వంకాయ పచ్చడి

Eggplant @pexel
Reading Time: < 1 minute


వంకాయతో కూర , వంకాయ కారం ఎలా చేయాలో మనకి తెలుసు. వంకాయతో పచ్చడి చేసుకోవచ్చు.


ఇది చాలా మందికి తెలియదు. వినే ఉంటారు . కానీ ఎలా చేయాలో తెలియదు కొందరికి .
అందరికి వంకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. ముందుగా కావలిసిన వస్తువులు, తయారీ విధానం తెలుసుకుందాము.

కావలిసిన వస్తువులు :-

వంకాయ – 4 ,
నూనె – 100 గ్రాములు,
చింతపండు – చిన్న టమోటా అంత తీసుకుంటే
సరిపోతుంది ,
ఎండు మిర్చి – 10,
ఆవాలు – 1టీ స్పూన్,
ఉప్పు – సరిపడినంత తీసుకుంటే చాలు.


తయారీ విధానం :-

ముందుగా వంకాయలు తీసుకొని ముక్కలుగా కోసుకుని నూనెలో బాగా వేయించాలి.తరువాత వాటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఎండు మిర్చిని కూడా నూనెలో వేయించుకోవాలి . ముందుగా ఎండు మిర్చిని , చింత పండును తీసుకుని రోట్లో వేసి బాగా దంచాలి. ఈ మిశ్రమంలో వంకాయలు , ఆవాలు వేసి బాగా దంచాలి . అంతే వంకాయ పచ్చడి రెడీ.

Leave a Reply