admin@chandamama.in

మనుస్మృతి నందలి మానవ నియమాలు

Manusmruthi

మనుస్మృతి నందలి మానవ నియమాలు

 • మన శక్త్యానుసారముగా ఇల్లు , వాకిలి , వంట మొదలగునవి లేని బ్రహ్మచారులకు , సన్యాసులకు గృహస్థులు ఆహారాదులు ఇవ్వవలెను. మరియు ఆవు , కుక్క మొదలగు ప్రాణకోటికి కూడా ఆహారాదులు ఇవ్వవలెను.
 • ఉదయించు సూర్యునిని , అస్తమించు సుర్యునిని , గ్రహణ సమయములో సుర్యునిని , నీటిలో సూర్యబింబమును , ఆకాశమున మధ్యాహ్న సమయము నందు సూర్యుడిని సరాసరి చూడరాదు.
 • దూడని కట్టిన తాడును దాటరాదు. వర్షము కురియునప్పుడు పరిగెట్టరాదు. నీటిలో తనరూపమును తాను చూడరాదు.
 • ఒకే వస్త్రముతో భుజించరాదు. శరీరం పైన ఒక్క వస్త్రము కూడా లేకుండా స్నానం చేయరాదు . నడిచేదారిలో మూత్రవిసర్జన చేయరాదు . అదే విధముగా బూడిదలో కాని , స్మశానంలో శవభస్మం పైన కాని గోశాల యందు కాని మూత్రవిసర్జన చేయరాదు .
 • దున్నిన పొలములో గాని , నీటిలోను , యజ్ఞకుండము నందు గాని , పర్వతము నందు గాని , ప్రాచీన దేవాలయముల నందు గాని పుట్టలలో గాని ఎన్నటికి మూత్రవిసర్జన చేయరాదు .
 • జీవులున్న కన్నములలో , నడుచుచూ నిలబడియు , నది ఒడ్డున కూర్చొని , పర్వత శిఖరంపై మూత్రవిసర్జన చేయరాదు .
 • అగ్నిని నోటితో ఊదరాదు. అగ్నియందు అపవిత్రమైన వస్తువులు వేయరాదు . అగ్నితో పాదములను కాచరాదు . మంచము క్రింద అగ్నిని ఉంచరాదు. నిప్పుపైనుండి దాటరాదు , కాలితో నిప్పుని రుద్ది ఆర్పరాదు.
 • నీటిలో మలమూత్రములు , ఉమ్మిని విడువరాదు . అపవిత్ర వస్తువును గాని , రక్తంగాని , విషముతో కూడిన వస్తువులు గాని నీటియందు విడవరాదు.
 • శూన్యగృహము నందు ఒంటరిగా నిద్రించరాదు . నిద్రించువారిని లేపరాదు. రజస్వల స్త్రీతో మాట్లాడరాదు. పిలువబడకుండా యజ్ఞములలో పాల్గొనరాదు.
 • ఎక్కువుగా నూనెతో కూడిన పదార్థములను భుజించరాదు . మిక్కిలి త్వరగా కాని , ఆలస్యముగా కాని భుజించరాదు . ప్రాతఃకాలము నందు అతిగా భుజించిన సాయంకాలము నందు తినరాదు.
 • నిరర్ధకముగా పనిచేయరాదు . దోసిలితో నీరు తాగరాదు. ఒడిలో పెట్టుకుని పదార్థములను తినరాదు. ప్రయోజనము లేని మాటలను వినరాదు.
 • ఎన్నడూ కంచుపాత్రలో కాళ్లు కడగరాదు. పగిలినపాత్రలో భుజించరాదు . కపటమనస్కుల ఇంట భుజించరాదు .
 • చెప్పులు , గుడ్డలు ఇతరులు ధరించినవి ధరింపరాదు. యజ్ఞోపవీతం , నగలు , పూలదండ , కమండలం కూడా ఇతరులవి వాడరాదు.
 • ప్రాతఃకాలపు ఎండ , శవమును కాల్చునప్పుడు వచ్చు పొగ శరీరముకు తగలనివ్వకూడదు. విరిగిన ఆసనములపై కూర్చుండరాదు. శరీరం పైనున్న వెంట్రుకలను గోళ్ళతో పీకరాదు . పళ్లతో గోళ్లు కొరకరాదు.
 • చేతివేళ్ళతో మట్టిపెళ్లలను , ఇటుకలను పగలగొట్టరాదు. గడ్డిపోచలు తుంచరాదు. నిష్ఫలమైన కర్మ చేయరాదు . అట్టిది భవిష్యత్ లో దుఖఃకారణం అగును.
 • మట్టిపెళ్లలు నలుపువాడు , గడ్డిపరకలు పీకువాడు , గోళ్లు కోరుకువాడు శీఘ్రముగా వినాశమును పొందును.
 • పొగరుబోతు వలే మట్లాడరాదు . పూలదండను బయట ధరించరాదు. గోవును ఎక్కి పోరాదు.
 • ద్వారము ద్వారా ప్రవేశించవలెను దొడ్డిదారిన ప్రవేశించరాదు. గ్రామమునకు గాని , గృహమునకు గాని ప్రహారీగోడ ఉండవలెను . రాత్రుల యందు చెట్ల మొదళ్లుకి దూరంగా ఉండవలెను .
 • ఎన్నడూ జూదము ఆడరాదు. చెప్పులు చేతపట్టుకొని నడవరాదు. మంచము మీద కూర్చొని భుజించరాదు . చేతితో ఎక్కువ ఒకేసారి పట్టుకొని కొంచంకొంచం తినరాదు. ఆసనం పైన పళ్ళెము ఉంచుకుని తినరాదు.
 • సూర్యుడస్తమించిన తరువాత నువ్వులతో చేయబడిన వస్తువుని తినరాదు. శరీరం పైన వస్త్రములు లేకుండా నిద్రించరాదు ముఖం కడుగుకొనకుండా ఎచ్చటికి వెళ్ళరాదు.
 • కాళ్లు కడుగుకొని భుజించవలెను . తడికాళ్లతో నిద్రించరాదు . తడికాళ్లతో భుజించువాని ఆయష్షు వృద్ది అగును.

Leave a Reply

Your email address will not be published.

+ 25 = 27

Related Post

ఉపాధ్యాయులను గౌరవంగా చూద్దాంఉపాధ్యాయులను గౌరవంగా చూద్దాం

DEO వచ్చారు ఆయనను చూసిన HM పరుగెత్తి వెళ్ళి ఆహ్వానించారు. ఇది చూసిన ఒకపిల్లవాడు DEO గొప్ప వాడు అనుకున్నాడు. కొంత సేపటికి CEO వచ్చారు. అది చూసిన ఇద్దరు ఎదురు వెళ్ళి ఆహ్వానించారు. ఆపిల్లవాడు CEO నే గొప్పవాడు అనుకున్నాడు.

ఖాళీ కడుపుతో పండ్లు తినడంఖాళీ కడుపుతో పండ్లు తినడం

క్యాన్సర్‌ను నయం చేసే వ్యూహాలలో ఇది ఒకటి. క్యాన్సర్‌ను నయం చేయడంలో నా విజయం రేటు 80%. క్యాన్సర్ రోగులు మరణించకూడదు. ఇది నా ధ్యేయం. క్యాన్సర్ నివారణ ఇప్పటికే కనుగొనబడింది – మనం పండ్లు తినే విధంగా మీరు నమ్ముతున్నారా

శ్రీరామనవమిశ్రీరామనవమి

శ్రీరామనవమి ఏప్రియల్ 2న రాముడి పుట్టినరోజు, సీతా రాముల పెళ్లిరోజు చైత్ర నవమి,శ్రీరామనవమి’ హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే

గృహిణీ నీకు వందనం!గృహిణీ నీకు వందనం!

గృహిణీ నీకు వందనం! బళ్ళు మూతపడ్డాయి! ఆఫీసులు మూతపడ్డాయి! షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి! సభలు సమావేశాలు మూగబోయినాయి! విమానాలు చతికిల పడ్డాయి రైళ్లు పట్టాలెక్కటంలేదు! బస్సులు మొహం చాటేశాయి! దేశాల సరిహద్దులు మూతపడ్డాయి! ప్రపంచ ఆర్థిక పరిస్థితి కుదేలైంది! షేక్ హ్యాండ్

శాంతికి నిలయ దేశం-నా భారత దేశంశాంతికి నిలయ దేశం-నా భారత దేశం

మీరు గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత? 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు … కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు … ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి5000