మాయ “పిట్టలు” చేసిన మేలు!

Reading Time: 2 minutes

మాయ ” పిట్టలు ” చేసిన మేలు

ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి వ్యాపారాలు చేయడం తప్ప ఇంకేమి వచ్చేవి కావు.


ఒక రోజు కొత్త వ్యాపారం చేయడానికి ఒక ఉరికి వెళ్తాడు. ఆ ఊరిలో చూసినంత లెక్క పిట్టలే కనిపిస్తాయి. ఊరిలో మనుషులు కనిపించరు. అప్పుడు ఆ వ్యాపారి ఇలా అనుకుంటాడు. ఇది ఏంటి అసలు మనుషులు లేకుండా ఎక్కడ చూసినా పిట్టలే కనిపిస్తున్నాయి అని , కొంచెం దూరం వెళ్లి చూస్తాడు. అక్కడ కూడా ఎవరు కనిపించరు .లాభం లేదు అని ఇంకా ముందుకు వెళ్ళి చూస్తాడు. అప్పుడు ఒక మనిషి కనిపిస్తాడు.


అతని పేరు రంగయ్య . రంగయ్య దగ్గరికి వ్యాపారి నడుచుకుంటూ వెళ్తాడు. వ్యాపారి, రంగయ్యని ఈ విధంగా అడుగుతాడు. ఏంటి అయ్యా ఇక్కడ ఎంత లెక్క చూసిన పిట్టలే కనిపిస్తున్నాయి. ఊరు కనిపించటలేదు. అప్పుడు రంగయ్య ఈ విధంగా జవాబు చెప్తాడు. అది ఏమి లేదు అండి. మీరు వచ్చిన దారిలో మాత్రమే పిట్టలే కనిపిస్తాయి.

ఆ దారిని దాటి వచ్చాక మీకు ఊరు కనిపిస్తుంది. కావాలంటే ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి . మీకు ఊరు కనిపిస్తుంది.



వ్యాపారి :- అవును అవును నాకు ఇప్పుడు ఊరు కనిపిస్తుంది. ఇందాక పిట్టలు తప్ప ఇంకేమి కనిపించలేదు. ఎందుకని ఇలా ఆ దారిలో మాత్రమే పిట్టలు కనిపించడం ?



రంగయ్య :- ఇది మా తాతల కాలం నుంచి ఉన్న దారి అండి. ఈ దారిలో అనేక రకాల మాయ పిట్టలు ఉంటాయి. ఆ దారిలో నడిచిన వాళ్ళకి మంచిగా పంటలు పండుతాయి అని మా ఊరు వాళ్ళు అందరూ నమ్ముతారు. అలాగే ప్రతి యేడు ఆ పిట్టలకు ఒక రోజు ప్రసాదం కూడా చేసి పెడతారు. సంవత్సరంలో ఒక్క రోజు అంటే 24 గంటలు ఆ దారిలో వాలి అందరికి కనిపిస్తాయి. ఆ రోజు మా ఊరు వాళ్ళు ప్రసాదాలు చేసి పిట్టలకు పెడతారు. పిట్టలు మమ్మల్ని ఏమి చేయవు. అలాగే మా ఊరి మీదకు ఎవరైనా వచ్చినా ఆ పిట్టలు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి తిరిగి పంపిస్తుంది. మనుషులకే కాదు అండి పిట్టలకు కూడా మనస్సు ఉంటుంది అండి .ఇది అంత వ్యాపారికి చెప్తాడు.


వ్యాపారి :- చాలా బాగుంది రంగయ్య . నేను ఇప్పటికి చాలా వ్యాపారాలు చేసాను కానీ పిట్టలు సహాయం గురించి ఎక్కడా వినలేదు. ఇప్పుడే వింటున్నా ! మునుషులే కాదు పిట్టలు కూడా మునుషులకి సహాయం చేస్తాయి అని ఈ పిట్టలు నిరూపించాయి. కొంతమంది పిట్టలను చంపేస్తూ ఉంటారు . వాటిని చంపకండి. మీరు వాటికి ఆహారం పెట్టకపోయినా పర్లేదు. వాటిని స్వేచ్ఛగా బ్రతనివ్వండి అని వ్యాపారి చెప్తాడు.


Leave a Reply