పంచ మహా యజ్ఞాలు

Holy Fire Photo by Julia Volk from Pexels: https://www.pexels.com/photo/traditional-buddhist-bowls-and-burning-candle-in-church-5202305/
Reading Time: < 1 minute

పంచ మహా యజ్ఞాలు

పంచ మహా యజ్ఞాలు చాలా ప్రసిద్ధి. వేదాలలో పంచ మహా యజ్ఞాల గురించి ఈ విధంగా చెప్పబడినది. అవి బ్రహ్మ యజ్ఞం,  దేవ యజ్ఞం, మాతా పితరుల యజ్ఞం, అతిథి యజ్ఞం  మరియు బలివైశ్వ దేవ యజ్ఞం.

బ్రహ్మయజ్ఞమనగా సంధ్యావందనాదులను చేయుట, భగవంతుని మరియు భగవంతుని సృష్టిని పూజించుట యని చెప్పియున్నారు. రెండవది దేవ యజ్ఞం అంటే దేవతలను పూజించుట. దేవతలు అంటే నిస్వార్థంగా ఇతరులకు ఉపకారం చేసే వారు. ఉదాహరణకి గోమాత, వృక్షాలు, నదులు, తల్లిదండ్రులు, గురువు మొదలైన వారు. మూడవది మాతా పితరుల యజ్ఞం అంటే తల్లి దండ్రులకు సేవ చేయటం, వారు చెప్పి విధంగా నడచుకోవడం, వారిని గౌరవించుట మరియు వారిని ఆదరించుట మొదలైనవి.

వారే మనకు మొదటి గురువులు కావున వారిని ఆదరించుట ఒక యజ్ఞం లాగా పేర్కొన్నారు. నాల్గవది అతిథి యజ్ఞం. దీనిలో అతిథులను అభ్యాగతులను ఆదరించుట వారికి తగిన సత్కారములు చేయుట మొదలైనవి. ఐదవది బలివైశ్వ దేవ యజ్ఞం అనగా ప్రపంచంలో జీవ జంతువుల పశు పక్ష్యాదులు నాదరించుట. జీవ జంతులోకం కూడా దేవుని సృష్టియే. కనుక వాటి జీవనమును కూడా సహకరించుట చేయవలెను.

పంచ మహా యజ్ఞాలను వివిధ రకాలుగా పెద్దలు వర్ణిస్తారు. కొందరు నృ యజ్ఞం మరియు భూత యజ్ఞము మొదలైన వాటిని కూడా ఈ  పంచ యజ్ఞాలలో భాగమని అంగీకరిస్తారు.

భూత యజ్ఞమే బలివైశ్వ దేవ యజ్ఞమని కొందరు భావింతురు. ఏది ఏమైనప్పటికీ సంక్షిప్తంగా చెప్పాలంటే మానవులందరూ కనీసం ఈ ఐదు యజ్ఞాల రూపంలో వివరించిన విధంగా తల్లిదండ్రులను గౌరవించుట వారు చెప్పిన విధంగా ఆచరించుట, దేవతలను పూజించుట, అతిథి రూపంలో వచ్చ్చినవారిని ఆదరించుట మరియు పశు పక్ష్యాదులను నిస్వార్థముగా ఆదరించుట మొదలైనవి కనీస బాధ్యగా భావించి వేదాలు చెప్పిన విధంగా ఆచరించిన మనిష్యుని జీవితము పరిపూర్ణమౌతుందని ఋషులు తెలియజెప్పారు. 

ఈ యజ్ఞాలు చేయడం వల్ల మనిషి తాను ఈ సృష్టికి  భిన్ను కాడని తనూ ఈ సృష్టికి భాగం అని తెలుసుకొని దానిని సంరక్షించే ప్రయత్నం చేస్తాడు. దాని వల్ల లోకోన్నతి కలుగుతుంది. ప్రతీ వారు ఈ యజ్ఞాలను చేయడం వలన మొత్తం ప్రపంచం బాగుపడుతుంది.

Leave a Reply