నమ్మక ద్రోహం

Indian Girls Photo by RODNAE Productions from Pexels: https://www.pexels.com/photo/mother-and-daughter-doing-painting-7104141/
Reading Time: 3 minutes
Indian Girls Photo by RODNAE Productions from Pexels: https://www.pexels.com/photo/mother-and-daughter-doing-painting-7104141/

నమ్మక ద్రోహం

ఒక పట్టణంలో ముగ్గురు అమ్మాయిలు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు రాధిక శ్వేతా మరియు విమల. “రాధికా ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నావే” అంటూ వఛ్చిన శ్వేత ను చూసి రాధిక నవ్వుతూ “ఎదో ఇలా..” అంటూ  తన పుస్తకాలను చూపించింది. విమల రాధిక శ్వేత ముగ్గురూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకే కాలేజీలో చదువుతున్నారు. ముగ్గురూ చాలా స్నేహితంగా ఉండేవారు. ఏదైనా కారణంగా శ్వేతా కానీ రాధికా కానీ కాలేజికి రాకపోతే విమల గిలగిలా లాడిపోయేది.

అదేవిధంగా ఏ  ఒక్కరూ ఈ ముగ్గురిలో  కాలేజికి రాకపోతే మిగిలిన ఇద్దరూ బాధ పడేవారు. ప్రీఫైనల్స్ అయిపోయాయి. ఇక కొన్ని రోజులలో వారికి ఫైనల్ ఎగ్జామ్స్. కానీ ఫైనల్ ఎక్సమ్ కి మళ్ళీ కాలేజి ఫీజు కట్టవలసి ఉంటుంది. వీళ్ళు చదివే కాలేజీ ప్రైవేట్  కాలేజీ కాబట్టి ఫీజు ఎక్కువగా ఉండేది. శ్వేతా రాధిక వాళ్ళు పట్టణంలో ఉండేవాళ్ళు. మంచి ఆస్తి పరులు. గారాబంగా పెరిగారు శ్వేతా రాధిక. విమల తల్లిదండ్రులు ఊరిలో ఉండేవాళ్ళు.  వ్యవసాయం చేసేవాళ్ళు. చాలా చిన్న రైతు విమల వాళ్ళ నాన్న. అప్పో సప్పో చేసి విమలను పట్టణంలో చదివిస్తున్నాడు.

“విమల ఏది..ఇంకా రాలేదేంటి..ముగ్గురం కలిసి చదువుకుందాం  అనుకున్నాము కదా ” అంది శ్వేత. “నేను అదే అనుకుంటున్నాను ” అంది రాధిక. “సరే విమల వచ్చ్చిన తరువాత ఎదో కొద్దీ సేపు చదివి బయటికి వెళ్లి హాయిగా ట్యాంక్ బ్యాండ్  దగ్గర కూర్చొని ఐస్ క్రీం తిందామా. ఈ రోజు నా ట్రీట్  ” అంది శ్వేత. రాధిక “సరే అయితే రేపు మిమ్మల్ని సినిమాకు తీసుకెళ్లే బాధ్యత నాది” అంది రాధిక నవ్వుతూ. పైకి ముగ్గురూ చాలా దగ్గర స్నేహితుల్లాగే కనిపిస్తారు కానీ విమలకు ఎప్పుడూ చదువుల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుందని శ్వేతకు కుళ్ళు గా ఉండేది. ప్రతీ సారీ విమల కంటే తనకు ఎక్కువ మార్కులు రావాలని ఉండేది. కానీ ఎప్పుడూ విమలను మించలేక పోయింది.

రెండు గంటలు అలా వాళ్ళ మాటల్లో గడచిపోయాయి. అప్పుడొచ్చింది విమల. ఏమైందని అడిగితే వాళ్ళ నాన్నగారు హాస్టల్ కి వచ్చ్చారు.  అందుకే త్వరగా రాలేకపోయానని చెప్పింది. విమల ఎందుకో దిగులుగా కనిపించింది. ఏమైందని అడుగగా “నేను ఊరికి వెళ్లి పోవాలి. ఈసారి భారీ వర్షాల కారణంగా పంట పాడయిందని నాన్న చెప్పారు. అలాగే ఈ సారి హాస్టల్ ఫీజు ఎక్సమ్ ఫీజు కట్టలేనని చెప్పారు” అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది విమల. 

రాధిక శ్వేతలు బాధపడి ” అలాగని  నీ చదువు పాడుచేసుకుంటావా. మేము ఎదో ఒకటి చేసి నీ ఫీజు కడతాము. నువ్వు అస్సలు ఏ విషయంలో బాధపడకు ” అన్నారు. విమల విషయం చెబితే ఒప్పుకోరని అనుకొని, వాళ్లిద్దరూ వాళ్ళింట్లో డబ్బు అవసరం ఉందని, ఏవో కొత్త స్టైల్ డ్రెస్సెస్, బాగ్స్ వచ్చ్చాయి. వాటిని కొంటామని చెప్పి తల్లిదండ్రుల దగ్గర డబ్బు తీసుకున్నారు.

వాళ్ళ ఒప్పందం ప్రకారం శ్వేత సగం  ఫీజు డబ్బులు రాధిక సగం ఫీజు తెచ్చ్చేటట్లు అనుకున్నారు.

Photo by RODNAE Productions from Pexels: https://www.pexels.com/photo/mother-and-daughter-dancing-on-the-grass-7104389/

ఆరోజు ఫీజు కట్టే లాస్ట్ రోజు. అన్న ప్రకారం రాధిక డబ్బు  తెచ్చింది. శ్వేత ఆ రోజు కాలేజికి రాలేదు. విమల రాధికలు సాయింత్రం వరకూ శ్వేత గురించి వేచి చూసి వెళ్లి పోయారు. ఫీజు కట్టని కారణంగా విమల ఎగ్జామ్స్ రాయకుండానే హాస్టల్ వదలి ఊరికి వెళ్ళ వలసి వచ్చింది. విమల కంటతడి పెడుతూ వెళ్ళిపోయింది. దానికి రాధిక చాలా బాధ పడి శ్వేత ఇంటికి వెళ్లి తాము అనుకున్న ప్రకారం డబ్బు ఎందుకు తేలేదని నిలదీయగా చెప్పింది శ్వేత.

” ఫీజు డబ్బులు ఇద్దామనే అనుకున్నాను. నేను ఎంత ప్రయత్నించినా విమల కంటే ఎప్పుడూ మార్కులు రావడం లేదు. నా కంటే ఎక్కువ ఎవరికీ ఈ కాలేజీలో రాకూడదు. అందుకే నేను తనకు ఫీజు డబ్బులు ఇవ్వవద్దని తరువాత నిర్ణయించుకున్నాను” అంది. రాధిక ” ఎంత పని చేసావు శ్వేతా. విమల నీ గురించి వేచి చూసి నువ్వు రానందుకు బాధపడుతూ ఊరికి వెళ్ళిపోయింది. దీనినే నేమో నమ్మక ద్రోహం అంటారు.

ఇద్దరం కలసి విమలకు డబ్బులు ఇస్తామని మాట ఇచ్చ్చాము. మనలను నమ్మి విమల పరీక్ష ఫీజు కడ్తామనుకుంది. ఇలా చేస్తే నీ మాట మీద ఇంకా ఎవరికైనా నమ్మకం ఉంటుందా. నీ విషయంలో కూడా ఇలానే చేస్తే నీకు ఎలా ఉంటుంది. మీ పేరెంట్స్ కు నువ్వు నిజమే చెప్పివుంటే విమలకు వాళ్ళే ఇచ్ఛేవారేమో కదా. నీకంటే ఎక్కువ మార్కులు ఎలా వస్తున్నాయని అడిగితే విమల తాను ఎలా చదువుతుందో చిట్కాలు ఉపాయాలు చెప్పేది కదా.

నువ్వు ఇలా నమ్మకద్రోహం చేయడం ఏమి బాగా లేదు” అంటూ ఉద్రేకంగా అంది. ఎప్పుడు తనతో నవ్వుతూ మాట్లాడే రాధిక ఇలా మాట్లాడంతో శ్వేతకు నోట మాట రాలేదు. అవును తాను చేసినది తప్పే అని తన మనసు కూడా చెప్పినా తను స్వార్థంగా ఆలోచించింది. “రాధికా నా అహంకారంతో విమలను బాధ పెట్టాను. నన్ను నమ్మిన విమలను వంచించాను. అప్పుడు కేవలం నా గురించే ఆలోచించాను తప్పితే విమలకు జరిగే నష్టం గురించి ఆలోచించలేకపోయాను.  మనం కాలేజికి వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడి పెనాల్టీ తో అయినా సరే  విమల ఫీజు కట్టించేద్దాం రా” అని అంటూ గబగబా రాధికను తీసుకోని కాలేజికి వెళ్ళింది శ్వేత.

Leave a Reply