కొబ్బరి చెట్టు ఆవేదన

Reading Time: 2 minutes


ఒక పల్లెటూరులో ఒక కొబ్బరి చెట్టు ఉండేది. అది ఒక సంవత్సరం కొబ్బరి కాయలు కాస్తే ఇంకో సంవత్సరం కాసేది కాదు. ఆ చెట్టు ఊరి అందరిది.ఆ ఊరు మధ్యలో ఉంటుంది. వేసవి కాలంలో కొబ్బరి కాయలను కోసుకెళ్లాడానికి అందరూ చెట్టు దగ్గరికి వస్తారు. ఐతే చెట్టుకి కాయలు ఉండవు. ఇది ఏంటి పోయిన సంవత్సరం కూడా కాయలు రాలేదు ? ఇప్పుడు కూడా రాలేదు ఎందుకు ? అని చెట్టు దగ్గర కూర్చొని అందరూ ఆలోచిస్తా ఉంటారు. ఇంకా ఈ చెట్టు వల్ల మనకి ఉపయోగం లేదు కాని నరికేదిద్దాము అని అనుకుంటారు . ఆ తరువాత చెట్టుకు కూడా ఒక సారి చెప్పి ఇంక నరికేద్దాము, ఇంకా ఉంచకూడదు అని ఊరు మొత్తం అనుకుంటారు . అప్పుడు చిన్న పిల్లలు అందరూ చెట్టు దగ్గరికి వచ్చి చెట్టును నరక వద్దు .ఈ చెట్టు అంటే మాకు చాలా ఇష్టం అని అందరూ గట్టిగా అరిచి చెప్తారు.ఐన కూడా వినరు.చెట్టును ఈ విధంగా అడుగుతారు.నువ్వు ఏంటి ఈ సంవత్సరం కూడా మాకు కాయలు అందివ్వలేదు, నిన్ను ఇంక బ్రతకనివ్వము.నిన్ను నరికేస్తాము అని చెట్టుతో ఊరు అందరూ చెప్తారు. అప్పుడు చెట్టు వాళ్ళకి ఇలా జవాబు చెప్తుంది…ఎవరు చెప్పారు నా చెట్టుకి కాయలు లేవు అని , బాగానే ఉన్నాయి .మీకు కనిపించటలేదు.మీలో ఉన్న స్వార్ధ బుద్ది వల్ల నా కొబ్బరి కాయలు మీకు కనిపించటలేదు . మీ పిల్లలను పిలిచి వాళ్ళని అడగండి నా కొబ్బరి కాయలు, కనిపిస్తున్నాయా ? లేదా అని ? నన్ను నరికేయడానికి వచ్చారా ?? నేను ఇచ్చినవి అప్పుడే మర్చిపోయారా ? ఒక్క రోజు కొబ్బరి కాయలు కనిపించకపోతే నరికేద్దాం అనుకున్నారు.

ఇన్ని సంవత్సరాలు నా చెట్టుకి వచ్చిన వస్తువులు వాడుకున్నారుగా .దానికి నేనూ ఎప్పుడు తీసుకెళ్లకండి అని అనలేదు నేను. ఇప్పుడు కూడా మీరు మీ ఇంట్లో వాడే వస్తువులు నావే .ఆ విషయం కూడా మర్చిపోయారా ? మీకు అలసటగా ఉంటే కొబ్బరి బొండాలుగా మారాలి నేను, మీకు కూరల్లో వేసుకోవడానికి కొబ్బరిని అవ్వాలి, మీకు తలకి రోజు రాసుకోవడానికి కొబ్బరి నూనె ని అవ్వాలి, చివరికి దేవుడు గుడికి వెళ్ళేటప్పుడు కూడా నన్ను వెంట పెట్టుకొని మరి తీసుకెళ్తారు , ఆ సమయంలో నేను కొబ్బరి కాయను అవ్వాలి అని, పైన చెప్పిన విధంగా బాధ పడుతూ చెప్తాది అందరికి.

అప్పుడు చెట్టు ఇంక ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఊరు అందరికి తన నిర్ణయాన్ని చెప్తాది. ఇంక నుంచి నా కొబ్బరి కాయలు పెద్ద వాళ్ళకి, కనిపించవు, చిన్న పిల్లలకు మాత్రమే కనిపిస్తాయి. వాళ్ళు మాత్రమే నా కొబ్బరి కాయలను కోసుకోవడానికి అర్హులు. పిల్లలకు ఉన్న విశ్వాసం కూడా మీకు లేకుండా పోయినది. పెద్ద వాళ్ళు అందరూ తప్పు చేశారు కదా శిక్ష కూడా అనుభవించాలి అని అందరికి చెప్తుంది. తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్ష అనుభవించాలిసిందే !!

Leave a Reply