గండు చీమల తిక్క

ant Photo by Egor Kamelev from Pexels: https://www.pexels.com/photo/macro-photography-of-red-ant-1104974/
Reading Time: 2 minutes

గండు చీమల తిక్క

ఒక గ్రామంలో ఒక రావి చెట్టు ఉంది.అక్కడికి సమీపంలో ధాన్యం మిల్లు ఉంది.ఎక్కడి నుంచో వచ్చిన చీమలు రావి చెట్టును కేంద్రంగా చేసుకున్నాయి.అవన్నీ కలిసి మట్టిని సేకరించి చెట్టు కింద ఓ పొట్ట ఏర్పాటు చేసుకున్నాయి.ఆ తరువాత రాణి చీమ మిగతా చీమలను ఉద్దేశించి మనం పుట్ట నిర్మించుకున్నాం…ఇక మన దృష్టి అంతా ఆహారం సేకరణ మీద పెట్టాలి.ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి ఆహారం సేకరించాలి. మనం తిన్నగా మిగిలిన ఆహారాన్ని పుట్టలోనే నిల్వ చేసుకోవాలి. అలా అయితేనే వర్షాకాలంలో కాలు కదల్చకుండా పుట్ట దాటకుండా దర్జాగా బ్రతికేయొచ్చు అని అన్నది.ఇంతలో ఒక చీమ మనకు దగ్గరలోనే ధాన్యం మిల్లు ఉంది. అక్కడ నుంచి ప్రతిరోజూ దాన్యం గింజలను సేకరిస్తే మన సమస్య తీరుతుంది. దూరం నుంచి ఆహారం సేకరించాల్సిన పని తప్పుతుంది అన్నది.మిగతా చీమలన్నీ ఆ ఆలోచనను అభినందించాయి.రాణి చీమ కూడా మిల్లు నుంచి ధాన్యం సేకరణకు అనుమతి ఇచ్చింది.

దానికి పెద్ద చీమ మనకు అపాయం లేకుండా తెలివిగా ఆహారం సేకరించాలి అని బదులిచ్చింది. మిగతా గండు చీమలు ఎలా అని ప్రశ్నించాయి. దానికి పెద్ద గండు చీమ అందుకు నేను ఉపాయం ఆలోచించాను మీరు అమలుపరిస్తే చాలు అనడంతో వెంటనే గండు చీమలు ఏంటది అని అడిగాయి. పెద్ద గండు చీమ మాట్లాడుతూ ముందు మనం చీమల పుట్ట పక్కనే మరో పుట్ట ఏర్పాటు చేసుకోవాలి. అవి పగలు రాత్రి ఆహారం సేకరిస్తాయి. ఒళ్ళు దాచుకోకుండా శ్రమించడంలో చీమలను మించిన వారు లేరు. అవి రోజు మొత్తంలో కొద్ది నిమిషాలే నిద్రిస్తాయి కాబట్టి మనం దొంగ చాటుగా వాటి పుట్టలోకి ప్రవేశించి ఆహారం దొంగలించలేం అంది. అయితే ఏం చేద్దాం అని ప్రశ్నించాయి గండు చీమలు. చీమలకన్నా మనం ఆకారంలో పెద్ద. వాటికన్నా శక్తిమంతులం. దాన్యం తీసుకువచ్చే చీమలపై మనం దాడి చేయాలి. తిరగబడే వాటిని బలంగా కుట్టి అడ్డుతప్పించాలి. ఆ తరువాత వాటి వద్ద నుంచి ధాన్యం గింజలను స్వాధీనం చేసుకొని మన పుట్టలోకి తరలించాలి అని చెప్పింది. పెద్ద గండు చీమ తెలివిని మిగతావి మెచ్చుకున్నాయి.

ఆ తరువాత గండు చీమలన్నీ నివాసానికి అనుకూలంగా పెద్ద పొట్ట నిర్మించాయి. రోజు మాదిరిగానే చీమలన్నీ ఒకదాని వెనుక మరొకటి మిల్లులోకి ప్రవేశించాయి. ఒక్కో చీమ బియ్యపు గింజలు మోసుకుంటూ బయటికి రాసాగాయి. అవి తాటి చెట్టు కిందకు చేరుకోగానే గండు చీమలు వాటి మీద దాడి చేశాయి. అనుకోని పరిణామాలకి అవి బిత్తర పోయాయి.ప్రత్యర్ధులను ఎదిరించే శక్తి లేక చేతులెత్తేసాయి. గండు చీమలు విజయగర్వంతో బియ్యపు గింజలను స్వాధీనం చేసుకుని తమ స్థావరాలకు తరలించాయి తాము కష్టపడి సంపాదించిన ఆహారం గండు చీమలు తన్నుకుపోవటంతో చీమలు దిగులు పడ్డాయి. ఇలా ప్రతిరోజు చీమలు ఆహారం తీసుకురావడం గండు చీమలు దాడి చేసి ఎత్తుకెళ్లటం జరగ సాగింది. విషయాన్ని రాణి చీమ దృష్టికి తీసుకెళ్లాయి గండు చీమలతో తలపడే శక్తి లేక మౌనం దాల్చినది

దాంతో చీమలకు ఏం చేయాలో తోచలేదు.ఇంతలో చెట్టు పైనుంచి ఒక తొండ కిందికి దిగింది. అది దిగాలుగా ఉన్న చీమలను చూసి కారణం అడిగింది. అవి గండు చీమలు తమపై దాడి చేసి ఆహారం దోచుకుపోతున్న విషయాన్ని వివరించాయి. చీమల పరిస్థితిని చూసి తొండ జాలి పడింది. ఎలాగైనా వాటికి సహాయ పడాలని అనుకుంది మీకు అండగా నేను నిలబడతాను మీ ఆహారాన్ని గండు చీమలు దోచుకోకుండా అడ్డుకుంటాను అన్నది. తొండ మాటలు చీమల్లో ఉత్సాహం నింపాయి. అది ఇచ్చిన ధైర్యంతో అవి ఆహారం కోసం ఇల్లు లోకి ప్రవేశించాయి.ఒక్కో చీమ దాన్యం గింజలను మోసుకుంటూ బయటికి రా సాగింది. చీమలు మిల్లులోకి వెళ్ళటం గింజలు మోసుకుంటూ బయటికి రావడాన్ని గమనించాయి. గండు చీమలు దాంతో ఒక్క ఉదుటున వాటి మీదకు దాడి చేయబోయాయి. అంతలోనే తొండ వాటి ముందు ప్రత్యక్షమైంది. దాన్ని చూసి గండు చీమలు కంగుతున్నాయి. దొరికిన వాటిని దొరికినట్లు కరకర నమల సాగిందది. అది గమనించిన మిగతా గండు చీమలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పొట్టలోకి పరుగులు తీశాయి. అయినా తొండవాటిని వదలకుండా వెంటపడింది. చివరకు చిన్న జీవుల ఆహార సేకరణకు అడ్డురామని తమను వదిలివేయమని తొండలను వేడుకున్నాయి గండు చీమలు … అంతేకాదు పుట్టను వదిలి మరో చోటుకు వెళ్ళిపోయాయి. గండు చీమల బాధను తప్పించిన తొండకు అల్పప్రాణులు కృతజ్ఞతలు చెప్పాయి.

Leave a Reply