భయపెట్టిన ఒక “కల”

Dream @chandamama
Reading Time: 3 minutes

భయపెట్టిన ఒక “కల”



అది అర్ధ రాత్రి పన్నెండు గంటల సమయం అమృత ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె ఎందుకో చాలా భయపడుతూ మంచం పై కూర్చొని ఉంటుంది ఇంతలో తన తల్లి అక్కడికి వస్తుంది. అమృత: – అమ్మ దెయ్యం అమ్మ దెయ్యం అమ్మ మంచం కింద దెయ్యం ఉందమ్మా.


తల్లి: – ఏంటి అమృతా నువ్వు చెప్పేది ఏంటి ?? ఎందుకు అంత భయపడుతున్నావు ? ఏం జరిగిందని ?? దెయ్యాలు లేవు గియ్యాలు లేవు. ముందు నువ్వు వచ్చి అన్నం తిను ..అంటూ మందలిస్తుంది.

అమృత:- అమ్మ నేను చెప్పేది నిజం అమ్మా… కావాలంటే మంచం కింద ఒకసారి చూడు.

తల్లి: – సరే నేను ఇప్పుడు మంచి కింద చూస్తాను అక్కడ ఎలాంటి దెయ్యం లేదనుకో. అప్పుడు నీ పని చెప్తా… నువ్వు ఇంకా చిన్న పిల్లవి కాదు పెళ్లి వయసు వచ్చింది. ఇప్పుడు కూడా ఇలాంటి ఆటలు ఆడుతున్నావని ఒకసారి మంచం క్రిందకి తొంగి చూస్తుంది. మంచం కింద ఆమె చూసి భయంతో ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అచ్చం అమృత లాగే కింద పడుకొని ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమెను చూసి మంచం కింద ఉన్న

అమ్మాయి: – అమ్మ నాకు చాలా భయంగా ఉంది అమ్మ మంచం పైన దెయ్యం ఉందమ్మా.
అని భయంగా చెప్తూ ఉంటుంది.


దానిని విన్న ఆమె ఒక్కసారిగా మంచం పైన చూస్తుంది మంచం పైన అమృత మంచం కింద మరో అమృత ఆమె భయంతో కాపాడండి దెయ్యం కాపాడండి…అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. ఇంతలో ఆమె భర్త వచ్చి ఏమైంది వనిత ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావ్…
వనిత :- అటు చూడండి మన అమ్మాయి ఇద్దరు లాగా ఉంది. మంచం కింద ఒకళ్ళు మంచి పైన ఒకరు.
భర్త: ఏంటి పట్టపగలే కలగంటూన్నావా.. మన అమ్మాయి హాస్టల్ కి వెళ్లి నాలుగు రోజులు అవుతుంది. మతుండే మాట్లాడుతున్నావా.
అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు
ఆమె: నిజమే కదా మరి నేను చూసింది ఎవరిని నాకంతా అయోమయంగా ఉంది ఒకసారి నేను అమృత కి ఫోన్ చేస్తాను. ఇప్పుడు కాలేజ్ టైం కూడా అయిపోయింది…అని చెప్పి ఆమెకు ఫోన్ చేస్తుంది. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె చాలా సార్లు ప్రయత్నిస్తుంది కానీ అదే స్విచ్చాఫ్ రావడంతో తన భర్తకి చెప్తుంది. తన భర్తకి కంగారు వేసి తన స్నేహితురాలైన పావని కి కాల్ చేస్తాడు.

పావని: హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నారా. అమృత ఎలా ఉంది.

అతను:అదేంటమ్మా అమృతా నాలుగు రోజుల క్రితమే కదా కాలేజ్ కని చెప్పి వచ్చింది ఇప్పుడు హాస్టల్ లో లేదా?



పావని: అంకుల్ మేము అందరం వచ్చిన మాట నిజమే కానీ కాలేజీ లో కొన్ని గొడవల కారణంగా బంద్ జరిగింది. అందుకే మాకు ఒక నెల రోజుల పాటు సెలవులు ఇచ్చేసారు. ఏమైంది అంకుల్ అమృతకి అంతా బాగానే ఉంది కదా.

అమృత నాన్న :సరే అమ్మ మేము అందరం బాగానే ఉన్నాము నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు. అసలు అమృతకు ఏం జరిగిందో అని ఆ భార్యాభర్తలు ఇద్దరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో అమృత అక్కడికి వస్తుంది. ఏమైంది నాన్న.
తండ్రి: ఏంటి అమృత మీకు ఎప్పు డో సెలవులు ఇచ్చారు అంట కదా నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు.
అమృత…. నాన్న నాన్న అంటూ ఏడుస్తూ దయ్యంగా మారిన అమృత నాన్న హాస్టల్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే దారిలో చీకటి పడింది .
నాకు చీకటి అంటే చాలా భయం కదా నాన్న . నేను చాలా నిదానంగా వస్తున్నాను.
నా వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపించింది.
నేను వెనక్కి తిరిగి చూశాను కానీ నాకు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక్క సారిగా నన్ను ఎవరు పట్టుకున్నట్టు.
అయింది. నేను చాలా పెద్దగా అరిచాను.


అప్పుడు నా ముందుకు ఒక దయ్యం
వచ్చి ఎలా ఉన్నావ్ అమృత నేను అచ్చం నీలాగే ఉన్నా నీ చెల్లెల్ని. కానీ నీతో కలిసి బ్రతికే అవకాశం నాకు దేవుడు ఇవ్వలేదు. అందుకే నువ్వు కూడా చనిపోయావు అంటే మనం ఇద్దరం కలిసి హాయిగా బ్రతకవచ్చు అక్క చెల్లెలు ఇద్దరం ఒకచోటే ఉండొచ్చు.
సరే కదా అంటూ నన్ను గొంతు పిసికి చంపేససింది. ఇప్పుడు నేను కూడా పిశాచిగా మారాను నాన్న. కానీ నేను ఆ అమ్మాయితో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు ఆ అమ్మాయి కచ్చితంగా నన్ను తీసుకోవడానికి ఇక్కడికి కూడా వస్తుంది. నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను నాన్న.
ఆ మాటలు విన్న తల్లిదండ్రులిద్దరూ…అయ్యో భగవంతుడా ఏంటి ఈ పరీక్ష అసలు ఏం జరుగుతుంది. అనుకుంటూ ఉండగా అమృత చెల్లి దెయ్యం గా వచ్చి ఎందుకు అక్క ఇంకా అమ్మ నాన్న దగ్గరే ఉంటావు. నాతో కలిసి ఉండడానికి నీకు ఎందుకు అంత బాధగా అనిపిస్తుంది. ఇరవై సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నావ్ కదా వాళ్ళతో ఇప్పటి నుంచి నాతో కలిసి జీవించు అంటూ ఆమెను బలవంతంగా తీసుకొని వెళ్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న అమృత అమృత అంటూ కేకలు వేస్తారు.

అమృత దయ్యం: నేను నాకు ఇష్టం లేదు నన్ను విడిపించండి ఈ దెయ్యం భారీ నుంచి నన్ను విడిపించండి. నాన్నా……?? అంటూ పెద్దగా అరిచి ఒక్కసారిగా నిద్ర నుంచి లేచి అమ్మో ఇదంతా కల నా కళ్ళ ముందు అంతా జరుగుతున్నట్లు అనిపించింది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను హాస్టల్ లోనే ఉన్నా కదా. టైం గాడ్ అసలీ భయంకరమైన కల ఏంట్రా బాబు. కొన్ని క్షణాలు ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇలాంటి కలలు జీవితంలో ఎవరికి రాకూడదు భగవంతుడా అంటూ మళ్లీ విశ్రాంతి తీసుకుంటుంది.

Leave a Reply