కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం

Coconut @pexels
Reading Time: < 1 minute
Coconut @pexels

ఇంట్లో పూజ చేసినా, గుడికి వెళ్లినా కొబ్బరికాయ కొట్టడం ఆచారం. చాలామంది ఈ సంప్రదాయం పాటిస్తారు. అసలు కొబ్బరికాయ హిందువులకు మాత్రమే ఎందుకు ప్రత్యేకం ? కొబ్బరికాయను ఎందుకు పగులగొడతారు.కొబ్బరికాయ సంస్కృతంలో దేవుడికి ప్రతిరూపం. కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా పిలుస్తారు. శ్రీఫలం అంటే.. దేవుడి ఫలం అని అర్థం.

హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపైన ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రటి ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయలోపల ఉండే నీళ్లు రక్తం, గుజ్జు లేదా కొబ్బరి మనసుని సూచిస్తాయి

Man Seated Beside Woman Drinking from Coconut
Coconut lovers @pexels


కొబ్బరికాయ వెనక భాగంలో ఉండే మూడు కన్నులకు చాలా మంచి అర్థం ఉంది. ముక్కంటిగా పిలువబడే.. శివుడి మూడు కన్నులను ఆ మూడు గుర్తులు సూచిస్తాయి పూర్వకాలంలో చాలా మంది, చాలా సందర్భాల్లో నరబలి ఇచ్చేవాళ్లు. అంటే దేవుడికి మనుషులను బలిగా ఇచ్చేవాళ్లు.

ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పడానికే ఆధ్యాత్మిక గురు ఆది శంకర నరబలికి బదులుగా కొబ్బరికాయను దేవుడికి సమర్పించండని ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు.కొబ్బరికాయ పగలగొట్టడం వెనక అంతరార్థం ఉంది. ఇలా టెంకాయను పగులకొడితే.. మనుషుల అహం, తొలగిపోతుందని, అలాగే చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది. దాంతోపాటు తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కుగా కొబ్బరికాయను సమర్పిస్తారు భక్తులు.

Leave a Reply