ఉన్నది ఒకటే జీవితం

Reading Time: 2 minutes

మనిషికి ఉన్నది ఒకటే ” జీవితం “. ఈ జీవితంలో మనము చాలా బాధలను, కష్టాలను, నష్టాలను అన్నింటిని చూస్తుంటాము.బాధలు మనకి చెప్పి రావు . కష్టాలు మనల్ని బాధ పెట్టడానికి రావు. నష్టాలు మనము అనుభవించాలని రావు. వచ్చినప్పుడు సహించాలి తప్పదు. ఈ రోజు బాధ పడవచ్చు ఏమో .రేపు మాత్రం నువ్వు ఆనందపడే రోజులు తప్పకుండా వస్తాయి.

మనల్ని చూసి నవ్వే వాళ్ళు రేపన్న రోజు శభాష్ అని అభినందిస్తారు. మీరు మాత్రం మాకు కష్టాలు వచ్చాయి అని ఎప్పుడు కూడా బాధ పడకండి. ఉన్నది ఒకటే జీవితం నవ్వుతూ , నవ్విస్తూ బ్రతకాలి. నువ్వు ఎదగాలంటే అంతకింత రెట్టింపు కష్టపడితేనే ఎదుగుతారు. జీవితంలో ఏది కూడా మనిషికి సులువుగా దొరకదు. అలా దొరికింది అంటే అది నీతో ఎక్కువ కాలం ఉండదు అని .

జీవితం అన్నాక నష్టాలు రాకుండా ఉండవు కదా. వాటిని కూడా ఒకసారి పాలకరిద్దాము.నష్టాల గురించి మాట్లాడుకుందాము. వ్యాపారాల్లో నష్టాలు రావడం సహజమే. పెద్ద పెద్ద వ్యాపారాలకు నష్టాలు రావటం వాళ్ళకి కొత్త ఏమి కాదు. లాభాలు ఎంత వస్తాయో నష్టాలు కూడా అంతే వస్తాయి.

Only One Life

మనము చేసే వ్యాపారం ఎక్కువ లాభాలు వచ్చేలా చూసుకోవాలి. ఎవరైనా పొట్టకూటికె ఏ వ్యాపారం చేసినా. జీతానికి పని చేసే కన్నా వాళ్లే సొంతంగా వ్యాపారం పెట్టుకోవడం మంచిది అనుకుంటున్నారు. 

నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. ఎవరి సహాయం లేకుండా. పుట్టిన పిల్లలు పుట్టగానే అన్ని పనులు చేయలేరు కదా. ఇది కూడా అంతే. ప్రతి ఒక్కటి మనము నేర్చుకొని చేయాలి. ఏ పని కూడా నాకు రాదు . నేను చేయలేను.

Only One Life

నా వల్ల కాదు అనే మాట రాకూడదు. ఏ పని నైన నేర్చుకొని మర్చిపోవాలి. ఈ ఒక్క జీవితంలో మనము చాలా చూస్తుంటాము. మన కుటుంభం, మన స్నేహితులు, మన బంధువులు.. ఇలా ఎందరినో చూస్తుంటాము. 

అందరిని మనము గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి. నీ జీవితాన్ని నీ చేతుల్లోనే ఉంచుకోవాలి. వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వకు. ఉన్నది ఒక్కటే జీవితం అది మాత్రం మర్చిపోకు.

Leave a Reply