కష్టం

Ant @pexels
Reading Time: < 1 minute

కష్టం

కష్టం అనే పదం ప్రతి యొక్క మనిషి దగ్గర తిరుగుతూనే ఉంటుంది .ఎందుకంటే ప్రొద్దున లేచినప్పటి నుంచి ఎదో ఒక పని చేస్తూనే ఉంటారు.

పని చేయకుండా ఎవరు ఉండరు. ముఖ్యంగా చెప్పాలంటే రైతులు . రైతులు చాలా కష్ట పడుతుంటారు . వాళ్ళు చేసినంత పని ఎవరు చేయలేరు. ఇరవై నాలుగు గంటలు పని చేయమన్నా అలుపు లేకుండా, విసుగు పడకుండా పని చేస్తూనే ఉంటారు. పల్లెటూరి వాళ్ళు పని చేసుకుంటూ కష్ట పడుతుంటారు. పట్టణం లో ఉన్న వాళ్ళు ఆఫీస్ లో పని చేస్తూ కష్ట పడుతుంటారు.


ఏ పని చేయలేని వాళ్ళు కూడా వ్యవసాయం నేర్చుకొని చేసే వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. వ్యవసాయం అనేది కష్టానికి సంభందించిన విషయం. అనుకున్నంత తేలిక పని ఐతే కాదు వ్యవసాయం.

రాసె కలానికి మాత్రమే తెలుసు తాను మాత్రమే రాయగలను అని,
పూసే పువ్వుకి మాత్రమే తెలుసు తాను మాత్రమే
పూయగలను అని, అలాగే
చేసే మనిషికి మాత్రమే తెలుసు తాను కష్టపడితే
ఏదయినా సాదించగలను అని !!!


పైన చెప్పిన వాటిలో ఏదయినా నువ్వు కష్ట పడితేనే జరిగే పనులు .ఏవి కూడా వాటికంతటికె అవే జరిగిపోవు. కష్ట పడితేనే ఏదయినా సాధించవచ్చు. ముందు మనము కష్ట పడదాము.ఆ తరువాత ఫలితాన్ని కోరుకుందాం. అస్సలు మనము కష్ట పడకుండా ఫలితాన్ని కోరుకున్న ఆ దేవుడు కూడా ఎలా ఇస్తాడు. ఒకసారి
ఆలోచించండి.

Leave a Reply