దయార్ద్ర హృదయం

Kindness Photo by Sonam Prajapati from Pexels: https://www.pexels.com/photo/woman-sitting-with-her-son-on-her-lap-and-pointing-to-the-side-8461611/
Reading Time: 2 minutes
Kindness Photo by Sonam Prajapati from Pexels: https://www.pexels.com/photo/woman-sitting-with-her-son-on-her-lap-and-pointing-to-the-side-8461611/

దయార్ద్ర హృదయం

 ఒకానొక ఊరిలో సమ్మయ్య సమ్మయ్య సాంబయ్య అనే ఇద్దరూ దొంగలు ఉండేవారు వాళ్లు చిల్లర దొంగతనాలు చేస్తూ పొట్ట పోసుకునే వారు. ఒకరోజు వాళ్లు దొంగతనం చేసుకొని వస్తూ ఉండగా అరణ్య మార్గం ద్వారా రావలసి వచ్చింది.. అరణ్య మార్గం మధ్యలో వారిద్దరూ నడిచి నడిచి బాగా అలసి పోయి నందులకు ఒక చెట్టు కింద మంచి నీడ చూసుకొని పడుకున్నారు. లేచిన తర్వాత మళ్ళీ తమ ఇళ్లకు నడక ప్రారంభించారు.

 మార్గమధ్యలో ఒక వృద్ధుడు కళ్ళులేని కబోది కనిపించాడు. అతడు రోడ్డును దాటడానికి కష్టపడుతున్నట్టుగా ఇద్దరూ గ్రహించారు. దానికి సాంబయ్య “ఈ వృద్ధుడు రోడ్డును దాటడానికి కష్టపడుతున్నట్టుగా ఉన్నాడు, మనం రోడ్డును దాటించి వెళదాం” అన్నాడు.  దానికి సమ్మయ్య “ఈ ముసలాడి ని రోడ్డు దాటి ఇస్తే నాకేం వస్తుంది.. దాని వల్ల నాకు ఏమి ప్రయోజనము? నేనైతే ఇతనిని రోడ్డు దాటించడం, ఇతనిని ఇంటికి తీసుకు వెళ్లడం చేయను.ఈ విధంగా చేయడం వల్ల నాకు సమయం వృధా అవుతుంది..” అన్నాడు. సాంబయ్య దానికి “ అయ్యో పాపం ఈ ముసలాడు కళ్ళు లేని కబోది. ఎలా రోడ్డు దాటుతాడు. అతను చెప్పిన ప్రకారం అతని ఇల్లు మనము మన మార్గానికి కొంత దూరంలోనే ఉన్నట్టుగా ఉన్నది. అతనిని వాళ్ళ ఇంటికి చేర్చుదాం. పాపం లేకపోతే ఒక్కడే ఎలా వెళ్తాడు..” అని అన్నాడు.  దానికి సామయ్య “ నువ్వు కావాలంటే నువ్వు అతనిని చేర్చు. కానీ నేను మాత్రం నా దారిన నేను వెళ్ళిపోతాను.  నా సొమ్మును తీసుకు వెళ్ళిపోతాను ..” అని అన్నాడు.

 సాంబయ్య కష్టమైనా ఆ వృద్ధుడి చేయి పట్టుకుని అతని ఇంటికి చేర్చాడు. అతను ఇల్లు చాలా పెద్ద భవనం. దానిలో నుండి ఒక అందమైన అమ్మాయి బయటికి వచ్చింది. ఆ వృద్ధుడు ఆ వృద్ధుడు సాంబయ్యను ఆ అమ్మాయికి పరిచయం చేస్తూ..” ఇతనెవరో మంచి వాడి లాగా ఉన్నాడు. నన్ను ఇతను చాలా కష్టపడి సమయం కేటాయించి నన్ను ఇంటికి తీసుకు వచ్చాడు. ఇతనికీ తప్పక ఆతిథ్యం ఇవ్వగలవు..” అన్నాడు. దానికి అతని మనుమరాలు విజయ చాలా ధన్యవాదాలు సాంబయ్య కు తెలుపుతూ అతనిని కొద్దిరోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్పింది. సాంబయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండడానికి ఒప్పుకున్నాడు. ఉన్నన్ని రోజులు  ఆ ముసలాడికి చక్కగా సపర్యలు చేసాడు. సాంబయ్య అతని చర్యలు విజయకు ఎంతో ఇష్టం కాసాగాయి.  అతనికి కూడా విజయ మీద ప్రేమానురాగాలు పెరగసాగాయి. విజయ కూడా అతనిని ఎంతో ఇష్టపడింది.  ఇద్దరూ వృద్ధుని కి వారి ప్రేమను  గురించి చెప్పడం ద్వారా వారి వివాహం జరిగింది. 

అలా సాంబయ్య మంచితనంతో అతడికి మంచి భార్య మరియు వృద్ధుని ఆస్తిపాస్తులు సంక్రమించాయి. అతను తన దొంగతనాలకు కూడా స్వస్తి చెప్పాడు.  మనము మనకు ఉన్నంతలో సహాయం చేస్తే అది తప్పకుండా మన మంచికి దారి తీస్తుంది. సాంబయ్యకు దయార్ద్ర హృదయం ఉన్నందుకే ఆ వృద్ధునికి సహాయపడ గలిగాడు. దానివల్ల అతనికి తన జీవితంలో మంచి జరిగింది. కాబట్టి మనకు ఉన్నంతలో మనము ఇతరులకు సహాయపడాలి. దానివల్ల ప్రయోజనం మరియు తృప్తి కూడా కలుగుతుంది. అలా ఇంకొకరికి మేలు చేసిన వారికి తప్పకుండా మంచి జరుగుతుంది.

Leave a Reply