శనీశ్వరుడి జయంతి

Reading Time: 2 minutes

శనీశ్వరుడి  జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు.  ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది.

శనీశ్వరుడి జయంతి
దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు.  హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం.

ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.
*చేయాల్సిన పూజలు*
శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం, నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి.
అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి.
దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి.
తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి.
ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.

అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి.
శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు.

నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు, ఆవ నూనే లాంటివి దానం చేయాలి.


శని దేవుడి ప్రాముఖ్యత
సూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు.  వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.

శని శాంతి మంత్ర స్తుతి
ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ”క్రోడం నీలాంజన ప్రఖ్యం..” అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే

ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.
ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.  

Leave a Reply