నమస్కారం ఒక సంస్కారం

Yoga Pose Photo by cottonbro from Pexels
Reading Time: 2 minutes

నమస్కారం ఒక సంస్కారం

హాయ్…హలో…గుడ్ మార్నింగ్…బాయ్…ఇలాంటివన్నీ ఒకరినొకరు పలకరించుకునేందుకు మనం ఉపయోగించుకునే పదాలు. కానీ వీటన్నింటి కంటే సంస్కారవంతమైన పదం ‘‘నమస్కారం’’ ఒక్కటే. ఈ సంస్కారవంతమైన పదం పుట్టింది మన భారతదేశంలోనే.

నమస్కారం అనే పదానికి మనం అభినయించి చూపించే భంగిమ, అర్ధాన్ని, అందాన్ని ఇస్తుంది. నమస్కారం అనే పదానికి మనదేశంలో ఎంత ప్రాధాన్యత ఉందో నమస్కరించేటువంటి ముద్రకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. రెండు చేతులూ జోడించి వాటిని హృదయం వద్ద ఉంచి నమస్కారం అనే పదాన్ని మనం ఉచ్ఛరిస్తూ ఎదుటివారిని గౌరవించటంలో మన ఆత్మీయత, గౌరవభావాలు, వినయ విధేయతలు స్పష్టమవుతాయి.

ఒకరికి ఒకరు ఆత్మీయంగా మనసుతో పలకరించుకున్నప్పుడు, ఏదైనా కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నప్పుడు, సాదరంగా స్వాగతం పలుకుతున్నప్పుడు, శుభాకాంక్షలు తెలియచేసేటప్పుడు, సహృదయంతో వీడుకోలు పలుకుతున్నప్పుడు…ఇలా ఎన్నో సందర్భాల్లో నమస్కార ముద్రికను ప్రదర్శిస్తూ ఉంటాం. ఈ నమస్కారానికి తదనుగుణంగా మనం పెట్టే భంగిమకు మన హిందూ సాంప్రదాయంలో ఒక గొప్ప నిర్వచనం ఉంది.

నమస్కారం అని తెలుగులో తియ్యగా పిలుచుకునే ఈ పదానికి ‘నమస్కార్’ అన్నది మూలపదం. అయితే ఎక్కడ, ఏ భాషలో కొద్దిమార్పులతో ఎలా పిలిచినా మన భంగిమ మాత్రం దేశమంతా ఒకేలా ఉంటుంది. నమస్కార భంగిమను ఎక్కువగా భగవంతుని ధన్యానంలో మనం వినియోగిస్తాం. భగవంతుని అర్చనలో మనం చేసే షోడషోపచారాల్లో(16 విధాలైన సేవల్లో) నమస్కారం ఒకటి. ‘ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి’ అంటే భగవంతునికి చేతులు జోడించి నమస్కరిస్తాం.

అంతే కాకుండా భారత దేశంలోని అన్ని మతాలకు కూడా ఈ నమస్కారం ఒక సంస్కార వంతమైన పదమే. యోగా తోపాటు అన్నిభారతీయ నృత్యకళల్లో నమస్కార భంగిమకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి వ్యక్తి తన నిత్య జీవన కృత్యాల్లో భాగంగా ఒక్కసారైనా నమస్కారముద్రను ధరించి తీరుతారని ఒక పరిశోధనలో వెల్లడైందట. మన దేశంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మనః పూర్వక స్నేహభావాన్ని, సుహృద్భావ వాతావరణాన్నినెలకొల్పేది, పెంపొందించేది ఒక్క నమస్కారం మాత్రమే.

నమస్కారం ఇలా పుట్టింది.  ‘నమస్కారం’ అనేది సంస్కృత పదం ’నమస్తే‘ నుండి పుట్టింది. ‘నమస్’ అంటే వందనం, ఆరాధించడం, ప్రణామము అనే అర్ధాలు వస్తాయి. ‘తే’ అంతే మీకు అని అర్ధం. ‘నమస్తే’ అంటే మీకు వందనం చేస్తున్నాను, మీమ్ములను ఆరాధిస్తున్నాను, మీకు ప్రణామము అని అర్దం వస్తుంది. అంటే అన్ని పదాలను బట్టి మనం భగవంతునికి గానీ మరెవరికి గానీ నమస్కరిస్తే ‘నేను మిమ్ములను గౌరవిస్తున్నాను’ అనే అర్ధం వస్తుంది.

వేళ్లతో పాటుగా రెండు చేతులను జోడించి కొంచెం వంగి ఆ చేతులను మన వృదయానికి తగిలేలా పెట్టుకోవడం ప్రణామాసనం అవుతుంది. ప్రార్ధనా భంగిమ లేదంటే అంజలి ముద్ర అంటారు.

ఎదుటి వారి పట్ల భక్తిభావంతో, వారి పట్ల మనకు ఉన్న భక్తిబావాన్ని, గౌరవ భావాన్ని చాటిచెప్పేందుకు ప్రార్థనా భంగిమతో నమస్తే అని సంబోధిస్తామన్నమాట.

నేటి కాలంలో నమస్కారం అంటూ ఒక చేతిని పైకెత్తి చెప్పడం పరిపాటైంది. కానీ నమ్కరారం చెప్పేందుకు వినియోగించాల్సిన సంస్కార భంగిమే ఈ అంజలి ముద్ర. అప్పుడే ఆ పదానికి దగిన ఆర్థం వ్యక్తం అవుతుంది.

హిందువుల్లో నమస్కారానికి ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ప్రణామాసనంతో భగవంతునికి వంగి నమస్కరిస్తాం. ఈ పరంపరలో మన చేతులు చాపి కదానికి కటి చెర్చి ఆ ముద్రను మన మనసు స్థానంలో ఉంచుతాం. అంటే నేను నిన్ను మనసులో నింపుకున్నాను అని అర్ధం వస్తుంది. ఇదే విధంగా ఒకరు మరోకరికిదే ముద్రలో నమస్కారం చేస్తే వారి మద్యన మనసులో బంధం ఏర్పడిదని అర్ధం వస్తుంది. అలాగే నేను మిమ్మల్ని భగత్సమానుని గా పరిగణిస్తూ హృదయంలో నిలుపుకుంటున్నాను అని అర్ధం వస్తుంది.

Leave a Reply