కరోనాకి తీసుకోవాలిసిన జాగ్రత్తలు తెలుసుకోండి

Corona Precautions
Reading Time: 2 minutes

ప్రస్తుత ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రపంచాన్ని గడ గడ లాడిస్తుంది. కరోనా పుట్టినిల్లు చైనా. చైనా వాళ్ళు ముందు గానే జాగ్రత్త పడితే మన దగ్గర వరకు వచ్చేది కాదు. లాక్ డౌన్ లో ఉండిపోయారు. కరోనా ఎప్పుడు పోతాదో కూడా తెలియటలేదు. అలాగే దీనికి వ్యాక్సిన్ కూడా ఇంకా రాలేదు, కనిపెట్టలేదు కూడా. ఎవరి ఆరోగ్యం వాళ్లే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ కరోనాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది . చిన్న పిల్లలు దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కరోనా ఒకటే. ఈ వైరస్ వచ్చాక చాలా మారిపోయాయి. అంతక ముందు పరిస్థితులు కంటే ఇప్పుడు చాలా వేరుగా ఉన్నాయి. కరోనాకి తీసుకోవాలిసిన జాగ్రత్తలు .కింద ఇచ్చిన వాటిని పాటించండి.

కరోనాకి తీసుకోవాలిసిన జాగ్రత్తలు :-

* ప్రతి గంటకి మీ చేతులను శానిటైజ్ చేసుకోవాలి.అలాగే భోజానికి ముందు కూడా ఒకటికి ఐదు సార్లు మీ చేతులను శుభ్రపరచుకోవాలి.

* బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టువడం మర్చిపోకండి. మీ దగ్గర మాస్క్ లేకపోతే ఇంట్లో ఉంటే పలచటి క్లాత్ తీసుకొని మీ కళ్ళ కింద భాగము నుంచి మొహానికి కట్టుకోండి.

* మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు పక్కన మనిషికి మీకు రెండు మీటర్ల దూరం లో ఉన్నట్లు చూసుకోండి.

* మీ కన్నా పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కనిపించినప్పుడు షేక్ హ్యాండ్ లు ఇవ్వడం మానేయండి. నమస్కారం పెట్టడం అలవాటు చేసుకోండి. పొరపాటున కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకండి.

* మీరు ఇంట్లో వండుకునే కూరగాయలు కూడా ఒకటికి మూడు సార్లు శుభ్రపరచుకొని వంట చేసుకోవాలి.

* బయట నుంచి మీరు ఏమైనా వస్తువులు తెచ్చుకున్న వాటిని ముందే చేతితో పట్టుకోకండి. వాటిని కూడా బాగా శుభ్రం చేసి వాడుకోవాలి.

* ఈ కరోనా మనము వాడుకునే వస్తువులు మీద ఉంటుంది .ముఖ్యంగా ప్లాటిక్ బాటిల్స్ మీద, స్టీల్ పాత్ర లు పై కూడా ఉంటుంది. మీరు బాగా శుభ్రపరచుకొని వాడుకోండి.

Leave a Reply