పరోపకారి

Philanthropist Photo by Amritansh  Srivastava  from Pexels: https://www.pexels.com/photo/women-holding-green-leaves-14401713/
Reading Time: 2 minutes

పరోపకారి

ఒక ఊళ్ళో రామయ్య సోమయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవాళ్ళు. రామయ్య పొలం చిన్నది. సోమయ్యకు చాలా ఎకరాల పొలం ఉండేది. వారి పొలాలు దగ్గర దగ్గరలో ఉండేవి.రామయ్య చాలా నెమ్మది మరియు ఊరి వారందరి తోనూ మంచిగా ఉంటూ వారికి తగినంత సహాయం చేసేవాడే తప్ప ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు. శాంత స్వభావము కలిగి పరులను నొప్పించేవాడు కాదు. సోమయ్య చాలా దురాశా పరుడు.

తనకు చాలా పొలం ఉన్నా ఎలాగైనా వ్యవసాయం మీద ఎక్కువగా ధనం సంపాదించాలనుకొనేవాడు. తనకు సహాయం చేసే వాళ్ళ తోనే చాలా చక్కగా మాట్లాడేవాడు. తనకు అవసరం లెదకునేవారితో అస్సలు సరిగ్గా మాట్లాడక దుర్భాషలాడేవాడు. కాబట్టి సోమయ్య దగ్గరకు ఎవరైనా పనికి వెళ్లే వాళ్ళు కాదు. అదే రామయ్య దగ్గర కొంత డబ్బులు తక్కువైనా పనికి వెళ్ళేవాళ్ళు కూలీలు.

రామయ్య పొలం ఎత్తులో ఉండడం చేత అతని పొలానికి నీళ్లు సరిగ్గా రాలేకపోయాయి. సోమయ్య పొలం దిగువన ఉండడం వల్ల పొలానికి నీళ్లు త్వరగా వచ్చ్చాయి. రామయ్య నీళ్ల గురించి బావి తవ్వ ప్రారంభించాడు. అతని పొలం ఎత్తులో ఉండడం చేత చాలా తవ్వ వలసి వచ్చింది. కానీ నీళ్లు మాత్రం తక్కువగా వచ్చ్చాయి. సోమయ్య కు తన పొలానికి సరిపడే నీళ్ల కంటే కూడా ఎక్కువగా వచ్చ్చాయి.

అందుచేత రామయ్య సోమయ్యను పొలం నుండి కాలువ తొవ్వి నీళ్లు అప్పుగా ఇవ్వడానికి ధర చెల్లిస్తానని అడిగాడు. సోమయ్య దానికి అతి కష్టం మీద ఒప్పుకున్నాడు కానీ నాలుగింతలు ఎక్కువ ధర అడిగాడు. దానికి రామయ్య అది సబబు కాదని చెప్పిన తరువాత కూడా సోమయ్య దానికి ఒప్పుకోలేదు. రామయ్య ఊరి రచ్చ్చబండ దగ్గర కూడా ఈ విషయం చెప్పి చూసాడు. ఏమి లాభం లేక పోయింది. ఇక తనవల్ల అంత ధర చెల్లించడం కా పని అనుకొని, పక్క ఊరి నుండి లారీల ద్వారా నీళ్లు తెప్పించుకున్నాడు. కొంత ధర ఎక్కువైంది కానీ తను అంత మాత్రమే చెల్లించగలడు. తను ఇంతగా కష్టపడి వ్యవసాయం చేస్తుంటే సోమయ్య ఊరక చూస్తున్నాడే తప్ప రామయ్య బేరానికి ఒప్పుకోలేదు.

పరులకు తోచినంత ఉపకారమే చేయాలి తప్ప,  రామయ్య అడిగిన తరువాత కూడా సోమయ్య ధర విషయం ఒప్పుకోక పోవడం ఎవరికీ నచ్చలేదు. ఒకే ఊరిలో ఉంటూ సాటి మనుషులు పడే బాధలకు తోటివారిని ఆదుకోవాలి తప్ప న్యాయానికి మించిన ధరలడగడం సోమయ్యదే తప్పు అనే ఊరివారంతా అనుకున్నారు.

పొలంలో పనిచేసే కూలీలకు కూడా ఈ విషయం  తెలిసింది. చూస్తుండగా వ్యవసాయం పనులలో పొలాలకు మందు జల్లే విషయం లో రామయ్య క్రమం తప్పకుండా పట్టాడు. సోమయ్యకు  సరైన కూలీలు దొరకక, దొరికినా వారు కూడా సోమయ్య పొలం లో సరిగ్గా పని చేయక, పంటకంతా పురుగులు పట్టి పంట నాశనమయ్యింది. సగానికి సగం కంటే తక్కువ ఫలం అందింది సోమయ్యకు.  ఒక ఊరిలో ఉంటూ తను సంతోషంగా జీవిస్తూ పరులను కూడా జీవించేటట్టుగా ఉండాలి తప్ప కేవలం తనే ధనవంతుడవ్వాలన్న దురాశ ఎవ్వరికైనా కూడదు. దానివల్ల చెడే జరుగుతుంది కానీ ఒకరిని బాధ పెట్టిన పాపం ఊరికే పోదు. జరిగిన విషయాలు తెలుసుకొని సోమయ్య  రామయ్యను  క్షమించమని అడిగాడు. 

రామయ్య ఇస్తానన్న నీళ్ల బేరానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇద్దరూ సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.

Leave a Reply