సమయం, సందర్భం !!

Reading Time: 2 minutes

మనము ఏమైనా తెలియకుండా మాట్లాడినప్పుడు మన ఇంట్లో ఉండే పెద్ద వారు సమయం, సంధర్భం ఉండొద్దా ?? అని అంటుంటారు. అస్సలు వాళ్ళు అలా ఎందుకు అంటారా తెలుసా ? తెలుసుకోవాలిసిన అవసరం ఉంది. కాబట్టి తెలుసుకుందాము. మనము తప్పులు మాట్లాడితే వాటిని సరిచేయడానికి మన పెద్ద ఎప్పుడు మన వెంటే ఉంటారు . తప్పు ఐతే తప్పు అని, ఒప్పు ఐతే ఒప్పు అని చెప్తారు. పెద్ద వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నప్పుడు పిల్లలు తెలియకుండా వెళ్ళి మాట్లాడతారు. అప్పుడు కూడా వాళ్ళు ఈ రెండు పదాలను వాడతారు. మనము కూడా సమయాన్ని బట్టి మాటలు మాట్లాడటం నేర్చుకోవాలి. పిల్లలు ఎదిగే కొద్ది అన్ని నేర్చుకుంటా ఉండాలి. పెద్ద వాళ్ళు , మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు మంచి పనులు ఎలా చేయాలో చెప్పండి. చెడ్డ పనులకు, మంచి పనులకు తేడా కూడా చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఒక ఎత్తు. పెద్ద ఐన తర్వాత నేర్చుకున్నది ఒక ఎత్తు.సమయం అంటే మన మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు వినాలి, మనము చెప్పింది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ తరువాత ఎదుటి వాళ్ళు సమయంతో పాటు సందర్భం చూసుకొని మాట్లాడతారు. ఇలా పెద్ద వాళ్ళు చేయగలరు. కానీ పిల్లలు చేయలేరు. పిల్లలను భయ పెట్టకుండా వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పండి. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు బొమ్మలు కొనివ్వాలి అంటూ కొనిచ్చే వరకు ఏడుస్తూనే ఉంటారు. అప్పుడు పెద్ద వాళ్ళు వాళ్ళని కొట్టి బొమ్మలు లేవు, ఏమి లేవు అని పిల్లలకి చెప్తారు. దీని వల్ల వాళ్ళకి భయం పెరుగుతుంది. రెండో సారి బయటికి వచ్చినప్పుడు బొమ్మలు అడగరు. పిల్లలకి భయం కలిగించేలా చెయ్యాలి కానీ వాళ్ళని భయం పడేలా కాదు. మీరు ఏమి చేసినా ప్రేమగా చెప్పండి వాళ్ళకి. నిజానికి చెప్పాలంటే ఈ విషయంలో పెద్దలకు సమయం సందర్భం లేదు. అవి ఏమి ఆలోచించకుండా పిల్లలను కొట్టారు.పైన చెప్పిన విధంగా మన జీవితంలో సమయం, సందర్భం కూడా ముఖ్య పాత్ర ఏ పోషిస్తాయి.
పిల్లలకి అర్థం అయ్యేలా చెప్పండి. పిల్లల విషయం లో పెద్ద వాళ్ళు కూడా తొందరపడకండి .

Leave a Reply