మనో వేదన

Pregnant Indian Photo by Ashwin Shrigiri from Pexels: https://www.pexels.com/photo/pregnant-woman-holding-her-baby-bump-while-looking-at-the-camera-7522678/
Reading Time: 4 minutes

మనో వేదన

“ఏమిటి ఈ వాళ టిఫిన్ ” అంటూ వఛ్చిన సంతోష్ కి పళ్లెం లో ఉప్మా తో హాల్లోకి వఛ్చి మూసి ముసిగా నవ్వింది సౌమ్య. సంతోష్ కి సౌమ్య కి ఈ మధ్యలోనే పెళ్లయింది. వారిద్దరిదీ ఒకే ఆఫీస్. స్నేహం కుదిరి వాళ్ళ తల్లిదండ్రుల నొప్పించి పెళ్లి చేసుకున్నారు. తను తల్లి కాబోతున్న సంగతి సిగ్గుపడుతూ చెప్పింది సంతోష్ కి. సంతోష్ సంతోషానికి అవధులు లేవు. ఇంట్లో వాళ్ళందరూ ఎంతగానో ఆనందపడ్డారు. అత్తా మామలు అతి జాగ్రత్తగా తమ కోడలిని చూసుకున్నారు. చూస్తూండగా రోజులు అలా గడిచాయి. సౌమ్య శరీరంలో మార్పులు రాసాగాయి. కొద్దిగా బరువు పెరగడం, ఆకలి ఎక్కువ కావడం, తొందరగా అలసిపోవడం జరుగసాగింది. సౌమ్య మాత్రం మొదటి కాన్పు కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంది. డాక్టర్ చెప్పిన విధంగా మంచి ఆహారం తీసుకోవడం,  ప్రతిరోజూ వాకింగ్ చేయడం లాంటివి చేయసాగింది. శిశువు గర్భంలో నుంచే ఎన్నో విషయాలు నేర్చుకుంటారు అని పెద్దవాళ్లు చెప్పడం విన్నది సౌమ్య. అందుకని తను మంచి విషయాలు చదవడం, మంచి ఆలోచనలతో ఉండడం, సంతోషంగా ఉండడం,  ఇంకా మంచి విషయాలు మాట్లాడడం చేయసాగింది.

డెలివరీ ముందు రోజు నుండి ఒకటే టెన్షన్ సౌమ్యకి ఎలా జరుగుతుందో తన కాన్పు అని.తనకు సుఖంతమౌతుందో లేదో అని భయం. మొత్తానికి దేవుడి మీద తనకున్న నమ్మకాన్ని పెంచుకుని ధైర్యం తెచ్చుకుంది.  సౌమ్య డాక్టర్ తన హాస్పిటల్ రూమ్ వచ్చి మాట్లాడారు. ఆవిడను చూసిన తరువాత చాలా సంతృప్తి పడింది. సౌమ్య. ఎలాగో అలాగ తన భయాన్ని పోగొట్టుకుంటూ డెలివరీ సాఫీగా సాగిపోతుందని అనుకుంది సౌమ్య. ఆరోజు తన రూమ్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కన రూమ్ లో నుండి మాటలు వినిపించసాగాయి. ఎవరో తనలాగే పక్కన డెలివరీ గురించి హాస్పిటల్లో చేరినట్లు అర్థమైంది. వాకింగ్ చేసేటప్పుడు మెల్లిగా నడుచుకుంటూ ఎవరో చూద్దామని రూమ్ లోకి మెల్లిగా తొంగి చూసింది సౌమ్య..తనే.. తన చిన్ననాటి స్నేహితురాలిని చూసి ఆశ్చర్య పోయింది.. తనతో చిన్నప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేది.. స్కూల్ తరవాత మళ్ళీ తను కనిపించ లేదు.. పేరు గుర్తుకు వచ్చింది ..పద్మిని.. వెంటనే తన రూమ్ కి వెళ్లి గడపలో నిలబడి..తలుపు తడుతూ“పద్మినీ.. పద్మినీ ఇది నువ్వేనా.. నన్ను గుర్తుపట్టావా..” అంది.

పద్మిని తలెత్తి చూసింది. తనే..తన డియరెస్ట్ ఫ్రెండ్ సౌమ్య..”సౌమ్య.. ఎలా ఉన్నావ్..”  అని అడిగింది పద్మిని.ఇద్దరి కళ్ళలో సంతోషం, ఉద్వేగం ఇంకా ఎన్నో చెప్పలేని మనో భావాలు..ఒక్కసారిగా తలెత్తి చూసిన పద్మిని కళ్లనిండా నీళ్లు అది చూడగానే సౌమ్యకి …చాలా బాధ కలిగింది.“ఏమిటి ఏమైంది నీకు పద్మినీ..”అంటూ లోపలికి వచ్చింది సౌమ్య ..పక్కనే ఉన్న నర్సు పద్మినిను టెస్ట్ చేసి “ఈ అమ్మాయికి ఎవరూ ఉన్నట్టు లేరు. నువ్వు కొద్దిగా కనిపెడుతూ ఉండు.” అని చెప్పి సౌమ్యతో. “పద్మిని నేను ఈ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడుతాను..” అని వెళ్లి పోయింది.

Photo by George Chambers from Pexels: https://www.pexels.com/photo/a-pregnant-woman-in-a-pink-dress-15014985/

పద్మిని సౌమ్యని చూస్తూ ఏడవ సాగింది.పద్మిని కళ్ళలోంచి ఒకటే దుఃఖం పొంగి పొర్లుతూ ఉంది.“పద్మినీ.. ఏడవకు చెప్పు ఏమైంది చెప్పు..” అంది సౌమ్య.అప్పుడు పద్మిని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. “ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మావారు కూడా ఏ హెల్ప్ చేయలేకపోయారు. మా అత్తగారి వాళ్ళ ఇంట్లో నన్ను అసలు సరిగ్గా చూసుకో లేదు. దాంతో నాకు మనస్తాపం.. నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి ఒకటే సాధించడం మొదలు పెట్టారు.

ఇంతకు మునుపు కూడా ఒక రెండు సార్లు వాంతులు అయ్యాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అత్తగారు పెట్టే బాధలు, ఆలోచనలు వల్లనేమో మళ్ళీ ఇప్పుడు హెల్త్ మళ్ళీ పాడయ్యింది.ఒకటే బలహీనత.అన్నం సయించదు. ఇది మనస్తాపం వల్ల కూడా కావచ్చు.. లేదా సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా కావచ్చు.. నేను ఎంత బాధ పడుతున్నానో అనేది నాకు తెలుసు.. ఆ భగవంతుడికి తెలుసు.సౌమ్య నువ్వు ఏమీ అనుకోవద్దు. ఇలా మొదటిసారి నువ్వు కలిసిన తర్వాత ఎన్నో రోజుల తర్వాత ఎన్నో సంతోషకరమైన విషయాలు చెప్పాల్సింది పోయి నేను ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాను… “.

దానికి సౌమ్య ” ఏం పర్వాలేదు. మన ఫ్రెండ్స్ కు కాక ఇంకెవరికి చెప్పుకుంటావు పద్మినీ..”

“మా అత్తమామలకు ముందు నుంచి మా వివాహం గురించి పెద్ద మంచి అభిప్రాయం లేదు. నేనంటే ఇష్టం లేదు వాళ్లకు ముందునుంచి. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా ఎప్పుడూ నన్ను ఎప్పుడు ఇష్టపడలేదు. నాతో మంచిగా మాట్లాడలేదు. దాంతో మాకు ఎన్నో మనస్పర్ధలు జరిగింది.. ఎప్పుడు పోట్లాటలు.. ఇంట్లో కొట్లాటలు ఉండేది ఎప్పుడూ.. నాతో సరిగా మాట్లాడేవాళ్ళు కాదు..నాకు మా అత్తగారింట్లో ఏ స్వాతంత్రము లేదు. ఎప్పటికి నన్ను తిడుతూనే ఉంటారు. ఏది చేసిన దెప్పి పొడుస్తూ ఉంటారు. వారికి నేను కట్న కానుకలు తేలేదని వారిలో తప్పులు నేను ఎక్కడ బయట పెడతానని ఎవ్వరితో కలవనివ్వరు. నా పుట్టినింటికి వాళ్ళనివ్వరు. ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళను అడిగే చెయ్యాలి. మా వారికి వాళ్ళను ఏమైనా చెప్పాలంటే భయం. వాళ్ళు అస్సలు నాకు సపోర్ట్ చేయరు. నన్ను ఒక మనిషిని గానే చూడరు. ఎవరితో చెప్పుకోవాలి నా బాధలు… ఎలా తీరుతుంది నా ప్రాబ్లెమ్.. నా మనసు ఎప్పుడు దిగులుగానే ఉంటుంది. .. ఇలాంటి మనసుతో ఈ పిల్లను ఎందుకు కనాలి అన్న బాధ. కనీసం మనసు కుదుటపడేందుకు ఏమైనా తిన్నావా. .. అస్సలే కడుపుతో ఉన్నావు… అని అడిగే వాళ్ళు లేరు… ” అని చెపుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్న పద్మినిని చూసి బాధ పడింది సౌమ్య.

ఈ విషయంలో ఎదో ఒకటి చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది సౌమ్య. తనకి సమయం దొరికినప్పుడల్లా సౌమ్య పద్మిని వాళ్ల రూం కి వెళ్ళి పద్మినితో మాట్లాడ సాగింది.  తన మనసుకు నచ్చే విధంగా మాట్లాడుతూ తన చిన్న చిన్న సంతోషాలతో జోక్స్ చెబుతూ, పద్మినికు పుట్టబోయే పిల్లల గురించి మాట్లాడుతూ ఉండడంతో పద్మినికు తన బాధ కొంత తగ్గునట్లుగా అనిపించింది. ఆహ్లాదకరమైన విషయాలు సౌమ్య మాట్లాడడం పద్మినికి బాగా అనిపించింది . తను ప్రతిరోజు మాట్లాడుతూ ఉండడంతో వాతావరణంలో కూడా మార్పు రాసాగింది.  కొన్ని రోజుల తర్వాత పద్మిని మొహంలో చిరునవ్వు తో ఆనందం తో సంతోషంగా ఉంది. దాంతో సౌమ్య కి కూడా కొంత ఉత్సాహం కలిగింది.

నర్స్ పద్మిని హస్బెండ్ ప్రకాష్ ని పక్కకు పిలిచి “మీతో ఒక విషయం చెప్పాలి..” అంది.

“పద్మిని ఆరోగ్యము ఏమాత్రం బాలేదు.. దానికి కారణము తన మనః స్థితి కూడా కారణం కావచ్చు.. ఈ విషయంలో మీరు  డాక్టర్ తో మాట్లాడండి” అని చెప్పింది నర్స్.

Photo by Ashwin Shrigiri from Pexels: https://www.pexels.com/photo/couple-looking-at-the-camera-7522696/

అక్కడే ఉన్న సౌమ్య కూడా “మనసు బాలేకపోతే అది మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది.మనో వేదన చాలా భయంకరమైనది” అని చెప్పింది ప్రకాష్ తో. కొద్ది సేపయిన తరువాత వచ్చిన డాక్టర్ ను పద్మిని గురించి అడిగాడు ప్రకాష్. దానికి డాక్టర్ చెప్పింది “అవునండి ప్రకాష్ గారు, మనసు బాలేకపోతే వాళ్ళు చేసే పని మీద శ్రద్ధ ఉండదు.స్ట్రెస్ లేకుండా ఉండడం ఈ సమయంలో అవసరం. ముఖ్యంగా వాళ్ళు మంచి ఆహారం సరైన టైంకి తీసుకోగలగాలి. సరైన టైంలో మందులు వేసుకోవాలి.. లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది..అది తన శరీరం మీద కూడా ప్రభావం చూపే అవకాశం చాలా ఉంది.. కాబట్టి పోషకాహారంతో కూడినటువంటి ఆహారం మరియు పండ్లు తనకి చాలా అవసరం.అదే విధంగా ప్రతి రోజూ తను కొంత వాకింగ్ చేయడం అవసరము.. ఇవన్నీ జాగ్రత్తలు పాటించకపోతే తన డెలివరీకి కష్టమవుతుంది. మీ ఆవిడ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది మీకు పుట్టబోయే పిల్లల మీద కూడా ప్రభావం చూపుతుంది..” అని చెప్పింది డాక్టర్.

ప్రకాష్ కూడా డాక్టర్, సౌమ్య చెప్పిన మాటలను గురించి ఆలోచించ సాగాడు. నిజమే కదా కడుపులో పెరుగుతున్న పాప గురించి ఆలోచిస్తే మనసు బాగా లేకపోతే ఏది రుచించదు.. సయించదు. అదీ కాకుండా పద్మిని తనింట్లో పడుతున్న సూటి పోటీ మాటల గురించి తెలుసు. తనను నమ్ముకొని వఛ్చిన్న మనిషిని ఇలా బాధకు గురి చేయడం సబబు కాదు కదా.. ఇప్పటి నుండి తన విషయం లో అన్ని విధాలుగా సరిగ్గా ఉంటాను.. అని నిర్ణయించుకున్నాడు. ఏది ఏమైనా తన పుట్టబోయే బిడ్డ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కదా.తను తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో గమనించాలి. సరైన సమయానికి ఆహారం తీసుకుంటూ ఉందో లేదో.. పోషకాహారం తీసుకుంటుందో లేదో.. మందులు సరిగా వేసుకుంటూ ఇలాంటివన్నీ గమనించాలి. అది భర్త గా నా బాధ్యత. అనుకున్నాడు ప్రకాష్.ప్రకాష్ చర్యలలో కూడా మార్పులు రావడం గమనించింది పద్మిని.

చూస్తుండగానే సౌమ్య డెలివరీ రోజు రానే వచ్చింది. ఆ రోజంతా సంతోష్ హాస్పిటల్ లోనే ఉండి పోయాడు. డాక్టర్ ఎప్పుడు వచ్చి బయటకు వచ్చి శుభ వార్త చెప్తుందో చెబుతుందో అని. కొద్దిసేపటికి నర్సు వచ్చి బయటికి వచ్చి చెప్పింది “సంతోష్ గారు… మీకు ఆడపిల్ల పుట్టిందని” ఎంతో సంతోషంగా చెప్పింది. మరి కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ నర్సు వచ్చి చెప్పింది.“సంతోష్ గారు.. మీకు మరో ఆడపిల్ల పుట్టిందని ఎంత అదృష్టవంతులు మీరు ..ఇద్దరు  సౌమ్య లు వస్తున్నారు మీ ఇంటికి ..”అని అంటూ చెప్పింది.

సౌమ్య ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. సంతోష్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.

సౌమ్య డెలివరీ అయిపోయిన తర్వాత సౌమ్య తన ఇంటిని వెళ్లి పోయింది.. అలాగే పద్మిని పద్మిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది.తర్వాత వాళ్ళిద్దరూ ఉత్తరాల్లో మాట్లాడుకున్నారు. కొద్దిరోజుల తర్వాత పద్మిని దగ్గర ఉంచి ఉత్తరం వచ్చింది. తనకు కొడుకు పుట్టాడని, బాగానే ఉన్నాడనీ, వాళ్ళ అత్తావాళ్లు కూడా ఇప్పుడు తన విషయంలో మారారని, తన హెల్త్ కూడా బాగానే ఉందనీ, ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉందనీ అని రాసింది. పద్మిని ఉత్తరంలో ప్రకాష్ ధోరణి పూర్తిగా మారిపోయిందని, అతనిలో చాలా మార్పు వచ్చిందని, అతను పద్మినిను చాలా బాగా చూసుకున్నాడు అని చెప్పడంతో చాలా సంతోషం వేసింది సౌమ్యకి. ఏమైతేనేమి వారి కుటుంబం సరిగ్గా మారినందుకు చాలా సంతోషపడింది సౌమ్య.

Chandamama Shop for Women: https://www.chandamama.com/index.php?route=product/category&path=3_16_210

Leave a Reply