుకోవాలి. వాటిని కూడా బాగా ఏగనివ్వాలి. మూతని తీసి కొంచం పసుపు , అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి , అందులో ఉన్న పచ్చి అంత పోయేలా బాగా వేయించుకోవాలి.ఆ తరువాత కొబ్బరి తురుము వేసి రెండు నిముషాలు ఉంచాలి. తరువాత మటన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి.మటన్ని శుభ్రముగా కడిగి తీసుకోవాలి.ఈ మిశ్రమంలో శుభ్రము చేసిన మటన్ , ఉప్పు ,పసుపు , కొంచం నీళ్ళు పోసి వాటిని బాగా కలపాలి.మటన్ ఉడకడానికి మూతని పెట్టాలి .మటన్ని బాగా ఉడికించాలి. ఆ తరువాత కారము వేసి, మళ్ళీ వెంటనే మూతని పెట్టుకోవాలి. అలా రెండు నిముషాల పాటు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మటన్ ముక్కలకి కారం పడుతుంది.అప్పుడు రుచిగా ఉంటుంది. ఆ తరువాత చింత చిగురు వేసి ఐదు నిముషాలు పాటు బాగా ఉడికించాలి. తరువాత ధనియాల పొడి, మసాలా వేసి రెండు నిముషాలు పాటు ఉంచాలి. దించే ముందు కొంచం కొత్తిమీరను వేసుకోండి. అంతే చింత చిగురు మటన్ రెడి.

Leave a Reply