వ్యవసాయం

Farmer @pexels
Reading Time: 2 minutes

వ్యవసాయం

” వ్యవసాయం ” అనేది మనిషి చరిత్రలో పెద్ద కీలకాంశం. వ్యవసాయం నేర్చుకునేటప్పుడు కష్టంగా ఉన్నా నేర్చుకున్న తరువాత తేలికగా ఉంటుంది. వ్యవసాయంతో ప్రతి యొక్కరు బ్రతకవచ్చు. అస్సలు ఏమి పని రాని వాళ్ళు కూడా వ్యవసాయం నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకావచ్చు. ఈ ప్రపంచంలో రైతులు ఎక్కువుగా ఉన్నారు . ఎక్కువ శాతం ప్రజలు ఎంచుకునే వృత్తి ” వ్యవసాయం ” .

ఎప్పటికైనా రైతే ” రాజు ” అవుతాడు . వాళ్ళు తమ కోసమే పంటలు పండించడమే కాకుండా దేశంలో ఉన్న మారు మూల ప్రాంత వాసులకు , పట్టణాలలో ఉండే వాళ్ళ కోసం పంటలు వేస్తారు. రైతు తలచుకుంటే ఎంతటి పంటని ఐన పండిస్తాడు.

అంత పండించిన రైతుకి మాత్రం మిగిలింది కన్నీరు.

పండించిన పంట తగిన రేటు ఉండదు. రేటు ఉన్న సమయంలో పంట దిగుబడి ఉండదు. ఇలా ఎన్నో బాధలు తాను అనుభవిస్తూ , గుండెల్లో దాచుకొని పంటలను పండిస్తుంటాడు. రైతులను ఎంత గౌరవిస్తే మనకి అంత మంచి. జరుగుతుంది. పల్లెటూరిలో ఏ ఉరికి వెళ్లి చూసిన అక్కడ మీకు వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రమే కనిపిస్తారు.

మన దేశంలో వ్యవసాయం మూడు విధాలుగా ఉంటుంది.

1 ) ఖరీఫ్ పంట కాలం : ఈ కాలంలో పండే పంటలు వరి, మొక్కజొన్న , ప్రత్తి , చేరుకును
పండిస్తారు.
2 ) రబీ పంట కాలం : ఈ కాలంలో పండే పంటలు గోధుమ , మినుములు , ధనియాలను పండిస్తారు.
3) జైద్ పంట కాలం : ఈ కాలంలో పుచ్చకాయలు, దోసకాయలు , బీరకాయలు, అన్ని రకాల కూరగాయలను పండిస్తారు .

రైతు లేనిదే మనము లేము. ఎందుకంటే వాన వచ్చిన, ఎండ వచ్చిన అలసట లేకుండా పని చేసేది ఒక్క రైతు మాత్రమే. అందుకే రైతు లేకపోతే మనము లేము. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే నిజానికి రైతులు అంత కష్ట పడుతున్నారు కాబట్టి పట్టణం ఉండే వాళ్ళుకి తినడానికి బియ్యం, కూరగాయలు దొరుకుతున్నాయి. వాళ్ళు చాలా కష్ట పడితేనే కానీ మనకి తినడానికి బియ్యం, కూరగాయలు బయటికి వెళ్ళగానే దొరుకుతున్నాయి. మరి ఇంత కష్ట పడిన రైతు మాత్రం సంతోషంగా లేడు .ఈ దేశంలో అందరి కన్నా ఎక్కువ కష్టపడేది రైతే. ఇప్పటి కైనా రైతు కష్టాన్ని గుర్తించి వాళ్ళకి ఇవ్వాలిసిన గౌరవం ఇవ్వండి. రైతులని చులకనగా చూడటం మానేయ్యండి.

వ్యవసాయానికి వాడే వస్తువుల ఏంటో తెలుసుకుందాము.
* పార ,
*గడ్డపొలుగు,
* గొడ్డలి ,
* నాగలి ,
* కొడవలి ,
* ట్రాక్టర్ ,
* అరక .

రైతు నష్టాన్ని చూసేవాడు ” నాయకుడు “
రైతు కష్టాన్ని గుర్తించేవాడు ” దేవుడు “

Leave a Reply