సావర్కర్ గారి జయంతి

Reading Time: 2 minutes

సావర్కర్ గారి జయంతి సందర్భంగా వారి గురుంచి క్లుప్తంగా

◆ భారతదేశ స్వాతంత్ర సాధన కోసం పోరాడిన విప్లవ వీరుల వరుసలో ఆగ్రగణ్యుడాయన. తన కార్యాలయ ద్వారానే కాక, తన కావ్యాల ద్వారా కూడా ఆంగ్లేయ పాలకులను బెంబేలెత్తించిన కవి వీరుడాయన.
◆ స్వాతంత్ర్య వీరసావర్కర్ జీవనం ప్రతి యువకుని హృదయాన్ని ఉర్రూతలూగిస్తుంది. రెండు జీవిత ఖైదు శిక్షలు , జైలులో అంతులేని యాతనలు ఆయనలోని భావోద్వేగాన్ని ఏ మాత్రం నాశనం చేయలేకపోయాయి. అగ్నిగుండాలవంటి తన రచనాస్త్రాలను ఆంగ్లేయులపైకి సంధించడాయన.

◆ స్వయంగా జీవితమంతా స్వాతంత్ర్య సాధన కోసం సమిథనుగావించడమే కాదు. తన లాంటి వందలాది యువకులను తన జీవిత కాలంలోనే తయారుచేసిన ఆదర్శ స్వాతంత్రవీరుడు సావర్కర్ స్ఫూర్తిదాయకమైన ఆయన జీవితాన్ని స్మరించుకుందాం.

◆ 1883లో మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో సావర్కర్ జన్మించాడు.సావర్కర్ కేవలం కవిత్వం వ్రాసి, బుద్ధిగా కూర్చోలేదు.స్వతంత్రులందరూ కలసి పాడుకోవడానికి అవసరమైన దేశభక్తి గీతాలు సావర్కర్ వ్రాసేవాడు. అలాగే శివాజీ, తానాజీ వంటి మహావీరుల జీవిత చరిత్రలను చాలా స్ఫూర్తిదాయకమైన రీతిలో వినిపించేవాడు. ఈ విధంగా యువకులలోను, బాలుర లోను దేశభక్తి కలిగించాడు.

◆ 1906లో ఇంగ్లాండ్ వెళ్లారు. భారతీయులలో స్వాతంత్ర్య భావనను రగిలించడం కోసమని సావర్కర్ 1857లో జరిగిన స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రను పూర్తి వివరాలతో వ్రాశారు. ఆ పుస్తకానికి 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని పేరు పెట్టారు.

◆ సావర్కర్ అన్నగారికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడిందని తెలుసుకున్నాడు. వదినగారిని ఓదార్చేoదుకు తన తీవ్రమైన దుఃఖాన్ని కవిత్వంగా మలచి వదిన గారికి ఉత్తరం ఈ విధంగా వ్రాశారు.

◆ “అనేక రకాలైన పువ్వులు పూస్తూనే ఉంటాయి. ఎప్పుడో ఎక్కడో రాలిపోయి ఎండిపోతాయి. అటువంటి వాటి లెక్క గానీ, ప్రాముఖ్యత గానీ ఎవరికి కావాలి ? కాని ఏనుగు తన తొండంతో కమలాన్ని త్రెంపి తన తల మీద మోసుక వెళ్లి, శ్రీవారి పాదాలసన్నిధిలో వుంచుతుంది. అలా సమర్పించబడిన కమలం జీవితమే ధన్యమైనది. పావనమైనది, సార్థకమైంది. మన కుటుంబంలోని వారందరం ఈ రకమైన సార్థక పావన,ధన్యజీవితాలను పొందే ప్రయత్నంలో ఉన్నాం. ఇది ఎంతో గర్వించదగిన విషయం “.

◆ భారతదేశంలో ఆయనపై రెండు నేరారోపణలు చేశారు.
◆ ఒకటి విప్లవం ద్వారా ఆయన భారతదేశంలోని బ్రిటిష్ రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసే ప్రయత్నం చేస్తున్నాడని,
◆ రెండవది బ్రిటిష్ అధికారులను హతమార్చడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడని ఈ రెండు నేరాలకు వేరువేరుగా రెండు ఆజన్మ కారాగార శిక్షలు విధించారు.

◆ అండమాన్ వాతావరణం ,జైలులో నికృష్టమైన ఆహారం కారణంగా సావర్కర్ ఆరోగ్యం బాగా దెబ్బతింది. 1922లో సావర్కర్ ని విడుదల చేశారు.

◆ సావర్కర్ కు 1901లో వివాహం జరిగినా 24 25 సంవత్సరాలపాటు మొదట లండన్ లో , తరువాత అండమాన్ లో వారు ఒంటరిగా జీవితం గడిపారు. ఇప్పుడే వారికి పునర్జన్మ కలిగింది. గృహస్తులు గా జీవితం ప్రారంభించారు.

◆ భారత్ నుంచి వేరు కావాలనే పాకిస్తాన్ కోరికను ఆయన తీవ్రంగా ఖండించారు.

◆ తన జీవితపు చివరి రోజులలో ఆహారాన్ని త్యజించి తన 86వ ఎట 1966 ఫిబ్రవరి 26న తను ఇహలోక లీలలనుండి జీవన ముక్తిని పొందారు.

Leave a Reply