” గొప్ప ” మాటలు !!

Reading Time: 2 minutes

” గొప్ప ” మాటలు


1. ఏ పని సాధించాలన్నా సహనం , పట్టుదల, ప్రేమ , పవిత్రత చాలా అవసరం . పట్టుదల లేనిదే మనము అనుకున్న పనిని చేయలేము అలాగే ఎప్పటికి సాధించలేము కూడా !! ఇప్పటికైనా మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రాంతిని తీసుకోకండి. గెలుపు కావాలనుకుంటే ” సమరం ” చేయాలి, ” సహనం ” ఉండాలి !! ఈ రెండిటిలో ఏది లేకపోయినా గెలుపును కోల్పోతావు !!!! ఓడిపోతా అనే మాట రానివ్వకండి.
అస్సలు ” ఓడిపోతా ” అని నిత్యం భయపడే
వాళ్ళకి ” గెలుపును ” కోరుకునే హక్కు లేదు.


2. మనకు కష్టం వచ్చినప్పుడు బోరున ఏడుస్తాము లేదా వేరే వాళ్ళ సాయం కోసం ఎదురుచూస్తా ఉంటాము. ఆ ఆలోచన మనిషి మానుకోవాలి. మానసికంగా శక్తిమంతులై ఎంతటి కష్టం వచ్చినా ఒంటరిగా ఎదుర్కోవాలి .

3. అర్థం కాని బంధం అర్థం లేని సంబంధం రెండు ఒకటే . బంధము ఎప్పుడైనా ” బాధను ” పంచుకునేలా ఉండాలి కానీ తుంచుకొని వెళ్లిపోయేలా ఎప్పుడూ ఉండకూడదు. బంధానికి బాధలు తెలుసుకోవడం , పంచుకోవడం మాత్రమే తెలుసు. నిజమైన బంధం ఎప్పటికి దూరం అవ్వదు.

4. నీ జీవితాన్ని నీ చేతిలోనే ఉంచుకో… వేరే వాళ్ళకి అంకితం చేసినా, ఈ రోజుల్లో గుర్తించే వాళ్ళు అంటూ ఎవరు లేరు ?? కొంతమంది వాళ్ళ జీవితాల్ని కూడా వదిలేసి వేరే వాళ్ళ జీవితం కోసం ఆలోచిస్తా ఉంటారు . మరి మీ జీవితంలో పేజీలు ఎవరు తిప్పుతారు అండి . కాలం కూడా మన జీవితంలో ఒక భాగం. ఇది తెలుసుకోలేక పోతున్నారు. కాలం చాలా విలువైనది . ఒక్కసారి పోతే ఎన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాలేము. ఆలోచించి అడుగు వేయండి. ఒక్కసారి ఆలోచించండి.

5. ఒక ” నమ్మకం ” ఎలా ఉంటుంది అంటే
మనము నమ్మిన మనిషి నిజంగా తప్పు చేసినా
మనకి కోపం రాకూడదు !!! అలాగే వాళ్ళ తప్పు
కూడా మనకి కనిపించకూడదు !! ఎదుటివాళ్ళ మీద సాకులు చెప్పడం మానేసి ? మీ జీవితంతో సాహసం చేయండి !!! అప్పుడు మీకు కూడా
ఒక ” జీవితం ” ఉంది అని తెలుస్తుంది !!!

6. దగ్గర ఉన్నపుడు ఏమి అవుతాదిలే అనుకుంటారు ?? దూరం అయ్యాక అదే కావాలంటారు !!దగ్గర ఉన్నప్పుడు , దూరం అయ్యాక ఒకేలా మీరు ఉండగలిగినప్పుడే
మీ జీవితం ముందుకు వెళ్తుంది !!! ఇది చెప్పడానికి కష్టంగా ఉన్నా ఇలా ఉండగలిగితే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా చిరునవ్వుతో సమాధానం చెప్పి ముందుకు వెళ్లిపోవడమే .


7.” మంచిని” గెలిపించనంత కాలం
” చెడు ” పడుతూనే ఉంటుంది . మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు వైపు మాత్రం నిలబడకండి ?

Leave a Reply