కథ – అమ్మ ఒడి

Indian Mom Photo by Vlada Karpovich from Pexels: https://www.pexels.com/photo/woman-in-yellow-floral-dress-with-baby-girl-hugging-her-4617294/
Reading Time: 3 minutes

కథ – అమ్మ ఒడి

“సుగుణ ప్రసవించింది.మదర్ అండ్ డాటర్ సేఫ్ అన్న సమాచారాన్ని తీసుకొచ్చిన టెలిగ్రామ్ ని చూసిన తరువాత నా మనసులోని టెన్షన్ పటాపంచలైంది. ఇప్పుడు నేను ఒక చిన్న పాపాయికి తండ్రి నన్ను భావం కలగగానే గుండె లోపలి పొరల్లో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. ఇన్నాళ్లు ఏవేవో భయానకమైన దృశ్యాలను చూసిన నా మనోఫలకం ఇప్పుడు అందమైన దృశ్యాలను చిత్రీకరిస్తోంది.తన చేతులతో నా చేతిని గట్టిగా పట్టుకొని వచ్చిరాని అడుగులతో తడబడుతూ నాతో పాటు నా కూతురు నడుస్తున్న దృశ్యం చాలా అద్భుతంగా ఉంది.

నా గుండెల మీద నిద్రపోయిన పాపాయిని నేను అపురూపంగా చూసుకుంటున్న దృశ్యం ఇంకొకటి.నిన్నటి దాకా రకరకాల ఆలోచనలతో అయోమయంగా గడిపిన నాకు ఇంత ఆనందం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు.సుగుణకి ధైర్యం చెప్పాను కానీ పురుటికి వెళ్లిన తరువాత ఒంటరిగా ఉన్న నాలో అల జడి ప్రారంభమైంది. మనసు ఎప్పుడూ చెడుని ఆలోచిస్తుంది. సుగుణకి ఏమైనా అయితే?అన్న ప్రశ్న ప్రతిరోజూ కొన్ని వందలసార్లు మదిలో ముల్లులా గుచ్చుకునేది.స్త్రీని అంత కష్టపెడుతున్న భగవంతుడిని… సృష్టి మీద కోపం వచ్చేది. తల్లి గర్భంలో హాయిగా నవ మాసాలు ఉండి ఈ భూమి మీదకు వచ్చే శిశువుకు తెలియదు.తన జననం కోసం తల్లి ప్రాణం గిలగలలాడుతుందని.

సుగుణని త్వరగా చూడాలని ఉంది.అవును సాధ్యమైనంత త్వరలో ఆ పని చేయాలి. బిడ్డకు జన్మనిచ్చిన తల్లిమోములోని ఆనందాన్ని చూడాలి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డకు పాలిచ్చిన తరువాత తల్లి బుగ్గల్లో విరిసే పారిజాతాన్ని చూడాలి. మొదటి గర్భం కావటంతో నెలలు నిండుతున్న కొద్ది సుగుణలో భయం తాలూకు నీళ్లు నీడలు స్పష్టంగా కనపడేవి. నాకు అదోలా ఉన్న…సుగుణ భయపడుతుందని ధైర్యం చెప్పేవాడిని. అర్ధరాత్రి నిద్రలేచి భయంతో వెక్కివెక్కి ఏడ్చేది.

Moving Head Smiley Spring Doll https://www.chandamama.com/index.php?route=product/product&product_id=41279

ఏడో నెల వచ్చిన తరువాత సుగుణ ఆయాస పడుతూ మెల్లగా ఇంట్లో తిరుగుతుంటే ఎందుకో విచిత్రంగా అనిపించేది.కాళ్లకు కొంచెం నీరు పట్టి లావుగా కనిపించేవి అప్పుడప్పుడు. రహస్యంగా గమనించేవాడిని.పొట్ట మీద చేతులు వేసుకొని పసికందు కదలికల ద్వారా ఏం చెప్పేదో తెలియదు కానీ ముసి ముసి నవ్వులు నవ్వుకునేది.

ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఈరోజుతో అయిపోతుంది.వచ్చేవారం సెలవు పెట్టి అత్తారింటికి వెళితే బాగుంటుంది.మరదలు శ్యామలకి కుక్కపిల్లలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడో సంవత్సరం క్రితం ఆ అమ్మాయికి కుక్క పిల్లను తెస్తానని ప్రామిస్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు కొలిగ్ కృష్ణమూర్తి ఇంట్లోనే పెంపుడు కుక్క మూడు పిల్లల్ని వారం రోజుల క్రితం ఈనిందని చెప్పాడు. అత్తారింటికి వెళ్తున్నప్పుడు దానిని తీసుకెళ్తే శ్యామల మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషిస్తుంది.అమ్మాయికి ఏం పేరు పెడితే బాగుంటుంది? సుగుణలా అందంగా ఉంటుందా? ఏది ఏమైనా పాపాయిని చాలా క్రమశిక్షణతో పెంచాలి.ఇలా నా మనసులో పదే పదే ఆలోచనలు.

అనుకున్నట్టుగా సెలవు శాంక్షన్ అయింది. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర అవటం చేత ఒక గంట ముందుగా పెట్టెతో సహా కృష్ణమూర్తి ఇంటికి వెళ్లాను.కుక్కపిల్లను తీసుకొస్తుంటే దాని తల్లి అదోలా చూసింది. కానీ పుట్టి కొద్దిరోజులే అయిందేమో చాలా ముద్దొస్తుంది.సీమ జాతిది కాకపోయినా చూడ్డానికి మాత్రం అలాగే ఉంది. తెల్లని బొచ్చుని చూస్తుంటే ఒళ్లంతా దూది అంటించినట్టు ఉంది.ఈ శుభ సందర్భంలో ఇంత మంచి బహుమతి ఇచ్చినందుకు మరదలు శ్యామల ఆశ్చర్యపోవాలి.శ్యామల చాలా చలాకీ అయిన అమ్మాయి.సుగుణకి శ్యామలకి వయసులో 10 సంవత్సరాల తేడా ఉంది.

ఇంటికెళ్లగానే శ్యామల కుక్క పిల్లని చూసి ఆనందించి లాక్కుంది. పాపాయి ఎంతో ముద్దుగా ఉందట… రోజు పాపాయికి నీళ్లు తనే పోస్తుందట.. పోలికలు నావేనట. ముక్కు మాత్రం నాది కాదట…ఇవన్నీ ఒక్క నిమిషంలోనే చెప్పేసి స్నేహితురాళ్ళకి చూపించడానికి బయటికి వెళ్లిపోయింది. సుగుణ నన్ను చూడగానే నవ్వింది.ఆ కళ్ళల్లో ఏదో వింత వెలుగు. నీరసంతో పాలిపోయిన మొహం మరింత తెల్లగా కనబడుతోంది. నడుముకి కట్టు.. కాళ్ళకి చెప్పులు..చెవుల్లో దూది ఇది అవతారం. కాళ్లు కడుక్కున్న తరువాత ఉయ్యాలలో నిద్రపోతున్న పాపాయిని చూశాను. అరచేతిలో ఏదో వస్తువుని అపురూపంగా దాచుకున్నట్లు గుప్పెళ్ళు మూసి నిద్రపోతోంది పాపాయి.మనసులోని ఆనందతరంగాల్ని ఆపుకోలేక పాపాయి మీదికి వంగి ముద్దు పెట్టబోయాను.

Dress The Professional Toy
https://www.chandamama.com/index.php?route=product/product&path=3_23&product_id=35116

శ్యామల స్నేహితుల దగ్గరికి వెళ్లి తిరిగి వచ్చింది కాబోలు కుక్కపిల్లకి బలవంతంగా పాలు పట్టించడానికి ప్రయత్నిస్తోంది. బలవంతంగా మూతిని పాల గిన్నెలోకి పెట్టిన అది నోరు తెరిచి తాగటం లేదు. “ఏమిటి బావగారు! ఇలాంటి దాన్ని తెచ్చారు. ఇదేమి తినటం లేదు. తాగటం లేదు. ఏదో మందు తిన్నట్టు మందంగా ఉంది” అంది శ్యామల. “కడుపు మాడిన తరువాత అదే తింటుందిలే అని ఓదార్చాను”.

రెండు రోజులు సరదాగానే గడిచింది. మూడవరోజు ఉదయమే పాపాయికి ఒళ్ళు కొంచెం వెచ్చబడింది. సుగుణ ఏడుపు మొదలు పెట్టింది. ఇంట్లో అందరూ హడావిడి పడిపోతున్నారు.మామయ్య గారు డాక్టర్ గారి కోసం పరిగెత్తారు. కేవలం కొద్ది రోజుల క్రితం ఈ భూమి మీద అడుగు పెట్టిన పాపాయి మా జీవితాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అనుబంధాలు చూస్తుంటే చాలా వింతగా అనిపించింది. కుక్కపిల్ల అలాగే పడుకుని ఉంది. దాని ముందు పాల గిన్నె నిండుగా ఉంది. ఇంచుమించు లేవలేని పరిస్థితికి వచ్చేసింది.

ఇప్పుడు అది నాకు ఒక సమస్య. అది చచ్చిపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. హఠాత్తుగా నాకు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది.నేను మనుషుల మనస్తత్వాలను అంచనా వేయగలనన్న నమ్మకం నాకు ఇన్నాళ్లు ఉండేది. అది ఆ దేవుడికే తెలియాలి… కానీ ఒక మూగ జంతువు మూడు రోజుల నుంచి పడుతున్న నరకయాతాన్ని అర్థం చేసుకోకుండా మూర్ఖుడిలా ప్రవర్తించాను. తల్లి ప్రేమ విశ్వజనీయమైనది. కుక్కపిల్లతో సహా హఠాత్తుగా బయలుదేరిన నన్ను చూసిన ఇంట్లో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పాపకి నయమైన తరువాత వెళ్ళమని సుగుణ బ్రతిమాలింది. కానీ ఇప్పుడు నా మనోఫలకం ఒకే ఒక దృశ్యాన్ని చూపిస్తోంది. ఈ కుక్కపిల్ల ప్రాణం పోకముందే దాని తల్లి దగ్గరకు చేర్చాలి. తన దగ్గర పాలు తాగుతున్న దీన్ని వాళ్ళ అమ్మ ఆప్యాయంగా తాకుతుంటే చూడాలి.

Chandamama Kids Collection Link

Leave a Reply