ముసలి అవ్వ ఆవేదన

Old Indian Woman @pexels
Reading Time: 3 minutes

ముసలి అవ్వ ఆవేదన

ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ ఉండేది . ఆమెకు పిల్లలు అంటే చాలా ఇష్టం . వాళ్ళ కొడుకులు ఆ ముసలి అవ్వను పట్టించుకొనే వారు కాదు. ఆస్తులు అన్ని ఆమె దగ్గర నుంచి తీసుకొని ముసలి అవ్వను వదిలిపెట్టి వెళ్ళిపోతారు . ఆ ముసలి అవ్వ ఎవరి మీద ఆధారపడి బ్రతికేది కాదు .
కూలి పని చేసుకొని నాలుగు రాళ్లు సంపాదించుకొనేది. తన కొడుకులు ఆమె దగ్గరికి రావాలని పూజలు, వ్రతాలు చేసేది. ఐన ఫలితం అస్సలు ఉండేది కాదు. ఎప్పుడూ ఒంటరిగా ఒక్కటే ఉండేది. ఒక రోజు ముసలి అవ్వ దగ్గరికి ఇద్దరు పిల్లలు వస్తారు. ఆ పిల్లల పేర్లు రాజు , భాను . వాళ్లిద్దరూ అన్నా చెల్లెల్లు . ముసలి అవ్వ దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతారు.


రాజు :- అవ్వా…మాకు పని కావాలి ఇక్కడ ఏమైనా దొరుకుతుందా ?

ముసలి అవ్వ :- ఒయోబ్బా.. నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు పెద్ద పనులు కూడా చేస్తావా మరి ?

రాజు :- చేస్తాను అవ్వా..మా చెల్లికి , నాకు గుప్పెడు అన్నం పెట్టండి చాలు.

ముసలి అవ్వ :- నువ్వు ఇప్పుడు పని చేసే సమయం కాదు బాబు , నువ్వు మంచిగా చదువుకోవాలిసిన సమయం ఇది.

రాజు :- అవ్వా … నేను ఒక మాట చెబుతాను.


మా లాంటి వాళ్ళను దేవుడు ఎందుకు పుట్టిస్తాడో తెలియదు . ఎందుకు చిన్నప్పటినుంచే కష్టాలు పెడతాడో తెలియదు. అమ్మా అని పిలవడానికి అమ్మ ఎక్కడ ఉందో తెలియదు ?? అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు ??? నాన్న ఉన్నాడో ? లేడో ? తెలియదు. చిన్న అన్నం మెతుకు కోసం 24 గంటలు కష్టపడినా మెతుకు దొరకడం కూడా చాలా కష్టము. ఇన్ని బాధలు పడుతున్న నేను , నా జీవితంలో నా స్థానమే సరిగా లేనప్పుడు నా చదువు గురించి ఎలా ఆలోచించాలి అవ్వా …!!!



ముసలి అవ్వా :- చూడు బాబు , బాధలు అన్నాక అవి మనుషులకే వస్తాయి . అంత మాత్రాన మనము బాధ పడాలిసిన అవసరం లేదు. నువ్వు ఇంత చిన్న వయస్సులోనే మీ చెల్లి గురించి పెద్ద బాధ్యత తీసుకున్నావు . అది చాలా మంచి నిర్ణయం. నా కొడుకులు ఉండి కూడా నన్ను పట్టించుకోరు .అందరూ ఉండి కూడా నేను ఇక్కడ ఒంటరిగా బ్రతుకుతున్నాను .


అప్పుడు భాను ఈ విధంగా మాట్లాడుతుంది.

భాను :- అవ్వా .. మా అన్నయ్యకు ఏదయినా పని ఉంటే ఇవ్వండి . నేను , మా అన్నయ్య నిన్ను మా సొంత అమ్మలాగా చూసుకుంటాము. మీ కొడుకులు లాగా మేము మిమ్మల్ని వదిలిపెట్టము.

రాజు :- అవును అవ్వా . మా చెల్లి చెప్పినట్టు నిన్ను బాగా చూసుకుంటాను అవ్వా. నాకు దయచేసి పని ఇప్పించండి.

ఆ పిల్లలు మాటలకు అవ్వ చాలా సంతోషపడుతుంది.

ముసలి అవ్వా :- ఏ జన్మ బంధమో మనది ఈ జన్మలో నన్ను కలుసుకున్నారు. నా అన్న వాళ్ళు నాతో ఒక్కరు కూడా లేరని చాలా బాధ పడ్డాను . నేను చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు.
నా మోర దేవుడు ఆలకించి మిమ్మల్ని నా దగ్గరికి పంపించారు . మీరు ఏ పనులు చేయాలిసిన అవసరం లేదు. నేను మీ ఇద్దరిని చదివిస్తాను .మీ ఇద్దరు మంచిగా చదువుకొని ప్రయోజకులు కావాలి అని చెబుతుంది.

రాజు : – అవ్వా ..నేను కూడా పని చేస్తాను. మా చెల్లిని బాగా చదివించాలి .

ముసలి అవ్వ :- వద్దు బాబు , మీరు ఇద్దరు చదువుకోవడమే …మీరు నాకు చేసే పెద్ద పని అని చెబుతుంది .

ముసలి అవ్వ ఆవేదన



ఇద్దరిని పెద్ద చదువులు చదివిస్తుంది. ఇద్దరికి మంచి జాబులు కూడా వస్తాయి . జీతము తీసుకొని వచ్చి అవ్వ చేతిలో పెడతారు. అప్పుడు అవ్వ చాలా సంతోషపడుతుంది . అవ్వ దగ్గర బోలెడు డబ్బులు ఉంటాయి . ఆ డబ్బులతో ఇల్లు కూడా కట్టుకుంటారు . కొన్ని రోజులు తరువాత ముసలి అవ్వ కొడుకులు ఇంటికి వస్తారు .


అప్పుడు రాజు ఈ విధంగా అంటాడు .

రాజు :- ఒక్క అడుగు ఈ ఇంటిలో పెట్టె ముందు మా అమ్మ దగ్గర పెర్మిషన్ తీసుకోని రండి . ఐన మీ లాంటి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు అని మొహం మీదే అనేస్తాడు.

అప్పుడు అవ్వ ఈ విధంగా అంటుంది .

ముసలి అవ్వ :-

నాకోసం వచ్చారా లేక ? నా దగ్గర ఉన్న డబ్బు దోచుకెళ్లాడనికి వచ్చారా ? ఇంకా మీ అమ్మ ఎందుకు బ్రతికే ఉందని చూడటానికి వచ్చారా ?
మిమ్మల్ని పెంచినందుకు నాకు తగిన శిక్ష వేశారు .ఈ జన్మకి ఇది చాలు .


వాళ్ళిద్దరిని చూసారా ?? నేను వాళ్ళకి గుప్పెడు అన్నము పెట్టాను అంతే . ఆ విశ్వాసంతో ఇప్పటికి కూడా నన్ను వదల్లేదు . మీకు లక్షలు పెట్టినా లక్షణంగా వదిలేసి , మీ దారిన మీరు వెళ్లిపోయారు.


నా కొడుకు , కూతురు వీళ్ళిద్దరే . మీకు నాకు ఏ సంబంధం లేదు అని బాధ పడుతూ కొడుకులతో చెప్తుంది.


కొడుకులు :- అమ్మా ..మేము చేసింది చాలా పెద్ద తప్పు . మా తప్పును తెలుసుకొన్నాము . మమ్మల్ని మన్నించు అమ్మా…



ముసలి అవ్వ :- ఏంటి మీరు అమ్మా అని పిలుస్తున్నారా ?? ఒక అమ్మ ఉందని ఇప్పుడు గుర్తు వచ్చిందా ? నేను మిమ్మల్ని నవ మాసాలు మోసి పెంచినందుకు పెద్దబహుమతి ఇచ్చారు . ఈ పిల్లలను చూసారా ? నేను వాళ్ళకి ఏమి చెయ్యలేదు …కానీ వాళ్ళు నాకు నెల నెల తినడానికి డబ్బులు పంపించే వాళ్ళు . మీలో ఒక్కరు ఐన వచ్చి నువ్వు ఎలా ఉన్నావ్ అమ్మ అని ఎవరైనా అడిగారా ??



కొడుకులు :- నిన్ను విడిచి పెట్టడమే మేము చేసిన పెద్ద తప్పు అమ్మ . నిన్ను ఇప్పటి నుంచి బాగా చుడుకుంటాంము అమ్మా… ఒక్క అవకాశం ఇవ్వు అమ్మా అని అడుగుతారు .

అప్పుడు రాజు…

రాజు :- మాకు అమ్మ లేక చాలా బాధలు పడ్డాము. మీకు అమ్మ ఉండి కూడా పట్టించుకోవటలేదు . ఆ దేవుడు అమ్మ విలువ తెలిసిన వాళ్ళకి అమ్మను లేకుండా చేస్తాడు . అమ్మ ఉన్న వాళ్ళకి అమ్మ అంటే విలువ ఉండదు . ఇప్పటికైనా మారండి . అమ్మని మంచిగా చూసుకోండి అని చెప్తాడు.



వాళ్ళ తప్పును అవ్వ క్షమిస్తుంది .
అందరూ కలిసి మెలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉంటారు .



నీతి :- మన దగ్గరికి రావాలని రాసి పెట్టి ఉంటే అది ఏ సమయంలో ఐనా మన దగ్గరికి చేరుతుంది .


Leave a Reply