నవ్వుతావ్ ఎందుకే! కరోనా?

Reading Time: 2 minutes
Light Moments at Corona Times
Corona Times

క్రిమి, కీటకాలను, విష జంతువులను, సకల జీవరాశులను భుజించే నరరూప రాక్షసులను సంహరించాలని
చైనాలో పుట్టావని కొందరు,
నిన్ను పుట్టించారు అని కొందరు అంటున్నారు!
నిజం నీకే తెలియాలి!

మరి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది మానవాళిని అందరి నీ కబళిస్తున్నా వ్! ఎందుకే అంటే!

అది నా తప్పు కాదంటావ్!
నేను కబళించిన వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆహ్వానించిన
వారందరితో స్నేహం చేశాను. అంటావ్! అది ఆ దేశం వాడి తప్పే అని అంటావ్!

విభిన్న మతాలతో ,భిన్నత్వం లో ఏకత్వంతో, నిత్యం ఆధ్యాత్మక చింతనతో
జీవిస్తున్న మా భారతావనిలో
ఎందుకు అడుగు పెట్టావు అంటే!?

పవిత్రమైన మీ భారతీయ సంస్కృతిని మరచి, షేక్ హ్యాండ్ సంస్కృతితో నన్ను ఆహ్వానిస్తే రావద్దంటావా!
అని అంటావ్!

అది నా తప్పు కాదు అంటావ్!
నన్ను చంపడానికి మందు లేదు అని తెలిసి!

తరిమికొట్టడానికి మార్గం ఉందని తెలియజేస్తూ,
ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారిని వెంటనే వైద్య చికిత్స చేసుకోమని,

నాతో స్నేహం చేసిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆహ్వానించ వద్దని!

చేతులెత్తి నమస్కరించడం భారతీయ సంస్కృతని, అది అందరూ పాటించాలని,

మూడు వారాల పాటు లాక్ డౌన్లోడ్ పాటించమని,
నన్ను తరిమికొట్టడానికి మార్గం తెలియజేస్తూ చేతులు జోడించి మీ భారత ప్రధాని మోడీ గారు మిమ్ము ప్రాధేయ పడుతూ ఉంటే వింటున్నారా!!!!!??

భారతదేశంలో పుట్టి
బ్రతుకు తెరువుకు
ఇతర దేశాలలో ఉండి
నాతో స్నేహం చేసిన
వారికి స్నేహితు డై నన్ను
షేక్ హ్యాండ్ ఇచ్చి
మీ దేశానికి ఆహ్వానించిన
మీ భారతీయుడే మీకు శత్రువు! అది తెలియకపోతే ఎలా!

మీ మోడీ గారి మాటలు లెక్క పెట్టక, నాతో స్నేహం చేసిన వాడు , వాడి ఇంటికి ,ఊరు వాడ అందరికీ నన్ను పరిచయం చేస్తుంటే!
కాదంటానా!

ఇలాంటి అమాయకుల/మీ దృష్టిలో దుర్మార్గులను చూసి నవ్వక ఏం చేయమంటావ్!!?

ఇప్పుడు చెప్పు! ఆ తప్పు నాది అంటావా ! మీ భారతీయ పౌరుడిది అంటావా!
దీనికి సమాధానం చెప్పండి అని అంటావ్!

అయినా!
నేనూ ఈ ప్రపంచం లోని సకల జీవరాసులలో కంటికి కనపడని ఒకసూక్ష్మజీవిని.కానీ నా నుండి వెలువడే కోట్ల జీవరాశులతో ఈ ప్రపంచాన్నేజయించగలను.

అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్తమమైనదనీ
మీరు అనుకుంటున్నారు!

మీలా నాకు కుల, మత బేధాలు లేవు!ధనిక, పేద,తేడాలు లేవు .
మోసం ,ద్వేషం లేదు! స్వార్థపూరిత భావాలు లేవు! వర్ణ విచక్షణ అంతకన్నా లేదు!

ఈ భూమిపై ఎవరు శాశ్వతం కాదని తెలిసి కూడా, మాన వతా విలువలను మరిచి గీతలు గీసుకుని ,హద్దులు ఏర్పాటు చుకుని, స్నేహ భావాలు తెంచుకుని, ఒకరిపై ఒకరు ద్వేషాలను పెంచుకుని,
బాంబులను , అణు బాంబు లను , మారణాయుధాలను
మీ మేధస్సుతో,పెంచుకుని, నాది అగ్రరాజ్యం అన్న పేరు కోసం మారణ హోమంతో మానవతా విలువలను మరిచి మానవాళి అంతానికి, ప్రపంచ విపత్తుకు కారకుల వుతున్నది ఎవరు!!!???

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనీ మీరే అంటారు కదా!
మీకు ఆ శివుడు పైన, కులం మతం ఏదైనా మీరు నమ్మకున్న మీ దేవుడి పైన ,నిజంగా నమ్మకం ఉంటే, మీరు ఉన్న చోట ఇంటినుండే , స్వార్థం లేక లోక క్షేమం కోరి , నిస్వార్థ బుద్ధితో మీ దేవుళ్లను ప్రార్ధించు కోండి! అతను
నా బారినుండి మిమ్మలను తప్పించగలడు. దేవుడు సర్వాంతర్యామి అని అంటారు కదా!

ఇప్పుడు నాకు భయపడి మీరు తాళాలు వేసి గుడి లో ఉంచిన దేవుడు కూడా మీ ఇంటికే రాగలడు! మిమ్మల్ని కాపాడగలడు! మీ నిజమైన దైవభక్తిని, భారతదేశ సంస్కృతిని చాటుకోండి!

గాలిలో దీపం పెట్టి దేవుణ్ణి ప్రార్థించ కండి!మీ ప్రయత్నం మీరు చేయండి!

మీ హద్దుల్లో మీరు వుంటే
నా దారిన నేను పోతాను!

పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు కదా! నాకు అంతే!

దేవుడు మానవ రూపంలో
ఉదయిస్తాడు! ఉదయించి ఉన్నాడు ! నా మరణానికి మందు కనిపెడతాడు!

నాకు మరణం అంటే భయం లేదు! హాయిగా నవ్వుతూ మీకు దూరమై వెళ్ళిపోతాను.
అంతవరకు మీ మోడీ గారు విధించిన లాక్ డౌన్ పాటించండి!

చరిత్ర పుటల్లో నన్ను,
నా కథను వివరించండి!

మానవతా విలువలతో మెలగండి! నాలాంటి కరోనాలు మిమ్మల్ని ఏమి చేయలేవు!

ఇది కరోనా మహమ్మారి అనబడే నా సందేశం!
సర్వే జన సుఖినోభవంతు!
ఓం శాంతి! శాంతి! శాంతి!

Leave a Reply