నోటి పూతలు తగ్గే చిట్కాలు !!

Mouth Blisters
Reading Time: < 1 minute

నోటి పుతల వల్ల చాలా మంది బాధ పడుతుంటారు. అవి బాధనే కాకుండా నొప్పిని కూడా కలిగిస్తాయి. నోటి పుతలు వచ్చినప్పుడు ఏమి తిననివ్వవు. మరియు ఆ సమయంలో ఏమి తిన్నా కూడా నొప్పి, మంటను కలిగిస్తాయి. మనము ఆ సమయంలో వేడిని తగ్గించే పదార్థాలు తీసుకోవాలి.అప్పుడు కొంచం నొప్పి తగ్గుతుంది.
నోటి పూత నొప్పిని తగ్గించే చిట్కాలను కొన్ని మీ కోసం.1. వెల్లులి

వెల్లులిలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబయాల్ ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గించడం లో పాత్ర పోషిస్తుంది.ఈ నోటి పుతల వల్ల మీరు నీరసంగా కూడా ఐపోతారు. వీటిలో నొప్పిని తగ్గించేవి ఉండటం వల్ల వెల్లుల్లి నోటి పూతల తగ్గడానికి సహాయపడుతుంది. ఒకటి నుంచి రెండు నిమిషాలు వెల్లుల్లిని నోటి పుండు మీద రుద్దు కోవాలి.కొంత సమయం తర్వాత నోటిని బాగా కడగాలి. ఈ విధంగా చేస్తే మీకు నోటి పూత తగ్గుతుంది.


2. ఐస్ ముక్కలు

నోటి పూతలు వచ్చిన చోట ఐస్ ముక్కలను ఉంచాలి. ఐస్ పెట్టిన కొంచెం తిమ్మిరిగా ఉంటుంది. కొంత సేపటికి నొప్పి మరియు మంటను తగ్గిస్తుంది. కొంచెం ఉపశమనం లభిస్తుంది. కొన్ని ఐస్ క్యూబ్స్‌ను ఒక టవల్‌లో పెట్టుకొని పూతల వచ్చిన పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. కొంచం తగ్గుతుంది.


3. తేనె

నోటి పూతలు వచ్చిన చోట తేనె కూడా పనిచేస్తుంది. తేనెలో నొప్పిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. నోటి పూత వచ్చిన కొంచెం తేనెను పూయాలి. కొంత సేపటికి నొప్పి తగ్గుతుంది. ఇలా రోజుకి నాలుగు నుంచి ఐదు సార్లు పూయడం వల్ల నొప్పి తగ్గుతుంది.

Leave a Reply