నిజమైన ” ప్రేమ “

Love Symbol
Reading Time: 2 minutes

” ప్రేమ ” అంటే ఒక అందమైన ప్రపంచం. ప్రేమలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నిజమైన ప్రేమ.ఇది ఎవరికి అంత తేలికగా దొరకదు. వంద మందిలో ఒక్కరికి దొరుకుతుంది. రెండవది స్వార్ధం కూడిన ప్రేమ. ప్రస్తుత సమాజంలో నడుస్తున్న చాలా ప్రేమలు స్వార్ధంతో కూడిన ప్రేమలే . ఎందుకంటే అలా ఐపోయింది సమాజంలో. ఈ ప్రేమ చూడటానికి మాత్రమే బావుంటుంది. దగ్గరికి వెళితే చూస్తే అన్ని ముల్లే ఉంటాయి. ప్రేమకి బానిస ఐతే జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది .


” ప్రేమ ” ప్రేమించిన వాళ్ళకి దొరకదు. ఉన్న వాళ్ళకి దాని విలువ తెలియదు. ఇది ప్రేమ వరస. ప్రేమ అనేది వస్తువు ఐతే తీసి ఇచ్చేస్తారు.కానీ ఆఫీ వస్తువు కాదుగా. పూర్వ కాలంలో ఈ ప్రేమ వల్ల రాజ్యాలు కూడా పోయాయి అని మనము వింటూంటాము. ప్రేమ కి ఎంత శక్తి ఉంటే రాజ్యాలు కూడా పోతాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. స్వార్థంతో ఏ మనిషితో కూడా మాట్లాడకండి. మీకు ఇష్టం లేకపోతే మీరు దూరంగా ఉండండి. కానీ ఒక మనిషి తో ఆడుకునే హక్కు మీకు లేదు. స్వార్ధం తో ఏమి సాదించలేరు. మంచి మనసు, ప్రేమతోనే అన్ని సాదించగలుగుతాము.


నిజమైన ప్రేమ దగ్గరికి వస్తే, ఇది పొందాలంటే రాసి పెట్టి ఉండాలి. ఇది ఎవరికి అంత తేలికగా దొరకదు. దొరికింది అంటే అది బలపడడానికి చాలా సమయం పడుతుంది.ఒక విధంగా చెప్పాలంటే ఇది దొరికిన వారు జీవితంలో సగం గెలిచినట్లే. మనము వేరే వాళ్ళని బాధ పెట్టె ముందు మన మనస్సు మనకి ఒక సారి గుర్తు చేస్తాది. ఐన మనిషి వినడు. వేరే వాళ్ళ బాధ పెడితే మీకు ఏమి వస్తాదో కూడా తెలియదు. మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మీరు వచ్చినప్పుడు మీ గురించి నలుగురు మంచి చెప్పుకొనేలా ఉండాలి కానీ , మీరు వెళ్లిపోయిన తరువాత మీ గురించి నలుగురు చెప్పుకొని నవ్వుకొనేలా ఉండకూడదు. మీరు ఎలా ఉన్నారో మీకు మీరే గుర్తు చేసుకోండి. బ్రతికి ఉన్నప్పుడే మనము మంచి మనసుతో మరియు నిజమైన ప్రేమతో నలుగురు మనుషులను సంపాదించుకోవాలి. ఉన్నంత కాలంలో నువ్వు అది కూడా చేయలేకపోతే మీ జీవితానికి అర్థం ఉంటుంది.



ఒకటి గుర్తు పెట్టుకోండి. బంధము ఏదైనా సరే మీరు మాత్రం మీలానే ఉండండి . ఎందుకంటే మీరు ఈ రోజూ నటించిన రేపన్న రోజూ ఐన తెలిసిపోతుందిగా. అందుకే ఎదుటి వాళ్ళని కూడా మనుషులుగా చూడండి. మీకు అలవాటు లేకపోయినా అలవాటుచేసుకోవాలిసిందే. అప్పుడే మీకు సమాజంలో గౌరవం దక్కుతుంది.కాబట్టి నటించడం మానేయండి, ప్రేమను పంచండి.మిమ్మల్ని ఇష్ట పడే వాళ్ళకి మీ ప్రేమను పంచండి. వాళ్ళని మోసం చేయకండి.




Leave a Reply