చికెన్ కబాబ్

Reading Time: 2 minutes

చికెన్ కబాబ్


చికెన్ కబాబ్ ని చాలా మంది ఇష్ట పడతారు. ఇప్పటివరకు బయట తినడమే చూసాము. ఇప్పుడు మన ఇంట్లో తయారు చేసుకొని ,ఒకసారి అది కూడా రుచి చూద్దాము. మరి నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. చికెన్ తో చాలా చాలా వెరైటీ లు చేసే ఉంటాము. ఇప్పుడు కొత్తగా ట్రై చేద్దాము. అలాగే నేర్చునుకుందాము. చికెన్ కబాబ్ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా ?? అంతలా ఆలోచింకండి. తేలికగానే చేసేద్దాము.మరి ఇంకెదుకు ఆలస్యం దీనికి కావలిసిన పదార్థాలు , తయారు చేసే విధానము తెలుసుకుందాము.



కావలిసిన పదార్థాలు :-


చికెన్ లెగ్స్ – 4,
వెనిగర్ – 2 టీ స్పూన్లు ,
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు,
కారం – 1 టేబుల్ స్పూన్,
పచ్చిమిర్చి – 7,
పెరుగు – 250 గ్రా,
ఉప్పు – సరిపడినంత వేసుకుంటే చాలు,
నూనె – 250 గ్రా,
కొత్తిమీర – ఒక కట్ట,
పుదీనా – ఒక కట్ట,
గరం మసాలా – 1 టీ స్పూన్,
ఉల్లిపాయలు – 1,
నిమ్మకాయ – 1,
పసుపు – చిటికెడు తీసుకుంటే సరిపోతుంది.


తయారీ విధానం :-


ముందుగా మనము ఒక గిన్నె తీసుకోవాలి. దానిలో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్ని కలిపి , తరువాత వాటిని మిక్సీ లో వేసి పట్టుకోవాలి.అది మెత్తగా అయ్యే వరకు పట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్ లెగ్స్ తీసుకొని చాకుతో లైట్ గా గాట్లు పెట్టి వాటికి అల్లంవెల్లుల్లి పేస్ట్ , ఉప్పు, వెనిగర్, పసుపు వేసి, దానిలో కొద్దిగా నీళ్లు పోసి చికెన్ లెగ్స్ కి బాగా పట్టించి పది నిముషాల పాటు నాన పెట్టుకోవాలి. పెరుగు బాగా చిలికి దానిలో ఉప్పు, గరం మసాలా పొడి, కొంచం నూనె వేసి చికెన్ లెగ్స్ ని దానిలో వేసి ఐదు గంటలపాటు ఉరనివ్వాలి.

తరువాత చికెన్ ముక్కల్ని తీసుకొని ఎర్రటి బొగ్గుల మీద పెట్టి కాల్చాలి. తరువాత వాటిని ఒక ప్లేటు లో తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో నంజు కొని తింటే చాలా బావుంటుంది. వేడి వేడి చికెన్ కబాబ్ లు చాలా రుచిగా ఉంటాయి.



Leave a Reply