మోసం

Cheating
Reading Time: < 1 minute


నిజ జీవితంలో కొంత మంది మోసం చేస్తుంటారు. మీరు మోసం చేసారని మొహం మీదనే మనము వాళ్ళకి చెప్పలేము. కానీ వాళ్ళు ఇంకా మోసం చేస్తూనే ఉంటారు. ఇలాంటివి ఎక్కువుగా స్నేహ బంధాలలో జరుగుతాయి.
స్నేహ బంధం లో ఒకరిని ఇంకొకరు తేలికగా మోసం చేస్తారు . అలాంటప్పుడు మనము ఏమి చేయాలంటే వాళ్ళు చేసిన తప్పు మనము కూడా వాళ్ళ నిజ జీవితంలో ఒక సారి చేసి చూపిస్తేనే తెలుస్తుంది. కానీ మోసపోయిన వాళ్ళు మాత్రం జీవితంతాము బాధ పడుతూనే ఉంటారు . వాళ్ళకి బాధ ఒక్కటే మిగులుతుంది.కోపం కూడా తెచ్చుకోకండి. ఈ కోపానికి ఆవేశం తప్ప ఏమీ తెలీదు !!దీని వల్ల మనకి ఇష్టమైనవి కూడా మనకితెలియకుండానే దూరం అవుతాయి !!!
ఏదయినా కష్టంగా ఉంది అనుకుంటే
తేలికగా ఉన్నవి కూడా కష్టంగా ఐపోతాయి !!
అలా అనడం మానేసి , కష్టంగా ఉన్నవి ,తేలికే అని అనడం నేర్చుకోండి !!


మోసం చేసే వాళ్ళకి , మోసపోయిన వాళ్లకి నేను ఒక్కటే చెప్తున్నా. మీరు ఈ రోజు మోసం చేయవచ్చు. కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు మీ జీవితంలోకి వస్తారని మాత్రం మర్చిపోకండి. ఇంక మోసపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కొంత మందిని నమ్మవాల్సిన దానికంటే బాగా నమ్ముతారు. వాళ్ళు ఏమో మోసం చేసి వెళ్ళిపోతారు . మోసం చేయడం ఒక తప్పు ఐతే నమ్మిన వాళ్ళని ముంచడం ఒక తప్పు. కాబట్టి మీరు జీవితంలో ఎవరిని మోసం చేయకండి. ఇంకొకరి చేతిలో మోస పోకండి .


స్నేహితులను మోసం చేయకండి.వాళ్ళ చేతిలో మీరు మోసపోకండి.

Leave a Reply